కంటి చూపు సరిగా లేని వాళ్ళు ఎక్కువగా కళ్ళజోడు ధరిస్తారు. కానీ అది పెట్టుకుని మొహం అందవిహీనంగా ఎక్కడ చేసుకుంటాంలే అని మరికొంతమంది కళ్ళలో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటారు. అవి పెట్టుకోవడం వల్ల చూపు బాగా కనిపిస్తుందని అంటారు. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం కొంచెం కష్టం, అంతే కాదు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా. వాటిని కంట్లో అలాగే పెట్టుకుని నిద్ర పోకూడదు. అలా చేస్తే అవి కళ్ళలోకి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టి ఇతర సమస్యలకి దారి తీసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం కాంటాక్ట్ లెన్స్ లు ప్రతి రోజు పెట్టుకుంటూ అలాగే వదిలేసింది. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 లెన్స్ లు పెట్టుకుంటూనే ఉంది వాటిని కంట్లోనే వదిలేస్తూ వచ్చింది. చివరికి ఏమైందో తెలుసా..!


కాలిఫోర్నియాకి చెందిన ఒక మహిళకి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం అలవాటు. అలా ప్రతి రోజు వాటిని పెట్టుకుంటూనే ఉంది. కానీ వాటిని తీసేయడమే మర్చిపోయింది. అలా ప్రతి రోజు వాటిని తియ్యకుండానే కొత్త కాంటాక్ట్ లెన్స్ ధరిస్తూ వచ్చింది. ఇలాగే దాదాపు 23 లెన్స్ లు పెట్టుకుంటూనే ఉంది. అవన్నీ కంటి రెప్ప కింద ఉండిపోయాయి. ఒక రోజు కంట్లో నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. పరీక్షించిన డాక్టర్ ఆమె కంతో 23 లెన్స్ లు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.


ప్రత్యేకమైన పరికరంతో వాటిని విజయవంతంగా తొలగించాడు. లెన్స్ లు ఒకదానికి మరొకటి అతుక్కుని రెప్పల కింద ఉండిపోయాయి. వాటిని చాలా జాగ్రత్తగా వైద్యుడు తొలగించిన వీడియోని సదరు డాక్టర్ సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. కంటి నుంచి తొలగించిన ఆ లెన్స్ ఆకుపచ్చ రంగులోకి మారిపోయి అతుక్కుని ఉన్నాయి.


కాంటాక్ట్ లెన్స్ మంచివేనా? నిపుణులు ఏమంటున్నారు?


కళ్ళజోడు పెట్టుకోవడం ఇష్టం లేని వారికి ఇవి అద్భుతమనే చెప్పాలి. ప్రయాణం, వ్యాయామం వంటి పనులు చేసేటప్పుడు కళ్ళ జోడు పెట్టుకుని ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా మంది. అటువంటప్పుడు కాంటాక్ట్ లెన్స్ ఉపయోగకరంగా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. ఎక్కువ మంది వాటిని అందం కోసం పెట్టుకుంటున్నారు. సైట్ ఉన్న వాళ్ళు వాటిని పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. కానీ లెన్స్ కరెక్ట్ గా వాడకపోతే దీర్ఘకాలంలో అవి దృష్టిని ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


లెన్స్ వల్ల దుష్ప్రభావాలు


కళ్ళకి ఆక్సిజన్ సరఫరా అడ్డుకుంటుంది: లెన్స్ లు నేరుగా కార్నియా మొత్తాన్ని కప్పి ఉంచుతాయి. దీని వల్లఅ కళ్ళకి చేరే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల సిలికాన్ హైడ్రోజెల్ లెన్స్‌లను ధరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి  ఎక్కువ ఆక్సిజన్‌ను ప్రసారం చేయగలవు.


కళ్ళు పొడిబారతాయి: కాంటాక్ట్ లెన్స్‌లు కార్నియాపై వచ్చే కన్నీళ్ల సంఖ్యను పరిమితం చేస్తాయి. కన్నీళ్ళు లేకపోవడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ ఏర్పడుతుంది. దురద, కళ్ళల్లో మంట, కళ్ళు ఎర్రగా మారిపోవడం జరుగుతుంది.


గర్భ నిరోధక మాత్రలు వేసుకోకూడదు: కాంటాక్ట్ లెన్స్ ధరించినప్పుడు గర్భనిరోధక మాత్రలు ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి వేసుకోవడం వల్ల కళ్ళు విపరీతంగా పొడిబారిపోతాయి. కళ్లకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పరిమితం చేయడం వల్లఅ ఇన్ఫెక్షన్ బారిన పడి పరస్థితి మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంది.


కార్నియల్ రిఫ్లెక్స్‌లను తగ్గిస్తుంది: కాంటాక్ట్ లెన్స్‌లను చాలా కాలం పాటు ఉపయోగిస్తే కార్నియా రిఫ్లెక్స్ తగ్గిపోతుంది. కార్నియల్ రిఫ్లెక్స్ మన కళ్లకు ఏదైనా ప్రత్యక్ష గాయం కలిగించినా,  దుమ్ము ధూళి మన కళ్ల వైపు వచ్చినా మనం కళ్ళు మూసుకునేలా చేస్తుంది. ఇది తగ్గితే కనురెప్పలు కొట్టడం తగ్గిపోతుంది. దీని వల్ల కళ్ళు దెబ్బతింటాయి.


కార్నియా స్క్రాచింగ్: లెన్స్ లు కళ్ళలో సరిగా పెట్టుకోకపోతే కార్నియా మీద గీతలు పడే అవకాశం ఉంది. కళ్ళు పొడిబారినప్పుడు కార్నియల్ రాపిడికి కారణమవుతుంది.


కళ్లకలక: కాంటాక్ట్ లెన్స్ ఎక్కువ సేపు ఉంచుకోవడం, ముఖ్యంగా రాత్రి పూట పెట్టుకుంటే కళ్ళ కలక వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.


కార్నియాలో అల్సర్: కంటి కార్నియాలో ఫంగస్, బ్యాక్టీరియా, పరాన్నజీవి ఇన్‌ఫెక్షన్ లేదా వైరస్‌ల వల్ల ఓపెన్ సోర్ ఏర్పడినప్పుడు కార్నియాలో అల్సర్‌లు ఏర్పడతాయి. ఈ అల్సర్‌లకు సకాలంలో చికిత్స అందించకపోతే శాశ్వత అంధత్వానికి కారణమవుతుంది.


Also Read: బిర్యానీ ఆకు రుచే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుందండోయ్


Also Read: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు ఫుడ్స్ ఎంపిక చేసుకుంటే సరి