ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఇష్టమే. ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకుంటూ కోడిగుడ్లు విసురుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఆ రంగులు నేరుగా చర్మం, జుట్టు మీద పడిపోతాయి. సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోతే చర్మ సమస్యలే కాదు జుట్టు కూడా ఇబ్బంది పడుతుంది. అందుకే రంగుల బారి నుంచి జుట్టుని సంరక్షించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
హోలీ కోసం జుట్టుని ఎలా సిద్ధం చేసుకోవాలి?
పొడి, చిట్లిన జుట్టు స్పాంజ్ లాగా పని చేస్తుంది. దాని మీద పడిన ప్రతిదాన్ని గ్రహించుకుంటుంది. అందుకే హోలీకి రెండు, మూడు రోజుల ముందు డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ అవసరం. ఇది డ్యామేజ్ ని రిపేర్ చేయడంలో సహాయపడుతుందని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. హెయిర్ క్యూటికల్స్ ని రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం జుట్టుకి నూనె రాయాలి. ఇది క్యూటికల్స్ పై రక్షణ పవర్ ఏర్పరుస్తుంది. హోలీ రోజు ఉదయం కొబ్బరి నూనె లేదా బేబీ ఆయిల్ తో జుట్టుకు మళ్ళీ నూనె రాసుకోవడం మంచిది. జుట్టుని పోనీటైల్ లాగా కట్టుకోవాలి. జుట్టుకు నూనె రాసేముందు సూర్యుని నుంచి రక్షణ కోసం SPF ఉన్న లీవ్ ఇన్ కండీషనర్‌ను ఉపయోగించడం మంచిది.
స్ప్లిట్ ఎండ్స్ కత్తిరించాలి
హోలీ ఆడే ముందు మీ జుట్టు చివర్ల ఉండే స్ప్లిట్ ఎండ్స్ కత్తిరించడం చాలా ముఖ్యం. ఇవి రంగులను ఎక్కువసేపు అలాగే పట్టేసుకుంటాయి. సింథటిక్ రంగులు మీ జుట్టుని పొడిగా మారచేస్తాయి. ఇవి జుట్టుకి మరింత చీల్చేస్తాయి.
జుట్టు ముందుగానే కడగాలి
పండగ రోజు ముందు రాత్రి జుట్టు బాగా శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి కండిషన్ పెట్టాలి. పొద్దునే జుట్టుకి నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది.
నూనెతో మసాజ్ చేసుకోవాలి
జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల అది రక్షణ కవచంగా పని చేస్తుంది. జుట్టులోపలి వరకు రంగు పోయిన కూడా దాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ఉపయోగించి తలకు మసాజ్ చేసుకోవాలి.
స్కార్ఫ్ తప్పనిసరి
జుట్టుకు నూనె పూసిన తర్వాత దాన్ని కవర్ చేయడం మరొక పని. తలను స్కార్ఫ్ లేదా మరొక విధంగా కప్పి ఉంచేలా చూసుకోవాలి. లూజ్ హెయిర్ అసలు వద్దు. పోనీటైల్ వేసుకోవాలి. ఇది తలపై రంగుని గ్రహించకుండా కాపాడుతుంది.
జుట్టుకి హోలీ రంగులు వదిలించడం ఎలా?
హోలీ ముందు జుట్టుని ఎలా సంరక్షించుకుంటామో అలాగే రంగులు పడిన తర్వాత కూడా వెంట్రుకలు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. స్కాల్ఫ్ పై రంగులు పడితే చుండ్రు, సెబోరోహెయిక్ డెర్మటైటిస్ వంటి స్కాల్ఫ్ సమస్యలకు దారితీస్తుంది. రంగుల్లో సాధారణంగా ఆయిల్స్ ఉంటాయి. అవి వాటిని జిడ్డుగా, సింథటిక్ గా మార్చేస్తాయి.
హెడ్ బాత్
వేడి నీటిని కాకుండా చల్లటి నీటితో జుట్టు శుభ్రం చేసుకోవాలి. తర్వాత తేలికపాటి ఆర్గానిక్ షాంపూని ఉపయోగించే చేతివేళ్ళతో తల మీద మసాజ్ మాదిరిగా రబ్ చేసుకుంటూ జుట్టు క్లీన్ చేసుకోవాలి. డీప్ కండిషనర్ అప్లై చేసి బాగా కడగాలి. జుట్టు డ్రై అయిన తర్వాత హెయిర్ సీరమ్ వాడటం మంచిది.
దువ్వెనతో దువ్వాలి
తలస్నానం చేసే ముందుగా జుట్టుని దువ్వెనతో దువ్వడం మంచిది. ఇది జుట్టు నుంచి పొడి రంగులను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత జుట్టుని ఒకటికి రెండు సార్లు బాగా కడగాలి. సల్ఫేట్, పారాబేన్ లేని తేలికపాటి షాంపూని ఉపయోగించాలి.
హెయిర్ మాస్క్ వేయాలి
హోలీ అయిపోయిన రెండు మూడు రోజుల తర్వాత రంగుల వల్ల కలిగే నష్టం నుంచి బయట పడేందుకు హెయిర్ మాస్క్ అప్లై చేయాలి. నిమ్మకాయ, గుడ్డు, పెరుగు, ఉసిరికాయ కలిపి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టుకి తిరిగి తేమని అందిస్తుంది.
ఆయిల్ మసాజ్
హోలీ వేడుక అయిన వారం రోజుల పాటు ప్రతిరోజు రాత్రిపూట ఆయిల్ మసాజ్ చేసి తెల్లారి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టుకి మృదుత్వం ఇవ్వడం కోసం బాదం, కొబ్బరి, ఆలివ్, ఆముదం నూనె రాసుకుంటే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: హోలీ రోజు భంగ్ ఎందుకు తాగుతారు? ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడటం ఎలా?