నం ఏ పని చెయ్యాలనుకున్నా కూడా శరీరంలో శక్తి చాలా ముఖ్యం. ఆయుర్వేదం సహజమైన వైద్య విధానం. ఇది మన శరీర ధర్మాలను అనుసరించి పనిచేస్తుంది. మన శరీరం పంచభూత నిర్మితం అని ఆయుర్వేదం నమ్ముతుంది. వాత, పిత్త, కఫాలు మన శరీరంలోని మూడు రకాల శక్తులు వీటినే ఆయుర్వేదం దోషాలుగా పరిగణిస్తుంది.  ఈ మూడు ప్రధాన దోషాలు ప్రకృతిలోని మూలకాలతో ముడి పడి ఉంటాయి. వాతం గాలికి సంబంధించి, పిత్తం అగ్నికి, కఫం నీటికి సంబంధించిన దోషాలు.


వాతం


వాతం శరీరంలోని అన్ని కదలికలను నియంత్రిస్తుంది. శ్వాస చలనం, హృదయ స్పందన రేటు, కండరాల సంకోచం, కణజాల కదలికలు, మనసు, నాడీ వ్యవస్థ శరీరంలోని అన్ని దిశలకు జరిగే కమ్యునికేషన్ గా చెప్పుకోవచ్చు. కణజాలాల పనితీరు, ఆకలి, దాహం, విసర్జన క్రియ, నిద్ర వంటి శరీరం నిరంతరం నిర్వహించే అన్న క్రియలకు వాతం బాధ్యత వహిస్తుందని అనవచ్చు.


పిత్తం


పిత్తం నాభి పైన ఉదరం పై భాగంలో ఉందని ఆయుర్వేదం చెబుతోంది. శరీరంలోని జీవక్రియకు, జీర్ణవ్యవస్థ పనితీరుకు భాధ్యత వహిస్తుంది. అగ్ని తత్వమైన పిత్త శక్తి శరీరంలోని జీవ క్రియల నిర్వహణ ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది.


కఫం


కఫం శరీరంలోని తేజం, శక్తి కఫం ఆధ్వర్యంలో ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థకు కఫం బాధ్యత వహిస్తుంది. ఇది ఛాతి భాగంలో ఉంటుందని ఆయుర్వేదం విశ్వసిస్తుంది. శరీరానికి బలం, స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇది జలతత్వానికి ప్రతీక కనుక కణజాలాలు, కణాలను హైడ్రేట్ చేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా కఫమే బాధ్యత వహిస్తుంది.


ఒక్కొక్కరిలో ఒక్కోలా..: అయితే ఈ మూడు దోషాలు ఒకొక్కరిలో ఒక్కోరకంగా ప్రవర్తిస్తాయి. కొందరిలో వాత దోషం ఎక్కువగా ఉంటుంది, కొందరిలో కఫం లేదా పిత్తం. ఈ దోషాల తీరును బట్టే వారీ శారీరక, మానసిక లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఈ మూడు శక్తులు సమతుల్యంలో ఉన్నపుడు మాత్రమే మానసిక, శారీరక స్థితి ఆరోగ్యంగా ఉంటుంది.


వాత ప్రకృతి: వాత ప్రకృతి కలిగిన వారు ఎప్పుడూ ఏదో ఒక విషయానికి చింతిస్తూ కనిపిస్తారు. వీరి చర్మం గరుకుగా ఉంటుంది. చిన్న ఎండిపోయిన గోర్లు ఉంటాయి. శరీరం మీద రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తాయి. పళ్ల వరుస ఎగుడుదిగుడుగా ఉంటుంది. జుట్టు కూడా ఎండిపోయినట్టుగా ఉంటుంది.  వీరిలో సృజనాత్మకత ఎక్కువ. కైండ్ హార్టెడ్ గా ఉంటారు. మల్టీ టాస్కింగ్ లో దిట్టలు. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. వీరిలో కీళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా ఉండకపోవచ్చు. అపానవాయు సమస్య వేధిస్తుండవచ్చు.


పిత్త ప్రకృతి: పిత్త ప్రకృతి కలిగిన వారిలో ఆకలి ఎక్కువ. నునుపైన చర్మం, మెరిసే జుట్టు, సన్నని స్వరం, మంచి కంటి చూపు, సున్నితమైన అవయవాలు కలిగి ఉంటారు. దాహం ఎక్కువ, చెమట ఎక్కువ, చాలా తెలివైన వారు. జ్ఞాపక శక్తి ఎక్కువ. పట్టుదలతో ఉంటారు. అసహనం, కోపం, అసిడిటి, వేడి తట్టుకోలేక పోవడం వంటి సమస్యలు వేధిస్తాయి.


కఫ ప్రకృతి: కఫ ప్రకృతిలో కలిగిన వారు మేరిసె కళ్లు, నిగనిగలాడే చర్మం, జుట్టుతో ఉంటారు. మృదువైన సంభాషణలు చేస్తారు. తెలివైన వారు, చేసే పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. ఒపిక ఎక్కువ. బలమైన ఎముకలు, నిరోధక వ్యవస్థ వీరి సొంతం. వీరి జీవక్రియలు నెమ్మదిగా ఉంటాయి. అతిగా నిద్రపోతారు. బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. శ్వాస సంబంధ అనారోగ్యాలు వేధించవచ్చు. బద్దకం కూడా ఎక్కువ.



Also read: మీ చేతి వేళ్లు ఇలా మారుతున్నాయా? అయితే, మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!