Avoid These Foods During Monsoon : వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ సీజన్‌లో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు వేగంగా పెరుగుతాయి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వర్షాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలను వీలైనంత వరకు తగ్గించడం లేదా పూర్తిగా దూరంగా ఉంచడం మంచిదని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. 

Continues below advertisement

ఆకుకూరలు

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే ఆకుకూరలపై మట్టి, క్రిములు, పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో ఆకుకూరలను బాగా కడిగి, పూర్తిగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. 

స్ట్రీట్ ఫుడ్

రోడ్డు పక్కన అమ్మే పానీపూరి, చాట్, సమోసా వంటి ఆహారాలకు ఈ కాలంలో దూరంగా ఉండటం మంచిది. వర్షాల కారణంగా ఆహారం కలుషితం కావడం, నీటి నాణ్యత తగ్గడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది.

Continues below advertisement

కట్ చేసిన పండ్లు

బయట దొరికే కట్ ఫ్రూట్స్ లేదా ఎక్కువసేపు నిల్వ చేసిన పండ్లను తినకపోవడం మంచిది. వీటిపై బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పండ్లను ఇంట్లోనే కట్ చేసి వెంటనే తినడం ఉత్తమం.

సీ ఫుడ్

వర్షాకాలం అనేక చేపల జాతులకు సంతానోత్పత్తి కాలంగా చెప్తారు. ఈ సమయంలో చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్స్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని తినేటప్పుడు నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

బాగా వేయించిన ఫుడ్స్

పకోడీలు, బజ్జీలు, చిప్స్ వంటి వేయించిన పదార్థాలు వర్షాకాలంలో తినాలనిపించినా.. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను పెంచవచ్చు. కాబట్టి వాటిని తగ్గిస్తే మంచిది. 

నిల్వ చేసిన ఆహారం

ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులుగా ఉన్న ఆహారాన్ని ఈ సీజన్‌లో తినకపోవడం మంచిది. తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు తాజాగా వండిన ఆహారాన్నే తీసుకోవాలి.

సలాడ్లు

పచ్చిగా తినే కూరగాయలపై సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిఆకులతో, కూరగాయలతో చేసే సలాడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఉడికించిన లేదా ఆవిరి చేసిన కూరగాయలను తినవచ్చు. 

కోల్డ్ డ్రింక్స్

ఐస్ వాటర్, కోల్డ్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లను అధికంగా తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు, జలుబు, దగ్గు వచ్చే అవకాశం పెరుగుతుంది. వీలైనంత వరకు గోరువెచ్చని నీరు లేదా వేడి పానీయాలు తీసుకోవడం మంచిది.

మిల్క్ ప్రొడెక్ట్స్

పాలు, పనీర్, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజాగా కొనుక్కొని ఉపయోగించుకోవచ్చు. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. 

బయట ఫుడ్

అధిక మసాలా ఉన్న ఆహారం జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో బయట ఆహారం తినడం వల్ల కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు.

కాబట్టి వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే తాజా, వేడి, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే పైన పేర్కొన్న ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే.. సీజనల్ వ్యాధుల ఇబ్బందుల నుంచి కొంతవరకు రక్షణ పొందవచ్చు.

ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.