Skincare Routine to Reduce Acne : మొటిమలు, జిడ్డు చర్మం సమస్య ఈ రోజుల్లో చాలా సాధారణం. ముఖంపై అకస్మాత్తుగా మొటిమలు రావడం.. తరచుగా జిడ్డుగా అనిపించడం, మచ్చలు చాలా కాలం పాటు ఉండటం ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగించే విషయం. చాలామంది దీని కోసం ఖరీదైన ఉత్పత్తులు లేదా వివిధ రకాల నివారణలను ప్రయత్నిస్తారు. కానీ సరైన దినచర్యను పాటించకపోవడం వల్ల చర్మ సమస్య మరింత పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు.
చర్మ సంరక్షణ సరైన మార్గంలో ఉండాలని.. దానిని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మొటిమలు, మచ్చలు వస్తాయని చెప్తున్నారు. ఇది అత్యంత ప్రభావవంతమైన స్కిన్ అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ సులభమైన, ప్రభావవంతమైన దినచర్యను అనుసరిస్తే.. మొటిమలు నెమ్మదిగా తగ్గుతాయని చెప్తున్నారు. చర్మం స్పష్టంగా, తాజాగా, సహజమైన మెరుపును అందిస్తుందట. కాబట్టి మొటిమల సమస్యను ఎలా వదిలించుకోవాలో.. మెరిసే చర్మం కోసం ఉపయోగపడే చిట్కాలు ఏంటో చూసేద్దాం.
మొటిమలను తగ్గించే రొటీన్ ఇదే
ఫేస్ వాష్ - మొటిమలను నియంత్రించడానికి ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం రోజుకు రెండుసార్లు తేలికపాటి, సున్నితమైన, నూనె లేని ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి. దీనివల్ల మురికి, చెమట, అదనపు నూనెను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల మొటిమలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తాయి.
టోనర్ - ముఖం కడిగిన తర్వాత టోనర్ వాడటం చాలా ముఖ్యం. టోనర్ చర్మం pHని సమతుల్యం చేస్తుంది. ఇది రంధ్రాలను చిన్నదిగా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది. నూనెను నియంత్రిస్తుంది. మొటిమలు ఉన్న చర్మం కోసం నియాసినామైడ్ లేదా రోజ్ వాటర్ టోనర్ ఉత్తమమైనవిగా చెప్తారు.
మాయిశ్చరైజర్ - మొటిమలు ఉన్న చర్మానికి కూడా తేమ అవసరం. తేలికపాటి, జిడ్డు లేని మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం వల్ల చర్మం ప్రశాంతంగా ఉంటుంది. పొడిబారదు. ఇది మొటిమలు పెరగకుండా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
సీరం - ముఖంపై మొటిమల మచ్చలు ఉంటే.. సీరం చాలా సహాయపడుతుంది. నియాసినామైడ్, సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన సీరం మచ్చలను తగ్గించడంలో, మొటిమలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. సీరంను ప్రతిరోజూ లేదా వారానికి కొన్నిసార్లు ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. నెమ్మదిగా చర్మం మెరుస్తూ ఉంటుంది. మొటిమలు కూడా తగ్గుతాయి.
సన్‌స్క్రీన్ - సూర్యరశ్మి మొటిమలను పెంచుతుంది. మచ్చలను నల్లగా చేస్తుంది. రోజులో బయటకు వెళ్లే ముందు నూనె లేని, జెల్ ఆధారిత సన్‌స్క్రీన్ రాయండి. ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాయడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. త్వరగా దెబ్బతినదు.
ఎక్స్‌ఫోలియేషన్ - ఎక్స్‌ఫోలియేషన్ చర్మం నుంచి చనిపోయిన కణాలను తొలగిస్తుంది. ఇది రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తుంది. మొటిమలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. తేలికపాటి సాలిసిలిక్ యాసిడ్ కలిగిన ఎక్స్‌ఫోలియేటర్‌ను ఉపయోగించండి. ఎక్కువగా రుద్దడం లేదా పదేపదే ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుందని గుర్తుంచుకోండి.
టచ్ చేయవద్దు - మొటిమలను తాకడం వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరి సమస్య మరింత పెరుగుతుంది. మొటిమలను పిండటం వల్ల మచ్చలు ఏర్పడతాయి. చర్మానికి నష్టం జరుగుతుంది. ముఖం, చేతులను శుభ్రంగా ఉంచుకోండి. ఇది మొటిమలు తగ్గడానికి సహాయపడుతుంది.
నీరు తాగాలి, నిద్రపోవాలి - శరీరంలో నీరు తగ్గడం వల్ల చర్మం త్వరగా దెబ్బతింటుంది. రోజంతా తగినంత నీరు తాగడం వల్ల చర్మం స్పష్టంగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. బాగా నిద్రపోవడం వల్ల చర్మం విశ్రాంతి తీసుకుంటుంది. మొటిమలు కూడా తగ్గుతాయి.
హెల్తీ లైఫ్‌స్టైల్ - సమతుల్య ఆహారం, తక్కువ నూనె, జంక్ ఫుడ్, తగినంత పండ్లు, కూరగాయలు చర్మానికి మేలు చేస్తాయి. ఒత్తిడిని తగ్గించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. సరైన జీవనశైలిని అవలంబించడం వల్ల చర్మం సహజమైన మెరుపును పొందుతుంది. మొటిమలు నియంత్రణలో ఉంటాయి.