Liver Diseases : ఆయుర్వేదం, పురాతన వైద్య విధానం.. నేటి ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులను ప్రభావవంతంగా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఆయుర్వేదం మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు అంటున్నారు. దీనిలో భాగంగానే ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ఆయుర్వేదం, యోగా & ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వైద్య విధానాలను గుర్తించి.. వాటిని ప్రోత్సాహిస్తుంది. మూలికలు, ఆహార సిఫార్సులు, జీవనశైలి పద్ధతుల కలయికతో కాలేయాన్ని కాపాడటంలో ఆయుర్వేదం ఎలా ముఖ్యపాత్ర వహిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

ఆయుర్వేద సూత్రాల ప్రకారం.. కాలేయాన్ని పిత్త దోషం నియంత్రిస్తుంది. ఇది జీవక్రియ, శరీరాన్ని డీటాక్స్ చేయడాన్ని క్రమబద్ధీకరిస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, మద్యం, ఒత్తిడి కారణంగా కాలేయ సమస్యలు వస్తాయి. ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి కాలేయ రుగ్మతలకు దారితీస్తాయి. ఈ సమస్యలను దూరం చేయడానికి, కాలేయం సహజ పనితీరును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉన్నాయి. 

కాలేయ ఆరోగ్యానికై ఆయుర్వేద మూలికలు (Ayurvedic Herbs for Liver Detox)

ఆయుర్వేదం ద్వారా చేసే మూలికా వైద్య విధానం కాలేయ నిర్విషీకరణ, పునరుత్పత్తికి మద్దతు ఇచ్చే వివిధ రకాల సహజ నివారణలను అందిస్తుంది. వాటిలో భూమ్యామలకి (ఫిలాంథస్ నిరూరి) ఒకటి. ఇది కాలేయాన్ని రక్షించే యాంటీవైరల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే కుట్కి (పిక్రోరిజా కుర్రోవా) పిత్త ఉత్పత్తి, కణాల పునరుత్పత్తికి హెల్ప్ చేస్తుంది. కల్మేఘ్ (ఆండ్రోగ్రాఫిస్ పానికులేటా) కూడా మరొక ముఖ్యమైన మూలిక. ఇది కాలేయాన్ని శుభ్రపరిచే ప్రభావాలకు, హెపటైటిస్, ఫ్యాటీ లివర్ నయం చేయడానికి హెల్ప్ చేస్తుంది. 

Continues below advertisement

పునర్నవ (బోయర్హేవియా డిఫ్యూసా) ఇది శోథ నిరోధక, యాంటీ-అసిటిస్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. గుడుచి (టినోస్పోరా కార్డిఫోలియా) ఇది టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు (కర్కుమా లాంగా) దీనిలోని కర్కుమిన్ సమ్మేళనం కాలేయ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది.

పతంజలి హెల్త్ క్యాంపెయిన్​లో రిజల్ట్స్?

కొవ్వు కాలేయం, సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలతో బాధపడుతున్న రోగులకు తమ ఆరోగ్య కార్యక్రమం ఉపశమనం కలిగించిందని పతంజలి పేర్కొంది. చాలా సంవత్సరాలుగా ఇతర వైద్య విధానాలలో విఫలమైన చికిత్సల తర్వాత.. తమ కేంద్రాలలో ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం కలయికతో కొందరు మంచి రిజల్ట్స్ (Patanjali Claims About Liver Treatment) చూశారని సంస్థ తెలిపింది.

పతంజలి హైలెట్ చేసిన రివ్యూలు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక కేసును హైలైట్ చేస్తూ.. 15 సంవత్సరాలకు పైగా కాలేయ సిర్రోసిస్‌తో పోరాడుతున్న నిషా సింగ్ అనే మహిళ.. 10 రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నట్లు నివేదించిందని పతంజలి తెలిపింది. 

అలాగే మరొక ఉదాహరణలో.. “మహారాష్ట్రకు చెందిన జ్ఞానేశ్వర్ విఠల్‌రావు పాటిల్ కాలేయ సిర్రోసిస్ చికిత్స కోసం రెండవసారి పతంజలికి వచ్చారు. ఆయుర్వేద మందులు, ప్రాణాయామం, మూలికా కషాయాలతో సహా సూచించిన చికిత్సతో.. అతని వైరల్ లోడ్ 1.2 మిలియన్లకు పైగా ఉండగా.. అది ఇప్పుడు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిందని ఆయన చెప్పారు.” అని పేర్కొంది. 

“పంజాబ్‌లోని లుధియానాకు చెందిన పవన్ కుమార్ గులాటి కాలేయ మార్పిడి కోసం సిద్ధం కావాలని వైద్యులు సూచించారు. కానీ పతంజలిలో పరీక్షల తర్వాత.. అతనికి కాలేయ సిర్రోసిస్ లేదని.. అతని జీర్ణవ్యవస్థ పూర్తిగా బాగుందని వైద్యులు తెలిపారు” అని కంపెనీ పేర్కొంది.

పతంజలి చికిత్సా పద్ధతులు

పతంజలి కాలేయ సంరక్షణ నమూనాలో భుజంగాసన, మార్కటాసన, శవాసన, వక్రాసన, గోముఖాసన, మండూకాసన వంటి యోగా భంగిమలు హెల్ప్ చేస్తాయని తెలిపారు. అలాగే కపాలభాతి, అనులోమ్ విలోమ్ వంటి శ్వాస పద్ధతులు కోలుకునేందుకు హెల్ప్ చేస్తున్నాయని తెలిపారు. రోగులకు పండ్లు, భోజనం, కాలేయాన్ని డీటాక్స్ చేసే ఆహారంతో కూడిన మొక్కల ఆధారిత ఆహారం కూడా ఇస్తారట. మట్టి ప్యాక్‌లు, వేడి, చల్లని కాపడం.. పొత్తికడుపు చుట్టు, సూర్య స్నానం వంటి చికిత్సలు కూడా ఈ విధానంలో భాగమేనని తెలిపారు.

ఈ వాదనలు ఆసక్తిని, ఆశావాదాన్ని రేకెత్తిస్తున్నప్పటికీ.. రోగులు ఏదైనా కొత్త చికిత్సను ప్రారంభించే ముందు.. ముఖ్యంగా దీర్ఘకాలిక కాలేయ సమస్యల విషయంలో అర్హత కలిగిన ఆయుర్వేద లేదా వైద్య నిపుణులను సంప్రదించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రత్యామ్నాయ, సమగ్ర వైద్యంపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ.. కాలేయ ఆరోగ్యంపై ఆయుర్వేదం శతాబ్దాల నాటి జ్ఞానం ఆధునిక ఆరోగ్య కథనంలో తిరిగి తన స్థానాన్ని పొందుతున్నట్లు కనిపిస్తుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.