Yoga for Back Pain : నడుము నొప్పిని దూరం చేసుకోవడానికి లైఫ్​స్టైల్​లో యోగాను కూడా పార్ట్ చేసుకోవాలంటున్నారు యోగా నిపుణులు. ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందించే యోగాను రోజూ చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చట. వాటిలో నడుము నొప్పి కూడా ఒకటి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు కొన్ని యోగాసనాలు రెగ్యులర్​గా చేయడం వల్ల వెన్నెముక స్ట్రాంగ్​ అవ్వడంతో పాటు.. నొప్పిని దూరం అవ్వడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంతకీ ఆ ఆసనాలు ఏంటి? వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


మార్జర్యాసనము 


వెన్నునొప్పిని దూరం చేయడంలో మార్జర్యాసనము మంచి ఫలితాలు ఇస్తుంది. దీనినే క్యాట్-కౌ పోజ్ అని కూడా అంటారు. ఇది వెన్నెముక ఫ్లెక్సీబుల్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే స్ట్రెచ్ చేయడం వల్ల నడుము, మెడ భాగం స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల నడుము నొప్పి దూరమవుతుంది. డెస్క్ జాబ్స్ చేసేవారు దీనిని రెగ్యులర్​గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 


బాలాసనం 


బాలాసనం కూడా రెగ్యులర్​గా చేస్తే నడుముపై ఒత్తిడి తగ్గుతుంది. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. రాత్రుళ్లు పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచిన తర్వాత చైల్డ్ పోజ్ చేయవచ్చు. కేవలం వెన్నెముకకే కాదు మెదడుకు కూడా హాయినిస్తుంది. మీరు శరీరాన్ని రిలాక్స్ చేయాలనుకున్నప్పుడు దీనిని చేస్తే మంచి ఫలితాలుంటాయి. 


అథో ముఖ స్వనాశన


అథో ముఖ స్వనాశన నడుము, హిప్స్, కింది శరీరభాగాన్ని స్ట్రాంగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. రక్తప్రసరణను పెంచి నడుముపై పడిని ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిని రెగ్యులర్​గా చేస్తే నడుము నొప్పి సమస్య దూరమవుతుంది. 


భుజంగాసన


భుజంగాసనను కూడా మీరు నడుము నొప్పి తగ్గించుకునేందుకు చేయవచ్చు. కోబ్రా పోజ్ చేయడం వల్ల లోయర్ బ్యాక్ సమస్యలు తగ్గుతాయి. ఛాతీ, భుజాలపై పడిని ప్రెజర్ కూడా నడుము స్ట్రాంగ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. 


సేతు బంధాసనం


బ్రిడ్జ్ పోజ్ చేయడం వల్ల నడుము స్ట్రాంగ్ అవుతుంది. అక్కడి కండరాలు బలంగా మారుతాయి. స్టిఫ్​నెస్ తగ్గి రిలీఫ్ వస్తుంది. లోయర్ బ్యాక్ సమస్యతో ఇబ్బంది పడేవారు దీనిని రెగ్యులర్​గా చేస్తే మంచి ఫలితాలు చూస్తారు. 


విపరీత కరణి ఆసనం


దీనినే వాల్ పోజ్ అని కూడా అంటారు. నేలపై పడుకుని గోడకు కాళ్లకు ఆనించే చేసే ఈ ఆసనం వల్ల లోయర్ బ్యాక్ సమస్యలు తగ్గుతాయి. ఇది ఒత్తిడిని కూడా తగ్గించి శారీరకంగా, మానసికంగా విశ్రాంతినిస్తుంది. 


సమస్యను దూరం చేసుకోవాలని దీనిని రష్​గా చేయకూడదు. నిదానంగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. శరీరం సహకరించినంత వరకు స్ట్రెచ్ చేస్తే మంచిది. మరీ ప్రెజర్ పెట్టకూడదు. ఏ యోగాసనం చేసినా దానిలో కనీసం 30 సెకన్ల నుంచి నిమిషం పాటు ఉండాలి. ప్రాక్టీస్ పెరిగే కొద్ది సమయాన్ని పెంచుకోవచ్చు. నడుము నొప్పి తగ్గట్లేదు అంటే కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి. 






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.