Home Tip For Glowing Skin: అందమైన, మెరిసే చర్మంతో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు వారి స్కిన్ కేర్ రొటీన్ ఏమిటో, ఏ రకమైన ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారో మనసులో అనుకుంటూ ఉంటాం కదా? కానీ, మీ ఇంట్లో వంటగదిలోనే మీ చర్మాన్ని పార్లర్‌లో చేసినట్లుగా మెరిపించే అమేజింగ్‌ మందు ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? అవును, ఇది నిజమే. పచ్చి పాలు, అన్నం ఫేస్ ప్యాక్ గురించి మాట్లాడుతున్నాం. ఇవి రెండూ మన ఇంట్లో సులభంగా దొరుకుతాయి .  వీటితో తయారుచేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మెరుగైన రంగుతో పాటు మృదువుగా, గట్టిగా  యవ్వనంగా ఉంచుతుంది.

ఈ రెండు పదార్థాలు చాలా ఉపయోగకరమైనవి. మీరు కొంతకాలం వీటిని ఉపయోగిస్తే, ప్రతి ఒక్కరూ మీ చర్మం ఎలా మెరుస్తుందో అడుగుతారు.

పచ్చి పాలు

పచ్చి పాలు మీ చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేస్తాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మృదువుగా చేస్తుంది. అలాగే ఇది  టాన్‌ను తొలగించడంలో,  రంగును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

రైస్‌

రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E ఉంటాయి, ఇవి చర్మ త్వరగా ముడతలు పడకుండా నిరోధిస్తాయి. బియ్యపు పిండి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. అందుకే జపనీస్ మహిళలు శతాబ్దాలుగా రైస్‌ నీరు పేస్ట్‌ను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.

ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం

2 టీస్పూన్ల రైస్ లేదా ఉడికించిన ముద్దను పొడి చేసుకోండి

2-3 టీస్పూన్లు పచ్చి పాలు

ఒక చిటికెడు పసుపు

ఒక గిన్నెలో బియ్యపు పిండి తీసుకోండి

అందులో పచ్చి పాలు కలపండి. మృదువైన పేస్ట్ తయారు చేసుకోండి

అవసరమైతే పసుపు కలిపి ఫేస్ ప్యాక్‌ను మరింత ప్రభావవంతం చేయవచ్చు

తరువాత దాన్ని మీ ముఖంపై వేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి

20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగాలి

వారానికి రెండుసార్లు మాత్రమే దీన్ని వాడండి. మీ ముఖం ఎలా మెరుస్తుందో చూడండి

పెద్ద సంఖ్యలో బ్యూటీ ఉత్పత్తులు, ఖరీదైన ఫేషియల్స్‌ను వదిలిపెట్టి, ఈ ఇంటి చిట్కాను ఒకసారి ప్రయత్నించండి. వంటగదిలోని ఈ రెండు చౌకైన, ప్రభావవంతమైన పదార్థాలు మీ చర్మ సౌందర్యాన్ని అంతగా మెరుగుపరుస్తాయి, మీ అందానికి రహస్యం ఏమిటో ప్రజలు అడుగుతారు.

గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.