AI Safety Rules : ఈరోజుల్లో AI చాట్‌బాట్‌లు వినియోగం బాగా పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరు తమ లైఫ్‌లో వివిధ అవసరాల కోసం AIని ప్రశ్నలు అడగడం చేస్తున్నారు. ఇవి వారికి కావాల్సిన సమాధానాలు ఇచ్చి పనిని సులభతరం చేస్తున్నాయి. కొత్త సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే మీరు ఈ చాట్‌బాట్‌లను కొన్ని రకాల ప్రశ్నలు అడిగికే నేరమని మీకు తెలుసా? అలాగే మీరు AI చాట్‌బాట్‌లను కొన్ని క్వశ్చన్స్ అడిగితే.. చట్టపరమైన చిక్కుల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా దేశాలలో సైబర్ చట్టాలు (cyber law awareness) చాలా కఠినంగా మారాయి. తప్పు ప్రశ్నలు లేదా తప్పుడు సమాచారం అడగడం కూడా నేరంగానే పరిగణిస్తున్నారు. అందుకే చిన్న తప్పు ప్రశ్న కూడా పెద్ద నష్టాన్ని ఇవ్వచ్చు.
చట్టవిరుద్ధమైన సమాచారమే నేరమా!?
చాలా మంది సరదాగా లేదా ఆసక్తితో చాట్‌బాట్‌లను చట్టానికి వ్యతిరేకంగా ఉండే సమాచారం ( AI misuse) కోసం అడుగుతారు. ఉదాహరణకు ఆయుధాలు తయారు చేయడం, బ్యాంకింగ్ వ్యవస్థను హ్యాక్ చేయడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లేదా సైబర్ దాడి చేయడం వంటి వాటి గురించి ప్రశ్నలు అడుగుతారు. దీనిలో భాగంగా భారతదేశ IT చట్టం(India cyber security laws).. సైబర్ భద్రతా చట్టాల ప్రకారం.. అటువంటి సమాచారం కోసం అడగడం లేదా తెలుసుకోవాలని ప్రయత్నించడం కూడా నేరంగా పరిగణిస్తారు. సిస్టమ్ లాగ్‌లలో ఇది రికార్డ్ అయితే.. దర్యాప్తు సంస్థలు దీనిని అనుమానాస్పద కార్యకలాపంగా భావిస్తాయి.
హింస, అల్లర్లు గురించిన ప్రశ్నలు
ఏదైనా చాట్‌బాట్ హింసను ప్రేరేపించే, అల్లర్లను రేకెత్తించే లేదా చట్టవిరుద్ధమైన సంస్థలకు సంబంధించిన ప్రశ్నలకు ప్రతిస్పందిస్తే.. అది తీవ్రమైన నేరం కావచ్చు. భద్రతా సంస్థలు అటువంటి ప్రశ్నలపై వెంటనే అప్రమత్తమవుతాయి. మీ ప్రశ్న రికార్డ్‌లలో భద్రపరుస్తారు. దీని ఆధారంగా మీపై చర్య కూడా తీసుకోవచ్చు.
ప్రభుత్వ డేటా, భద్రతకు సంబంధించిన సమాచారం
చాలాసార్లు ప్రజలు పోలీసు నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందో.. సైనిక వ్యవస్థలను ఎలా ఛేదించాలో లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌లలోకి ఎలా చొరబడాలో అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలు అడగడం దేశ భద్రతతో ఆటలాడటంగా పరిగణిస్తారు. చాలా దేశాలలో ఇది గూఢచర్యం లేదా సైబర్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. దీనికి జైలు శిక్ష కూడా విధించవచ్చు.
వ్యక్తిగత సమాచారం కోసం..
ఒక వ్యక్తి చిరునామా, బ్యాంక్ వివరాలు, స్థానం లేదా వ్యక్తిగత డేటాను చాట్‌బాట్ ద్వారా అడగడం కూడా నేరం. ఇది సైబర్ స్టాకింగ్, డేటా దొంగతనానికి వస్తుంది. డిజిటల్ సిస్టమ్‌లో అటువంటి ప్రశ్న సేవ్ అవుతుంది. ఫిర్యాదు వచ్చినప్పుడు మిమ్మల్ని సులభంగా ట్రాక్ చేస్తారు.
ఆ తప్పులు చేయకండి
- చాట్‌బాట్‌ల నుంచి ఎప్పుడూ చట్టవిరుద్ధమైన లేదా నిషేధిత సమాచారాన్ని అడగవద్దు.
- సరదాగా లేదా ప్రయోగాలలో కూడా ప్రమాదకరమైన ప్రశ్నలు అడగవద్దు.
- సైబర్ భద్రతా చట్టాల గురించి తెలుసుకోండి.
- ప్రతి ప్రశ్నను ఆలోచించి అడగండి. ఎందుకంటే రికార్డ్ ఎల్లప్పుడూ సేవ్ అవుతుంది.
AIని అవసరాల కోసం లేదా సమాచారం కోసం ఉపయోగిస్తే ఎంత బెనిఫిట్ అవుతుందో.. అవసరమైన వాటి గురించి సెర్చ్ చేస్తే అంతే డేంజర్ కూడా అవుతుంది.