Meghasandesam Serial Today Episode: కుర్చీలో కనిపించకుండా కూర్చున్న చెర్రి గొంతు మార్చి శరత్‌ చంద్రలా నక్షత్రను పిలుస్తాడు. నక్షత్ర ఏంటి డాడీ అని అడుగుతుంది. ఒకసారి మేడ మీదకు రామ్మ నీతో మాట్లాడాలి అంటాడు. వస్తున్నాను డాడీ అంటూ నక్షత్ర మేడ మీదకు వెళ్తుంది.

Continues below advertisement


నక్షత్ర: చెప్పండి డాడీ..


చెర్రి: ఏమ్మా ఇప్పుడు నీ నడుము నొప్పి ఎలా ఉంది..?


నక్షత్ర: పోయింది డాడీ అంతా సెట్‌ అయిపోయింది.


చెర్రి: ఓ చెర్రి నిన్ను బాగా చూసుకున్నాడు అన్నమాట. అందుకే ఇంత తొందరగా రికవరీ అయ్యావు..


నక్షత్ర: వాడి ముఖం వాడేం చేశాడు డాడీ నాకు.


చెర్రి: (నీ మెంటల్‌ దానా నాతో నూనె రాయించుకున్నావు కదే అప్పుడే మర్చిపోయావా..?  చెప్తాను నీ పని) పెళ్లికి ముందు అరేయ్‌ ఒరేయ్‌ అన్నా పర్వాలేదు.. కానీ పెళ్లి అయ్యాక కూడా వాణ్ని వాడు వీడు అంటావేంటమ్మా..?


నక్షత్ర: అదే డాడీ ఆయన ముఖం నా హెల్త్‌ సెట్ అవ్వడంలో ఆయన పాత్ర ఏమీ లేదని చెప్తున్నాను డాడీ. ఫిజియోథెరపిస్టు చెప్పినట్టు చేసి నేను నా నడుం నొప్పి తగ్గించుకున్నాను డాడీ.. ఆయన వేస్ట్‌ ఫెలో నాకు ఎటువంటి హెల్ప్‌ చేయడు.,.,


చెర్రి: ఒక్క ఆయన అన్న పదం మార్చావే తప్పా నీ మాటల్లో వాడి మీద కొంచెం కూడా గౌరవం లేదు. ఇలాగే ఉంటే మీ మధ్య ఇంకా దూరం పెరిగిపోతూ ఉంటుంది. నా మాట విని మీరు హనీమూన్‌ కు వెళ్లండి..


నక్షత్ర: హనీమూనా..? వాడితోనా..?


చెర్రి: మళ్లీ వాడు వీడు అంటున్నావేంటి…?


నక్షత్ర: అదే డాడీ ఆయనతోనా అంటున్నాను..


చెర్రి: హనీమూన్‌కు తాళి కట్టిన వాడితోనే వెళ్తారు. పక్కింటి వాడితో కాదు..


నక్షత్ర: ఏదో నోరు జారి అన్నాను డాడీ. హనీమూన్‌ కే కదా వెళ్తాను.. మీరు మమ్మీకి కూడా హనీమూన్‌ గురించి ఒక మాట  చెప్పండి  


చెర్రి: చెప్పాను అమ్మా ఓప్పేసుకుంది కూడా..


నక్షత్ర: ఒప్పుకుందా..?


చెర్రి: ఏదో మీ అమ్మ తప్పు చేసిందా అన్నంత ఆశ్చర్యంగా అడుగుతావేంటమ్మా..? మిమ్మల్ని హనీమూన్‌కు పంపించడానికి మీ అమ్మ ఆనందంగా ఒప్పుకుంది వెళ్లు వెళ్లి బట్టలు సర్దుకో


అని చెర్రి చెప్పగానే నక్షత్ర ఇరిటేటింగ్‌ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత చెర్రి అదే విషయం భూమికి చెప్తాడు. దీంతో భూమి ఆశ్చర్యపోతుంది.



భూమి: ఏంటి నిజమా..? నీతో హనిమూన్‌కు రావడానికి నక్షత్ర ఒప్పుకుందా..?


చెర్రి: శరత్‌ చంద్ర మామయ్యే చెప్పాక ఒప్పుకోక తప్పుతుందా..?


భూమి: ఓ మా నాన్నే మిమ్మల్ని హనీమూన్‌కు వెళ్లమని చెప్పారా..? కంగ్రాట్యులేషన్స్ చెర్రి.


చెర్రి: కంగారు పడకు భూమి మామయ్య ఏం చెప్పలేదు.. మామయ్యలా వేషం వేసుకుని గొంతు మార్చి నేనే చెప్పా.. నక్షత్ర నమ్మేసింది.


అంటూ చెర్రి చెప్పగానే.. భూమి ఆశ్చర్యపోతుంది. ఇన్ని తెలివి తేటలు నీకు ఎప్పుడొచ్చాయి చెర్రి.. నీకున్న తెలివితేటల్లో సగమైనా మీ అన్నయ్యకు ఉంటే చాలా బాగుండేది అంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్తుంది భూమి. తర్వాత గగన్‌ తల స్థానం చేస్తుంటే.. వెనక నుంచి భూమి వెళ్లి తలంటూ పోస్తుంది. గగన్‌ భూమిని చూడకుండా భూమిని తిడుతుంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. గొడవలో ఒకరి మీద ఒకరు పడతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!