ఎండ వేడి శరీరం మీద కంటే పెదవుల మీద భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పెదవుల చర్మం వాస్కులర్ గా ఉంటుంది. అంటే పెదవుల్లో రక్త ప్రవాహాన్ని పెంచే రక్త నాళాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మన పెదాలు గులాబీ లేదా ఊదా రంగులో ఉంటాయి. లిప్స్ మీద ఉండే ఎపిడెర్మిస్ లేదా బయటి పొర ద్వారా అవి రక్షించబడతాయి. ఇది ఎక్కువగా కెరటినో సైట్లతో కుడి ఉంటుంది. కింద పెదవికి అదనపు రక్షణ అవసరం. ఎందుకంటే పై పెదవితో పోలిస్తే ఇక్కడ చర్మ క్యాన్సర్ అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు ఇది వడదెబ్బకి గురయ్యే ప్రమాదం అధికమే. ముఖం నుంచి కొద్దిగా బయటకి రావడం వల్ల ఎక్కువ సూర్యరశ్మి దానికి తగులుతుంది.  


ఇతర శరీర భాగాల మాదిరిగానే యూవీ రేడియేషన్ కాలక్రమేణా చర్మ కణాల డీఎన్ఏ ని దెబ్బతీస్తుంది. క్యాన్సర్ కణాల అభివృద్ధికి దారి తీయవచ్చు. పెదాలు సూర్యరశ్మికి గురైనప్పుడు 2-5 గంటలలోపు కొన్ని లక్షణాలు చూపిస్తుంది సున్నితత్వం, పొడిబారిపోవడం, బిగుతుగా మారడం, మంటలు, తేలికపాటి వాపు వంటివి ఎండలో కాలిపోయినప్పుడు పెదవులు చూపించే లక్షణాలు. ఒక్కోసారి పెదాల మీద బొబ్బలు, పగుళ్లు కూడా కనిపిస్తాయి.


వడదెబ్బ తగిలిన పెదవులకు చికిత్స


వడదెబ్బ తగిలిన పెదవులకు తప్పనిసరిగా చికిత్స చేయాలి. చల్లగా ఉండే లేపనాలతో చికిత్స చేస్తే మంచిది. శరీరంపై వడదెబ్బకు ఉపయోగించే కొన్ని సంప్రదాయ నివారణను పెదవులకు అంత మంచి చేయకపోవచ్చు. అందుకే వాటి మీద అదనపు శ్రద్ధ పెట్టాలి.


కోల్డ్ కంప్రెస్


పెదవుల వేడి అనుభూతిని తగ్గించేందుకు కోల్డ్ కంప్రెస్ ఉపయోగించవచ్చు. మెత్తని వాష్ క్లాత్ తీసుకుని చల్లని నీటిలో కడిగి పెదాల మీద మెత్తగా మర్దన చేసుకోవాలి. ఐస్ వాటర్ లో ముంచి లిప్స్ మీద రుద్దితే మరీ మంచిది. కానీ వాటి మీద నేరుగా ఐస్ పెట్టకూడదు.


అలోవెరా


కలబంద జెల్ సన్ బర్స్ సంబంధిత నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఒక ఆకుని కట్ చేసుకుని అందులోని జెల్ తీసి పెదాలకు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బయట షాపుల్లో దొరికే అలోవెరా జెల్ కొనుగోలు చేసుకుని ఎప్పుడు బ్యాగ్ లో ఉంచుకోండి. అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. చల్లని అనుభూతి పొందటం కోసం జెల్ ని కాసేపు రిఫ్రిజిరేటర్ లో కూడా నిల్వ చేసుకుని ఆ తర్వాత పెదాలకు రాసుకోవచ్చు.


మాయిశ్చరైజర్


చికాకు కలిగించే చర్మానికి తేమ జోడించడం వలన సన్ బర్న్ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. పెట్రోలియం కలిగిన మాయిశ్చరైజర్ ని తప్పనిసరిగా నివారించాలి. ఇది చర్మంపై సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని లాక్ చేస్తాయి. సున్నితంగా, మృదుత్వాన్ని ఇచ్చే తేలికపాటి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి.


DIY చికిత్సలు


☀ తేమ అధికంగా ఉండే నూనెలు లేదా ఓట్ మీల్ తో చేసిన పేస్ట్ రాసుకుంటే సన్ బర్న్ లక్షణాలు తగ్గిస్తుంది. బాదం ఆయిల్ చాలా ప్రభావవంతమైన మాయిశ్చరైజర్. ఇందులో విటమిన్ ఇ ప్రయోజనాలు సన్ డ్యామేజ్ తో పోరాడుతుంది. వాపు, చికాకుని తగ్గిస్తుంది.


☀ ఇంట్లో సులభంగా దొరికే కొబ్బరి నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో శోథ నిరోధక, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. మంట, పగుళ్లు లక్షణాలను తగ్గిస్తుంది.


☀ గ్లిజరిన్ పెదాలను మృదువుగా, హైడ్రేట్ గా చేస్తుంది. పొడి బారిన పెదవులను మెత్తగా మార్చేస్తుంది.


☀ పొడి, దురదగా అనిపించే పెదవులకు కొల్లాయిడల్ వోట్మీల్, నీరు కలిపిన మిశ్రమం పేస్ట్ రాసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.


☀ పెదవులకు సంబంధించిన ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు వాటిలో ఉపయోగించే పదార్థాల జాబితా తప్పనిసరిగా చూసుకోవాలి. లిడోకాయిన్, బెంజోకాయిన్ వంటి కైన్ జాబితా పదార్థాలు నివారించాలు. పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.


 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: పరగడుపున ఖాళీ పొట్టతో ఈ టీ తాగితే బరువు తగ్గడం సులువు