Vegetables: పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేయాలా... ఈ కూరగాయలు రోజూ తినండి

ఎక్కువమందికి కొవ్వు పొట్ట దగ్గరే పేరుకుపోతుంది. దీనివల్ల అందం, ఆరోగ్యం రెండూ నష్టపోతాం.

Continues below advertisement

ఆధునిక కాలంలో అధిక బరువు పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా ఆ బరువంతా పొట్ట దగ్గరే పేరుకుపోతుంది. పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకోవడానికి జిమ్ లు చుట్టు తిరుగుతూ, ఇంట్లో వర్కవుట్స్ చేస్తూ చాలా బిజీ అయిపోయింది నేటి తరం. అయితే వాటితో పాటూ ఈ కూరగాయలు తరచూ తింటుంటే పొట్ట కొవ్వు త్వరగా కరిగిపోతుందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

Continues below advertisement

బీన్స్
బీన్స్ కూరంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అవెంతో ఆరోగ్యకరమైనవి కూడా. వీటిలో ఫైబర్ నిండుగా ఉంటుంది. ఈ ఫైబర్ కొవ్వు కరిగేందుకు సహకరిస్తుంది. అంతేకాదు బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతి రెండు రోజుకోసారి బీన్స్ ను ఏదో ఒక రూపంలో తింటే మంచిది. 

పాల‌కూర‌
పాలకూర బరువు నియంత్రణకే కాదు, పోషకాల పరంగా కూడా చాలా మంచిది. పిల్లలు, పెద్దలూ ఇద్దరికీ ఈ కూర ఎంతో మేలు చేస్తుంది. కొవ్వును కరిగించే గుణాలు ఇందులో ఎక్కువ. పాలకూరను తక్కువ నూనెలో వండి రోజూ తింటే చాలా మంచిది. అదనపు కొవ్వు కరిగిపోతుంది.

క్యారెట్లు
క్యారెట్లు ఎన్ని తిన్నా క్యాలరీలో ఒంట్లో చేరవు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజూ క్యారెట్లు పచ్చివి తింటే మేలు. క్యారెట్ కూర వండుకుని తిన్నా మంచివే.  పొట్ట దగ్గర కొవ్వు సులువుగా కరిగేందుకు క్యారెట్లలోని పోషకాలు సహకరిస్తాయి. 

బ్రకోలీ
బ్రకోలీలో కూడా పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అలాగే ఫైటో కెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వును కరిగించేందుకు పోరాడతాయి. ఇందులో ఉండే ఫోలేట్ కూడా కొవ్వు చేరకుండా అడ్డుకుంటుంది. 

కీరాదోస
కీరాదోసలో కూడా క్యాలెరీలు చాలా తక్కువగా ఉంటాయి. నేరుగా ఎన్ని తిన్నా మంచిదే. కాకపోతే చలికాలంలో అధికంగా తింటే జలుబు చేసే సమస్య ఉంది. వీటిలో కూడా ఫైబర్ అధికంగానే ఉంటుంది. బరువు తగ్గేందుకు, పేరుకున్న కొవ్వు కరిగేందుకు కీరాదోసలోని గుణాలు సహకరిస్తాయి. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతున్నారా... కిడ్నీలు దెబ్బతినొచ్చు జాగ్రత్త

Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో మూడు ఖర్జూరాలు... చలికాలంలో వేడి పుట్టించే ఆహారం

Continues below advertisement
Sponsored Links by Taboola