అందాన్ని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. వీలైనంత వరకు ఎదుటివారి కంటే తాము అందంగా ఉండాలనే కోరుకుంటారు. మేకప్ తో కొంతవరకు అందంగా కనిపించేందుకు ట్రై చేస్తారు. కానీ సహజమైన మెరుపు మాత్రం దక్కదు. కానీ రాత్రిపూట ఈ ఖచ్చితమైన విధానాలు పాటించారంటే మాత్రం మీరు కోరుకున్నట్టు సహజమైన మెరుపు, నిగనిగలాడే మోము మీ సొంతం అవుతుంది. ప్రకాశవంతమైన చర్మానికి దోహదపడే ఈ ఐదు టెక్నిక్స్ నైట్ టైమ్ ఫాలో అయిపోండి. మీలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది.


క్లెన్సింగ్: పడుకునే ముందు ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. రోజంతా పేరుకుపోయిన మేకప్, మురికి, కాలుష్యాలని తొలగించుకోవాలి. లేదంటే చర్మం చికాకు పెడుతుంది. చికాకు తగ్గించుకునేందుకు చర్మ రకానికి సరిపడే క్రీమ్స్ రాసుకోవాలి. 


మాయిశ్చరైజర్: చర్మానికి సరిపడా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించాలి. హైడ్రేటింగ్ నైట్ క్రీమ్ వాడితే మంచిది. రాత్రిపూట చర్మం పునరుత్పత్తి చెందుతుంది. మాయిశ్చరైజర్ రాయడం వల్ల తేమ లాక్ అవుతుంది. చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.


కంటి మేకప్ తొలగించాలి: నిద్రపోయే ముందు తప్పనిసరిగా కళ్లలో పెట్టుకున్న లెన్స్ తొలగించాలి. అలాగే మస్కారా, ఐలైనర్ తో పాటు కంటి చుట్టు వేసుకున్న అలంకరణ మొత్తం తీసేయాలి. కళ్ల చుట్టు ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతినకుండా ఉండేందుకు ఐ మేకప్ రిమూవర్ ఉపయోగించండి.


సీరమ్: రెగ్యులర్ గా సీరమ్, రెటినాయిడ్స్ లేదా విటమిన్ సి ఉత్పత్తులు ఉపయోగించడం మంచిది. ఇవి ముడతలు, నల్ల మచ్చలు, మొటిమలు నివారించడంతో పాటు చర్మ సమస్యల్ని పరిష్కరించగలవు. సీరమ్ ఉపయోగించే ముందు చర్మ వ్యాధి నిపుణుల సలహా ప్రకారం తీసుకోవడం మంచిది.


బ్యూటీ స్లీప్: అందం కోసం ఏవేవో చేస్తారు కానీ కంటి నిండా నిద్ర అన్నింటి కంటే ముఖ్యమనే విషయం మాత్రం మర్చిపోతారు. నాణ్యమైన నిద్ర చర్మం పునరుత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరం, చర్మం కొలుకోవడానికి కనీసం 7-9 గంటల నిద్ర అవసరం.


మరికొన్ని చిట్కాలు


⦿ చర్మంపై రాపిడిని తగ్గించేందుకు సిల్క్ లేదా శాటిన్ పిల్లో కేస్ ఉపయోగించాలి. మనం పడుకునే దిండ్లు, దుప్పట్లు కూడా చర్మానికి హాని చేస్తాయి. మురికిగా ఉన్న వాటిని ఎక్కువ రోజులు వినియోగిస్తే అందులోని బ్యాక్టీరియా చర్మంలోకి చేరి మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు కారణమవుతుంది.


⦿ రోజంతా హైడ్రేట్ గా ఉండటం అవసరం. ఎంత నీరు తాగితే చర్మం అంత చక్కగా నిగనిగలాడుతుంది. ఆల్కహాల్, కెఫీన్ వినియోగాన్ని వీలైనంత వరకు నివారించాలి. ఇవి చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.


⦿ ఒత్తిడిని అదుపులో ఉంచుకుని మంచి నిద్రని ప్రోత్సహించేందుకు బెడ్ టైమ్ రొటీన్ అనుసరించాలి. మంచి పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. ఫోన్స్ దూరం పెట్టాలి.


⦿ ధూమపానం మానుకోవాలి. ఇది అకాల వృద్ధాప్యానికి దారి తీస్తుంది. చర్మం కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్ ని దెబ్బతీస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: డయాబెటిస్ బాధితులు గుడ్లు తీసుకోవచ్చా? రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?