కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఇది వచ్చే ముందు ఎటువంటి లక్షణాలు కనిపించవు. శరీరంలో మార్పులు వచ్చి లావుగా మారితే కానీ కొలెస్ట్రాల్ సమస్య ఎదుర్కొంటున్నామనే విషయం తెలియదు. అధిక కొలెస్ట్రాల్ గుండెకి ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయి. తగ్గించుకొకపోతే మాత్రం ప్రాణాంతకం కావచ్చు. అందుకే చెడు కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పని వ్యాయామంతో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ 1 శాతం తగ్గింపు వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ఒక శాతం తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం ఈ పానీయాలు చక్కగా పని చేస్తాయి.


గ్రీన్ టీ


ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే పానీయాలలో గ్రీన్ టీ ఒకటి. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో అందిస్తుంది. ఊబకాయం ఉన్న వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. బీఎంసీ పోషకాహార జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం గ్రీన్ టీ తీసుకోవడం వల్ల హైపర్లిపిడెమియా నుండి రక్షణగా ఉందని బలమైన ఎపిడెమియోలాజిక్ ఆధారాలు ఉన్నాయి. ఇది పేగుల్లోని కొవ్వుల శోషణ తగ్గిస్తుంది. అలాగే జపాన్ లో నిర్వహించిన మరొక అధ్యయనం ప్రకారం 7-10 సంవత్సరాల పాటు రోజుకి కనీసం రెండు కప్పుల గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల హృదయ సంబంధ సమస్యల వచః చిపోయే అవకాశం చాలా తక్కువగా ఉందని తేలింది. రోజుకి 3-5 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల మరణ ప్రమాదం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది.


సోయా పాలు


పాలకు ఉత్తమ ప్రత్యామ్నాయాలలో సోయా పాలు ఒకటి. లాక్టోస్ అసహనం ఉన్న వాళ్ళు సోయా పాలు చాలా మంచిది. ఇందులోని ప్టైడ్‌ల సహాయంతో కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది. సోయా ప్రోటీన్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందోని మరొక అధ్యయనం వెల్లడించింది. అపెక్స్ బాడీ ప్రకారం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి రోజుకి 25 గ్రాముల సోయా ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది.


దానిమ్మ రసం


యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఆక్సిడైజ్డ్ ఎల్‌డిఎల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెడ్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు 3-10 శాతం తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దానిమ్మ రసంలో టానిన్లు, ఆంథోసైనిన్‌లు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండూ యాంటీ అథెరోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ని కరిగించేస్తుంది.


ఇవే కాదు యాపిల్స్, అరటిపండు, బెర్రీలు, నారింజ, అవకాడో వంటి పండ్లు కూడా చెడు కొలెస్ట్రాల్ పోగొట్టుకునేందుకు సహాయం చేస్తాయి. నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు కొవ్వుని కరిగించేస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?