Side Effects of Turmeric : పసుపు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే దీనిని చాలామంది తమ డైట్​లో చేర్చుకుంటారు. ఇది గుండె, గట్, మెదకు పలు ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పలు పరిశోధనలు నిరూపించాయి. అయితే కొన్ని సమస్యలున్నవారు పసుపు సప్లిమెంట్లకు దూరంగా ఉండాలంటున్నారు. 


జీర్ణకోశ మందులు తీసుకున్నప్పుడు పసుపు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే పసుపు కడుపులో ఆమ్ల స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ఈ మందుల ప్రభావం తగ్గి.. అసౌకర్యానికి కారణమవుతుంది. డయాబెటిక్ మందుకు తీసుకున్నప్పుడు పసుపు ప్రతికూల ఫలితాలు ఇస్తుందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఏ ఆరోగ్య సమస్యలున్నవారు పసుపునకు దూరంగా ఉండాలో.. దానికి గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


శస్త్రచికిత్సలు..


ఆరోగ్యపరంగా సర్జరీలు చేయించుకునేవారు పసుపు, పసుపు సప్లిమెంట్లను తీసుకోవడం మానేస్తే మంచిది. ఎందుకంటే రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి శస్త్రచికిత్స షెడ్యూల్ దగ్గరకొచ్చేకొద్ది మీరు పసుపు తీసుకోవడం మానేయాలి. దీని గురించి మీ వైద్యుడితో కచ్చితంగా మాట్లాడండి. 


డయాబెటిస్ ఉన్నవారు


డయాబెటిస్ లేదా హైపోగ్లైసీమియా ఉన్నవారు పసుపును తగ్గిస్తే మంచిది. పసుపు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి మీరు డయాబెటిస్ మందులు ఉపయోగించే ముందు లేదా దీనిని తీసుకోవడం తగ్గిస్తే మంచిది. ఎందుకంటే మీరు చక్కెర స్థాయిలను తగ్గించడానికి మందులు తీసుకుంటున్నారు. పసుపు కూడా షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది కాబట్టి ఆరోగ్యానికి ఇబ్బంది కలుగవచ్చు. కాబట్టి హైపోగ్లైసీమియాకు చికిత్స చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. 


ఐరన్ లోపం ఉంటే..


ఐరన్ లోపం ఉన్నవారు తమ డైట్​లో పసుపును కాస్త తగ్గించి తీసుకుంటే మంచిది. కొన్ని పరిశోధనల ప్రకారం పసుపు జీర్ణాశయంలోని ఐరన్​ను శోషణను ప్రభావితం చేస్తుందని తేల్చాయి. కాబట్టి మీరు పసుపు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. లేదా దానిని తగ్గించి తీసుకుంటే మంచిది. 


పిత్తాశయం సమస్యలు


మీకు పిత్తాశయం సమస్యలుంటే.. పసుపు మీ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది. పసుపులోని ఆక్సలేట్ ఉంటుంది. ఇది పిత్తాశయం సంకోచాలను ప్రేరేపిస్తుంది. పిత్తాశయ సమస్యను అభివృద్ధి చేస్తుంది. 


కిడ్నీ స్టోన్స్ ఉంటే..


కిడ్నీలలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు పసుపు దూరంగా ఉంటే చాలామంచిది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో చేసిన పరిశోధన ప్రకారం.. పసుపులోని ఆక్సలేట్ కాల్షియంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుందని తేల్చింది.


గర్భిణీలు, పాలిచ్చే వారు..


గర్భిణీలు, పాలిచ్చే వ్యక్తులు పసుపునకు దూరంగా ఉంటే మంచిదిట. గర్భధారణ సమయంలో లేదా పాలు ఇచ్చే సమయంలో సప్లిమెంట్లు తీసుకోకపోవడమే మంచిదని పరిశోధనలు తేల్చాయి.  


అలెర్జీ ఉన్నవారు..


పసుపు, అల్లం, యాలకుల వల్ల అలెర్జీ ఉన్నవారు పసుపునకు దూరంగా ఉండటమే మంచిది. ఈ మూడు జింగిబెరేసి అనే కుటుంబానికి చెందినవి. కాబ్టటి వీటిలో దేనికి అలెర్జీ ఉన్నా.. పసుపునకు దూరంగా ఉండడమే మంచిది. 


పసుపు తీసుకునేవారు కూడా దానిని లిమిట్​గా తీసుకోవాలి. అధికమొత్తంలో తీసుకుంటే ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ.. ఎక్కువకాలం పసుపును ఎక్కువగా తీసుకుంటే అది కడుపునొప్పి, వికారం, అతిసారం వంటి ఇబ్బందులను కలిగిస్తుంది. కొందరిలో దద్దుర్లు కూడా వచ్చే అవకాశముంది. 


Also Read : హెయిర్​ఫాల్​ను కంట్రోల్​ చేసి.. జుట్టు పెరుగదలను ప్రోత్సాహించే సింపుల్ చిట్కాలు 






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.