కరోనా రావడం వల్ల చాలా మంది బ్యూటీ పార్లర్ కి వెళ్లలేకపోయారు. దీంతో అవాంఛిత రోమాలు తొలగించుకునేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులతోనే ఇంట్లోనే వాక్సింగ్ లేదా షేవింగ్ చేసుకోవడం మొదలు పెట్టారు. వాక్సింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అవి చర్మం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొంతమంది తెలియక ఎలా పడితే అలా వాక్సింగ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రావడం, అవాంఛిత రోమాలు సరిగా పోకుండా ఉండిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే తప్పని సరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ముందుగా చర్మం శుభ్రం చేసుకోవాలి
వాక్స్ చేసే ప్రదేశాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. చెమట, మురికి, దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవాలి. తడి టవల్ లేదా టిష్యూతో చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. ప్రీ వాక్స్ క్రీములు రాసుకోవాలి. ఇవి రాయడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. పొడిబారడం వంటిది జరగదు. వాక్సింగ్ చేసే ముందు చర్మానికి టాల్కమ్ పౌడర్ రాయడం వల్ల కూడా మృదువుగా ఉంటుంది.
ఎక్కువ వాక్సింగ్ క్రీమ్ వాడాలి
కొద్దిగా క్రీమ్ వాడటం వల్ల సరిగా వెంట్రుకలు తొలగిపోవు. అందుకే ఎక్కువగా వాక్సింగ్ క్రీమ్ ఎక్కువగా రాయడం వల్ల చర్మం లోపలికి వరకు చొచ్చుకొని పోయి అవాంఛిత రోమాలు శుభ్రంగా వచ్చేస్తాయి. కొన్ని సార్లు మైనం అవశేషాలు అలాగే ఉండిపోవచ్చు. అందుకే వాక్సింగ్ కి ఉపయోగించే మైనాన్ని మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుని రాసుకోవాలి.
మైనం ద్రవం రూపంలో ఉండాలి
హెయిర్ రిమూవల్ ప్రక్రియలో మైనాన్ని సరైన ఉష్ణోగ్రత చాలా ముఖ్యం. ఎందుకంటే వాక్స్ కి ఉపయోగించే మైనం బాగా వేడిగా ఉండటం వల్ల చర్మం దాన్ని తట్టుకోలేదు. అలా అని మైనం చల్లగా కూడా ఉండకూడదు. అలా ఉండటం వల్ల మైనం ముద్దగా మారిపోతుంది. ఒకవేళ వేడిగా ఉంటే అది మీ చర్మాన్ని కాల్చే ప్రమాదం ఉంది. అందుకే మైనాన్ని వేడి చేసిన తర్వాత చర్మానికి అప్లై చేసే ముందు దాన్ని రూమ్ టెంపరేచర్ కి తీసుకుని రావాలి. వాక్స్ చేసే మైనం పంచదార పాకం మాదిరిగా ఉండాలి.
గాయాలపై మైనం రాయకూడదు
వాక్సింగ్ చేసే ప్రదేశంలో ఏవైనా గాయాలు ఉంటే వాటి మీద వేడి మైనం రాయకూడదు. అలా చేయడం వల్ల ఆ గాయం మరింత పెద్దది అయ్యే ప్రమాదం ఉంది. గాయాలు పూర్తిగా నయం అయ్యేంత వరకు వాక్సింగ్ చేయకపోవడమే ఉత్తమం. మైనం స్ట్రిప్ త్వరగా తీసేయాలి. దాని వల్ల వెంట్రుకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వాక్సింగ్ కొద్దిగా బాధతో కూడుకున్నదే. మైనం అప్లై చేసుకున్న తర్వాత దాన్ని నిర్ణీత సమయంలో వేగంగా తీసేయాలి. లేదంటే ఆది ఆరిపోవడం వల్ల తీసుకోవడం కష్టం అవుతుంది. అప్పుడు మరింత బాధ కలుగుతుంది. అందుకే కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ స్ట్రిప్ త్వరగా లాగేయడం వల్ల వెంట్రుకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు
Also Read: గర్భిణులకు ఆకలి వేయకపోవడానికి కారణాలు ఇవే