Miss World final: మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో కన్నులు మిరుమిట్లు గొలిపేలా జరిగింది. అందాల భామను ఎంపిక చేసే జడ్జిల ప్యానల్‌లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు.
ఫినాలేలో విజేతను ఎంచుకునే జడ్జిల ప్యానెల్‌లో క్రింది ప్రముఖులు ఉన్నారు
సోనూ సూద్ : నటుడు మరియు సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఈ ఈవెంట్‌లో ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డుతో సత్కరించారు.
నమ్రతా శిరోద్కర్: మాజీ మిస్ ఇండియా, ఫ్యాషన్ ఎక్స్ పర్ట్ సుధా రెడ్డి: బ్యూటీ విత్ ఎ పర్పస్ గాలా డిన్నర్‌ను హోస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త.
రానా దగ్గుబాటి : ప్రముఖ నటుడుకరీనా టైరెల్: మిస్ ఇంగ్లాండ్ 2014, పబ్లిక్ హెల్త్ ఫిజీషియన్, ఫిలాంత్రోపిస్ట్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఫెలో.జూలియా మోర్లీ: మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు CEO మానుషి చిల్లర్: భారత నటి , మిస్ వరల్డ్ 2017డోనా వాల్ష్: మిస్ వరల్డ్ 2025 అధికారిక స్టేజ్ డైరెక్టర్
ఈ కార్యక్రమ హోస్ట్‌లు కూడా ప్రత్యేకమైన వారే. మిస్ వరల్డ్ 2016 స్టెఫాని డొల్ వాలే, ప్రముఖ భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభార్ ఈ బాధ్యతలు అద్భుతంగా నిర్వహించారు. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ , ఇషాన్ ఖట్టర్ వేదికపై డాన్సులు వేశారు.
అతిధుల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. భారత బ్యూటీ నందినీ గుప్తా టాప్ ఎయిట్ లోకి చేరలేకపోయారు. కానీ టాప్ మోడల్ ఛాలెంజ్ విభాగంలో విజేతగా నిలిచారు. సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ను వేదిక మీద అంద చేశారు.