రెంజ్ కలర్ లోని క్యారెట్ అందాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దానికి ఉన్న రంగు అందరినీ ఆకర్షించేస్తుంది. ఇది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకొక క్యారెట్ తింటే అనేక అనారోగ్య సమస్యలను దూరం పెట్టేయవచ్చని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి రక్షణగా నిలుస్తాయి. క్యారెట్ తినలేకపోతే చక్కగా జ్యూస్ చేసుకుని తాగొచ్చు.


క్యారెట్లు కళ్ళకు చాలా మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ప్రతిరోజు తిన్నా కూడా కేలరీల సంఖ్య పెద్దగా పెరగదు. ఇందులో విటమిన్ ఏ, సి, అధిక మొత్తంలో కె ఉన్నాయి. శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడే లూటీన్, జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్ పిగ్మెంట్‌లను కూడా కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే క్యారెట్ జ్యూస్ ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. క్యారెట్ జ్యూస్ వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇవి..


కళ్ళకు మంచిది


క్యారెట్ లో ఉండే వివిధ పోషకాల కారణంగా కళ్ళకు మేలు చేస్తుందని అంటారు. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. కళ్ళకు ఎంతో అవసరమైన విటమిన్ ఇది. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ కాంతి వల్ల కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వయసు సంబంధిత మచ్చలు, ఇతర కంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.


రోగనిరోధక శక్తి


కూరగాయలు శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే వాటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తి బలపడేందుకు సహకరిస్తాయి. విటమిన్, ఏ, సి రోగనిరోధక వ్యవస్థని పెంచడంలో సహాయపడే కీలకమైన వాటిని క్యారెట్ అందిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్ డ్యామేజ్ ని నివారిస్తుంది.


షుగర్ లెవల్స్ అదుపులో


మధుమేహంతో బాధపడే వాళ్ళు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తాయి. క్యారెట్ జ్యూస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పదార్థం. అందుకే డయాబెటిక్ రోగులకు చాలా మంచి ఎంపిక. ఇదే కాదు గట్ లో మంచి బ్యాక్టీరియా ప్రేరేపించడానికి సహాయపడుతుంది.


చర్మానికి మంచిది


క్యారెట్ రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇందులోని కెరొటీనాయిడ్స్ సూర్యుని UV కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.


కాలేయానికి మంచిది


యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, కెరొటీనాయిడ్స్ ఉన్నాయి. ఇవి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) నుంచి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.


క్యాన్సర్ ని నిరోధిస్తుంది


క్యాన్సర్ కణాల పురోగతిని మందగించేలా చేయడంలో క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కు కారణమయ్య ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి. క్రమం తప్పకుండా క్యారెట్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కాఫీ ఇలా తాగారంటే మెదడు మటాష్! రోజుకి ఎన్ని కప్పుల కాఫీ తాగాలంటే..