పురుషులూ.. ఈ వార్త వింటే తప్పకుండా మీకు కడుపులో తిప్పుతుంది. ఒకటికి రెండు సార్లు మీ ప్రైవేట్ పార్ట్‌ను చెక్ చేసుకుంటారు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఓ వింత ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం గుగూల్ సెర్చ్‌లో వచ్చిన సమాధానమే. 


పురుషాంగం బొద్దింకలకు ఆవాసమా?: బొద్దింకలకు పురుషాంగాలు తగిన ప్రదేశాలట. ఇటీవల ‘గూగుల్ సెర్చ్‌’కు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘పురుషాంగంలో బొద్దింకలు జీవించగలవా?’’ అని ఎవరో గూగుల్‌లో సెర్చ్ చేశారు. దానికి సమాధానంగా.. ‘‘ఖచ్చితంగా, అది సర్వసాధారణం. మీరు నిద్రలో ఉన్నప్పుడు పురుషాంగ రంథ్రం ద్వారా 5 నుంచి 10 బొద్దింకలు లోపలికి చేరుతాయి. అవి ఏడాది పాటు జీవించగలవు. వాటిని మీరు గుర్తించలేరు కూడా’’ అని పేర్కొంది. ఆ సమాధానంలోని బ్రాకెట్‌లో ‘‘అందుకే బొద్దికంలను ‘కాక్’రోచ్ అని అంటారు’’ అని రాసి ఉంది. అది చూసిన నెటిజనులు ‘‘వామ్మో’’ అంటూ నోరెళ్లబెట్టారు. 


Also Read: రియల్ IT, 33 మందిని చంపేసి ఇంట్లోనే పూడ్చేసిన ‘జోకర్’ - ఇతడి వాంగ్మూలం దడ పుట్టిస్తుంది


ఈ పోస్ట్ చేసి నెటిజనులు ఫన్నీగా స్పందిస్తున్నారు. అయితే, ఇందులో నిజమెంత అనేది తెలీదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు అందులో వాస్తవం లేదని, పురుషాంగాలకు ఆవాసాలు కాదని తెలుపుతున్నాయి. నిద్ర సమయంలో ఒకవేళ లోనికి దూరితే ఆ స్పర్శ తెలుస్తుందని పేర్కొన్నాయి. పురుషాంగాల్లో నివసించడం వల్లే బొద్దింకలకు ‘కాక్‌రోచ్’ అనే పేరు వచ్చిందనే ప్రచారం కూడా ఫేక్ అని చెబుతున్నాయి. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. 


Also Read: శీఘ్ర స్కలనానికి ‘కరెంట్ షాక్’, ఈ చికిత్సతో ఏడాదిలోనే ఆ ‘పవర్’, అధ్యయనం వెల్లడి


వైరల్‌గా చక్కర్లు కొడుతున్న పోస్ట్ ఇదే: