Break Bad Habits : అత్యంత వేగంగా వెళుతున్న ఈ ప్రపంచంలో ముందుకు సాగడం కోసం, మెరుగైన జీవనశైలిని అనుసరించడం వీలుకాక చాలా మంది ఆ తొందరపాటులో పాటు అనేక చెడు అలవాట్లకు బానిసవుతారు. ఈ బిజీ లైఫ్ లో కెరీర్ లో విజయం సాధించేందుకు చాలా ఎత్తుగడలు, ప్రయత్నలు చేయడంలో తప్పులేదు. కానీ ఆ విజయమనే మెట్టును చేరుకోవడం అంత సాధ్యం కాదు. అందుకు కొన్ని అలవాట్లు అత్యవసరం. వాటిని రోజూ వారి జీవితంలో చేర్చుకుంటే సక్సెస్ అవడం అంత కష్టంగా ఏమీ అనిపించదు. అయితే మరి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేందుకు, చెడ్ అలవాట్లను దరి చేరనీయకుండా చేసేందుకు కొన్ని చర్యలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


సానుకూలంగా ఉండటం


ప్రతికూలత అనేది ప్రతి అంశాన్ని చెత్తగా లేదా చెడుగానే చూపిస్తుంది. దీని వల్ల ఎల్లప్పుడూ నిరాశే ఎదురవుతుంది. అది మీకు మీకు సృష్టించుకునే అతిపెద్ద అడ్డంకులలో ఒకటిగా మారుతుంది. ఇది మీ లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుకుంటుంది. క్రమంగా ఇది మీ ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. కాబట్టి ఏ విషయాన్నైనా నెగెటివ్ గా కాకుండా పాజిటివ్ ధోరణిని అలవర్చుకోండి. ఏది జరిగినా అంతా మంచికే అన్న ఆలోచనల్లో ఉండండి.


గాడ్జెట్లకు దూరంగా ఉండడం


నేటి తరం ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో ఎక్కువగా గడుపుతున్నారు. వారి జీవితంలో ఎక్కువ సమయం వాటికే సమయం వెచ్చిస్తున్నారు. ఇది నిద్ర అలవాట్లలో అసమతుల్యతకు దారితీస్తుంది. కొంతమందికి నిద్ర రావడం కష్టంగా కూడా అనిపించవచ్చు, మరికొందరు అతిగా నిద్రపోవచ్చు. ఈ రెండు రకాల అలవాట్లు ఆరోగ్యానికి, భవిష్యత్తుకు హానికరం. కావున ఆరోగ్యకరమైన జీవనం, మెరుగైన భవిష్యత్తు కోసం ఈ అలవాటును మానుకోవడం మంచిది.


బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయొద్దు


చాలా మంది ఏదో ఒక కారణంతో రోజువారీ జీవితంలో అవసరమైన ప్రాథమిక అంశాలను విస్మరిస్తూ ఉంటారు. మెరుగైన జీవనశైలిని ఏర్పరచుకునే దిశగా ప్రయత్నంలో, వారు వివిధ సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. కాబట్టి ఆహారంలో అత్యంత ముఖ్యమైన అల్పాహారం లేదా బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం మర్చిపోవద్దు. మీరు మీ వర్క్ ను స్టార్ట్ చేసే కంటే ముందు కనీసం మితమైన ఆహారమైనా తీసుకోవడం ఉత్తమం.


అతిగా ఆలోచించడం వల్ల ఏం లాభం లేదు


జర్నల్ ఆఫ్ అబ్నార్మల్ సైకాలజీ అధ్యయనం ప్రకారం, అతిగా ఆలోచించడం లేదా అదే ఆలోచనల్లో కూరుకుపోవడం రెండూ మీ శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల ఏమీ లాభముండదు. అదనంగా సమయం వృథా అవుతుంది, విలువైన శక్తి హరించిపోతుంది. కాబట్టి అతిగా ఆలోచించడం వల్ల ఉద్యోగ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఆందోళన లేదా నిరాశకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఒకే చోట కూర్చోవడం మానేయండి


ఈ రోజుల్లో, చాలా మందిలో పెరుగుతున్న అలవాట్లలో ఒకటి సోఫా లేదా మంచం మీద ఎక్కువసేపు కూర్చోవడం. ఏ పని చేయకుండా అస్సలు కదలకుండా ఉండటం. ఇది భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీని నివారించడం ఆవశ్యకం. ఒకే చోట కూర్చునే బదులుగా జనసమూహం ఉన్న వివిధ కార్యకలాపాలలో పాల్గొనాలి, పుస్తకాలు చదవడం, బహిరంగ ఆటలు ఆడటం, నడక, వ్యాయామం, యోగా చేయడం లేదా వారికి ఆసక్తి ఉన్న ఏదైనా ఇతర కార్యకలాపాలలోనైనా పాల్గొనాలి.



స్థిరమైన మనస్తత్వంతో ఇబ్బందులు


ఒక వ్యక్తికి ఎల్లప్పుడూ స్థిరమైన మనస్తత్వం ఉండకూడదు. ఆ మనస్తత్వంలో మెరుగుదల ఉండేలా చూసుకోవాలి. సమాజానికి, జనరేషన్ కు తగ్గట్టు ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ మనస్తత్వం మిమ్మల్ని అభ్యాసకుడిగా మార్చడానికి, తప్పులను & విమర్శలను అంగీకరించడానికి, వాటిని అవకాశాలుగా చూడటానికి అనుమతిస్తుంది. అందువల్ల, పెద్దవాళ్లు వాళ్ల పిల్లల్ని చిన్న వయసు నుంచే మెరుగైన భవిష్యత్తు కోసం ఈ అలవాట్లను నేర్పించాలి.


అతి ఖర్చుతో ముప్పు


అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం మానుకోవాలి. అలాంటి వాటిపై ఎప్పటికప్పుడు నియంత్రణ కలిగి ఉండాలి. కొన్నిసార్లు, మనం అవసరం లేని వాటిపై భారీగా ఖర్చు చేస్తూ ఉంటాం. అత్యవసర సమయాల్లో, క్లిష్ట సమయాల్లో & పరిస్థితులలో పొదుపు మీకు సహాయపడుతుంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ పొదుపు అలవాటును చేసుకోవాలి. 


వీటితో పాటు విమర్శలను స్వీకరించడం, అవసరమైన సమయాల్లో నో చెప్పడం వంటి విషయాలూ భవిష్యత్తులో ముందుకు సాగేందుకు, విజయాన్ని చేరుకునేందుకు ఉత్తమ మార్గాలని చెప్పవచ్చు.


Also Read : Kitchen Remedies: వాస్తు ప్రకారం వంటగదిలో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి - సానుకూల వాతావరణం కోసం ఎలాంటి రంగులు వాడాలి..?