Foods to avoid before bedtime for better sleep : రాత్రి నిద్రలో సమస్యలున్నా.. బరువు ఎక్కువగా పెరిగిపోతున్నా.. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా డైట్​ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఫుడ్స్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. మరి రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహారాలు ఏంటో.. తీసుకుంటే నిద్రకు, ఆరోగ్యానికి కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

వైట్ బ్రెడ్ 

రాత్రుళ్లు నిద్రకు ముందు కొందరు లేట్​ నైట్ స్నాక్​గా శాండ్​విచ్​ తింటారు. దీనిని వైట్ బ్రెడ్​తో చేస్తారు. దీనిని రాత్రుళ్లు తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. దీనిని శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారు చేస్తారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి.. మధుమేహ ప్రమాదాన్ని పెంచుతాయి. 

పిజ్జా

ఫ్రెండ్స్​తో కలిసి బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా టేస్టీగా తినాలనుకుంటే చాలామంది పిజ్జాను ఎక్కువగా తింటారు. ఇది తినడానికి టేస్టీగానే ఉన్నా.. గ్రీజీగా, హెవీగా, చీజీగా ఉంటుంది. పైగా దాని పిజ్జా బేస్​లో ఫ్యాట్స్, ఎసిడిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేయడంతో పాటు.. శరీరంలో మంటను పెంచి.. కడుపు మంటని పెంచుతాయి. గట్ హెల్త్​ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. 

స్పైసీ ఫుడ్ 

రాత్రుళ్లు బిర్యానీ తిని.. లేదా ఇతర స్పైసీ ఫుడ్​ని తినేవాళ్లు చాలామంది ఉంటారు. ఆల్కహాల్​తో పాటు స్పైసీగా ఉండే ఫుడ్స్​ని తింటారు. రాత్రి నిద్రకు ముందు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల గట్ హెల్త్ కరాబ్ అవ్వడంతో పాటు ఎసిడిక్ రిఫ్లెక్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇవి నిద్రను దూరం చేస్తాయి. నిద్ర సమస్యలను పెంచే లక్షణాలు వీటిలో ఉంటాయి. 

స్వీట్స్

చాలామంది స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. లేదా రాత్రుళ్లు స్వీట్ తింటే నిద్ర బాగా పడుతుందని అనుకుని డిజెర్ట్స్ ఎక్కువగా లాగించేస్తారు. కేక్, కుకీస్, ఐస్ క్రీమ్ వంటివి తింటారు. ఇవి నిద్రను అందించడం కాదు.. నిద్ర సమస్యలను పెంచి.. శరీరంలో షుగర్ లెవెల్స్​ని పెంచుతాయి. కేవలం స్వీట్స్​ మాత్రమే కాదు.. కెఫిన్ కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. 

ఫ్రైడ్ ఫుడ్ 

గ్రీజీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్​లను తీసుకోకపోవడమే మంచిది. బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్​లను అవాయిడ్ చేయాలి. ఇవి జీర్ణ సమస్యలను పెంచి నిద్రను దూరం చేస్తాయి. అలాగే వీటిలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అధిక బరువుకు ఇవి కారకంగా మారుతాయి. మధ్యరాత్రిలో మెలకువ వచ్చి నిద్రపోవడం కష్టమవుతుంది. 

ఆ పండ్లు వద్దు.. 

సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి కానీ.. రాత్రుళ్లు వీటిని తింటే.. శరీరంలో యాసిడ్స్ ఎక్కువ అవుతాయి. టొమాటాలు, ద్రాక్షలు, ఆరెంజ్, నిమ్మకాయలు వంటి సిట్రస్ ఫ్రూట్స్ కడుపులో మంటను కలిగిస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్​కు కారణమవుతాయి. ఊరికే బ్లాడర్ ఫుల్ అవుతుంది. నిద్ర చెడిపోతుంది. 

కెఫిన్ డ్రింక్స్

రాత్రి నిద్రకు ముందు కాఫీ వంటి కెఫిన్ ఉత్పత్తులు తీసుకోకపోవడమే మంచిది. కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా నిద్రను దూరం చేస్తాయి. మీరు కెఫిన్ ఉత్పత్తులు తీసుకోవాలనుకుంటే ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకుంటే మంచిది. 

ఇవేకాకుండా లేట్​నైట్ స్నాక్స్​గా చిప్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోకూదని చెప్తున్నారు. ఈ ఫుడ్స్​ అన్నీ నిద్ర సమస్యలను పెంచడంతో పాటు బరువు పెరిగేలా చేస్తాయట. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలను పెంచుతాయి. హెల్తీ ఫుడ్​ని తీసుకుంటూ.. రాత్రి డిన్నర్​లో 7లోపు ముగిస్తే మంచి నిద్ర అందడంతో పాటు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయని చెప్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.