చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టపడే పండు అరటి పండు. రోజుకి ఒక అరటి పండు తినడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. అందరికీ అందుబాటు ధరలో ఉంటూ అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. పసి పిల్లలకి ఆరో నెల తర్వాత పెట్టె మొదటి పండు అరటి పండు. ఇది పిల్లలకి చాలా మంచిదని అంటారు. మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్, బి6, విటమిన్ సి ఇందులో పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్లు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె జబ్బులు వచ్చే అవకాశాలను అరటి పండు తగ్గిస్తుంది.


ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలను ఇది శరీరానికి అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ పండ్లను తీసుకోవడం మంచిదని అంటారు. కొంతమంది అయితే ఆకలిగా అనిపించినప్పుడు పరగడుపున అరటి పండు తింటారు. దాని వల్ల పొట్ట కాస్త నిండుగా అనిపిస్తుంది. ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. అటువంటి అరటి పండు వల్ల నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అయితే ఈ పండుని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. చాలా మంది అరటి పండ్లను అదే పనిగా తినేస్తు ఉంటారు. మోతాదుకి మించి తీసుకుంటారు. అది చాలా ప్రమాదకరం.


అరటి పండు అతిగా తినడం వల్ల వచ్చే అనార్థాలు


❂ అతిగా అరటి పండ్లు తినడం వల్ల మలబద్ధకం వస్తుంది.


❂ ఇందులో ఉండే హానికర సమ్మేళనాలు మైగ్రేన్ ని  ప్రేరేపిస్తాయి.


❂ మధుమేహులు దీనికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇందులో ఉండే ఫ్రక్టోజ్ రక్తంలో చెక్కర స్థాయిలను పెంచుతుంది.


❂ అతిగా అరటి పండు తినడం వల్ల బరువు పెరుగుతారు.


❂ పొటాషియం సమృద్ధిగా ఉండే అరటి పండు వల్ల హైపర్ కలేమియాను ఉత్పత్తి చేస్తుంది.


❂ ఫైబర్ మెండుగా ఉండటం వల్ల ఇది గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.


❂ ఈ పండుని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత క్షయం వస్తుంది.


❂ తక్కువ సమయంలో రెండు అరటి పండ్లు వెంట వెంటనే తింటే నరాలకు హాని కలుగుతుంది.


❂ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు అరటి పండ్లకు దూరంగా ఉండటమే మంచిది.


అందుకే అంటారు ఏదైనా మితంగా తింటే ఆరోగ్యం అమితంగా తింటే హానికరం అని. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికి దాని వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అన్ని పండల్లోకెల్ల అరటి పండు చాలా మంచిది. అలా అని దాన్ని అతిగా తీసుకోవడం వల్ల రోగాలను కొనితెచ్చుకున్నట్టే. అందుకే రోజుకి కేవలం రెండు అరటి పండ్లకి  మించి తినడం ఆరోగ్యానికి హానికరం. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు వైద్యులని సంప్రదించిన తర్వాతే అరటి పండుని తినేందుకు ఎంచుకోవడం ఉత్తమం.


Also read: స్త్రీలు ఏ వయసు వరకు బిడ్డను కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు?


Also read: రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం