వేసవిలో స్కిన్ ఎక్కువగా పాడైపోతుంది. వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రత, డీహైడ్రేషన్ వంటి కారణాల వల్ల చర్మం పేలవంగా నిర్జీవంగా కనిపిస్తుంది. దీని నుంచి బయట పడేందుకు ఉన్న అద్భుతమైన మార్గం ఆహారం. మనకి అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు తరచూ తీసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతూ ఉంటుంది. వీటిని తినడం వల్ల వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా యవ్వనంగా కనిపిస్తారు.
క్యారెట్: బీటా కెరోటిన్ తో నిండిన క్యారెట్లు కళ్ళకి మాత్రమే కాదు చర్మానికి మంచిది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించేందుకు అవసరమైన పోషకాలను, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
స్వీట్ పొటాటో: చిలగడదుంపలో అది మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరం విటమిన్ ఏ గా మారుస్తుంది. ఈ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుతుంది. యవ్వనమైన రూపాన్ని అందిస్తుంది.
బెల్ పెప్పర్స్: బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ సి చర్మానికి మేలు చేసే కొల్లాజెన్ ఉత్పత్తిలో సహకరిస్తుంది. చర్మానికి బలాన్ని, స్టిఫ్ నెస్ ఇస్తుంది.
టొమాటో: టొమాటోలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. యవ్వనమైన రూపాన్ని అందిస్తుంది.
దోసకాయ: అధిక నీటి కంటెంట్ ఉన్న దోసకాయలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. చర్మ ఉబ్బడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వాటిలో విటమిన్ సి, కె కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన మేని ఛాయని అందిస్తాయి.
కాలే: ఈ ఆకుపచ్చని ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, సి, కె లోడ్ చేయబడి ఉన్నాయి. ఇవే కాదు ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించే రాగి, ఐరన్ వంటి ఖనిజాలు లభిస్తాయి. ఇవన్నీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో సహాయపడతాయి.
బ్రకోలి: చర్మానికి మేలు చేసే మరొక ఆకుకూర బ్రకోలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉన్నాయి. చర్మ సంరక్షణకి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది సహకరిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
అవకాడో: అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. స్కిన్ ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషణ, తేమని అందిస్తుంది.
గుమ్మడికాయ: చాలా మంది గుమ్మడికాయ తినేందుకు ఇష్టం చూపించరు. కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది సెల్ టర్నోవర్ ని ప్రోత్సహించి చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మ ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గర్భిణీలకు వచ్చే ప్రాణాంతకమైన ఎక్లాంప్సియా గురించి తెలుసా? లక్షణాలు ఎలా ఉంటాయంటే
Join Us on Telegram: https://t.me/abpdesamofficial