Don’t Ignore These Warning Signs : చాలామంది నిపుణులు చెప్పే మాట ఏంటి అంటే.. ''శరీరం చెప్పే మాట వినండి'' అని. అవును మరి ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది కలిగే ముందు శరీరం కొన్ని విషయాలు చెప్తుంది. కొన్ని సంకేతాలు ఇస్తుంది. అయితే చిన్న సమస్యలే కదా ఏమి కాదులే అని వాటిని అస్సలు పట్టించుకోరు. దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని విషయాలను అస్సలు విస్మరించవద్దని.. చెప్తున్నారు నిపుణులు. అలాంటి వాటిలో అస్సలు విస్మరించకూడని సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. 


తల తిరగడం


అనుకోకుండా శరీరం ఇచ్చే సంకేతాల్లో తలతిరగడం, ఫటిగో కూడా ఒకటి. ఇలా సడెన్​గా కళ్లు తిరగడమనేది థైరాయిడ్ సమస్యలను, ఎనెమియా, ఒత్తిడి వంటి సమస్యల్ని సూచిస్తుంది. 


శ్వాసలో ఇబ్బందులు


శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందా? ఇది గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతం. కాబట్టి వెంటనే వైద్యుల సహాయం తీసుకోండి. సడెన్​గా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నా లేదా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నా చికిత్స తీసుకోవాలి. 


బరువులో మార్పులు


అనుకోకుండా బరువు తగ్గడం లేదా అనుకోకుండా బరువు పెరగడం కూడా మంచిది కాదు. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్​ను లేదా మెటబాలీజం సమస్యలను సూచిస్తాయి. 


ఛాతీలో నొప్పి


ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుందా? అయితే అది హార్ట్ ఎటాక్ కావొచ్చు. కాబట్టి ఈ సంకేతాన్ని అస్సలు విస్మరించకండి. గుండెపోటు వచ్చే ముందు తెలిసే సంకేతాల్లో ఇది కూడా ఒకటి. 


తలనొప్పి


వివిధ కారణాల తలనొప్పి రావొచ్చు. కానీ తరచుగా, ఎక్కువసార్లు తలనొప్పి వస్తుందా? అయితే మీరు కొన్ని విషయాలపై ఫోకస్ చేయాలి. తలనొప్పి డీహైడ్రేషన్, ఒత్తిడి, నిద్రలేమి, న్యూరోలాజికల్ సమస్యలను హైలెట్ చేస్తుంది. కాబట్టి దానిపై ఫోకస్ చేయాలి. మరీ తీవ్రంగా ఉంటే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. 


నిద్ర సమస్యలు 


యాంగ్జైటీ, హార్మోనల్ సమస్యలు నిద్రలేమిని చూపిస్తాయి. కాబట్టి నిద్రలో సమస్యలున్నా.. నాణ్యమైన నిద్ర లేకున్నా.. కూడా వైద్య సహాయం తీసుకుని.. దానిని రీసెట్ చేసుకోవాలి. 


నొప్పులు


శరీరంలో వివిధ కారణాల వల్ల నొప్పులు రావడం సహజం. అయితే నొప్పులు ఎక్కువగా రావడం, తీవ్రంగా ఉండడం, కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతూ ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. శరీరంలో విటిమిన్ డి తగ్గినప్పుడు, ఇన్​ఫ్లమేషన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలను ఈ నొప్పులు సూచిస్తాయి. 


యూరిన్


యూరిన్ లేదా మోషన్​లో మార్పులు కూడా ఆరోగ్య సమస్యలకు సంకేతాలే. యూరిన్ లేదా మోషన్​లో బ్లడ్ రావడం జరిగితే జీర్ణసమస్యలు, ఇన్​ఫెక్షన్లు, లివర్ సమస్యలను సూచిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉంటే కూడా వీటిలో మార్పులు ఉంటాయి. 


నోటి దుర్వాసన.. 


నోటి నుంచి దుర్వాసన రావడం లేదా రుచిలో మార్పులు ఉంటే అది కిడ్నీ సమస్యల్ని సూచిస్తుంది. అలాగే డెంటల్ సమస్యలు కూడా నోటి దుర్వాసనను ప్రేరేపిస్తాయి. 


గాయాలు


ఏదైనా గాయమై.. అది త్వరగా తగ్గకపోతే అది డయాబెటిస్ లేదా రక్తప్రసరణలో మార్పులను సూచిస్తుంది. కాబట్టి ఈ మార్పును గుర్తిస్తే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. 


వీటిలో ఏ లక్షణాలు కనిపించినా.. ఎక్కువకాలం కంటిన్యూ అయినా వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాలి. లక్షణాలు ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే.. పరిస్థితి తీవ్రం కాకుండా ఉంటుంది. 





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.