Arunachalam (Tiruvannamalai) Budget Friendly Trip : శివుని అనుగ్రహం పొందాలనుకునేవారు కచ్చితంగా అరుణాచలం క్షేత్రానికి వెళ్లాలనుకుంటారు. అరుణాచలం ప్రవేశాన్ని కచ్చితంగా నిర్వార్తించాల్సిన పనుల్లో ఒకటిగా భావిస్తారు. అయితే మీరు కూడా వారిలో ఒకరా? అయితే మీరు వైజాగ్ నుంచి అరుణాచలం బడ్జెట్లో ఎలా వెళ్లొచ్చో.. హైదరాబాద్ నుంచి అయితే తక్కువ ఖర్చుతో ఎలా వెళ్లొచ్చో.. బడ్జెట్ ఫ్రెండ్లీ అరుణాచలం ట్రిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరుణాచలం అన్నా.. తిరువన్నమలై అన్నా ఒకటే. ఈ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి అరుణాచలం వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
వైజాగ్ నుంచి అరుణాచలం వెళ్తే.. (Vizag to Arunachalam)
వైజాగ్ నుంచి కట్పాడి జంక్షన్ (Katpadi Junction)కు ట్రైన్ టికెట్ రూ. 500 ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ జర్నీకి 16 గంటలు సమయం పడుతుంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ముందుకు వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ మీరు వెళ్లూరు న్యూ బస్ స్టాండ్‌కి వెళ్లాలి. ఆ బస్ టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 20 మధ్యలో ఉంటుంది. వేళ్లూరు నుంచి అరుణాచలంకి బస్ టికెట్ తీసుకోవాలి. దీని ధర రూ.70 నుంచి రూ.150 ఉంటుంది. మీరు తీసుకునే బస్ని బట్టి ఈ ధర మారుతుంది. జర్నీ టైమ్ రెండున్నర గంటలు ఉంటుంది. అరుణాచలం బస్ స్టాప్ నుంచి నేరుగా నడిచి వెళ్తే టెంపుల్ వస్తుంది. నడవలేను అనుకునేవాళ్లు ఆటోకి వెళ్లొచ్చు. దీని ధర రూ.30 నుంచి రూ.100 ఉంటుంది.
హైదరాబాద్ టూ అరుణాచలం (Hyderabad to Arunachalam)
హైదరాబాద్ నుంచి తిరువన్నమలై.. ప్రతి శుక్రవారం స్పెషల్ ట్రైన్ ఉంటుంది. వీకెండ్లో అరుణాచలం ప్లాన్ చేసుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. స్లీపర్ క్లాస్ టికెట్ రూ.450. రిటర్న్ అవ్వాలనుకుంటే ఆదివారం ట్రైన్ ఉంటుంది.
స్టేయింగ్ అండ్ ఫుడ్
అరుణాచలంలో స్టేయింగ్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ వాటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ స్టే చేయాలనుకునేది కాస్త ఆలోచించుకోవాలి. సోలో ట్రావెల్ చేసేవారికి లేదా గ్రూప్‌గా ట్రావెల్ చేసేవారికి.. తక్కువలో స్టే చేయాలనుకుంటే.. రాజగోపురం నుంచి.. మూడు వందల మీటర్లు ముందుకు వస్తే అరుణాచలం సేవామదం ఉంటుంది. దీని ధర రూ. 100. వీళ్లు మీకు ఓ లాకర్ ఇస్తారు. అక్కడ ఫ్రెష్ అయిపోవచ్చు కూడా. అరుణాచలంలో మంచి ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ ధర రూ. 100 నుంచి రూ.160 ఉంటుంది. అచ్చమైన తెలుగు భోజనాన్ని తినవచ్చు.
దర్శనం & గిరి ప్రదిక్షణ
స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదిక్షణ చేయవచ్చు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9.30 వరకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అనంతరం గిరిప్రదిక్షణ చేయవచ్చు. దీనికి నడిచే సామర్థ్యం బట్టి సమయం పడుతుంది. కొందరికి 4 నుంచి 6 గంటలు సమయం పడుతుంది. మరికొందరు 3 గంటల్లో కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీ వాకింగ్ సామర్థ్యాన్ని, టైమ్‌ని దృష్టిలో ఉంచుకుని గిరి ప్రదిక్షణ చేయవచ్చు. నడవలేను అనుకునేవారు ఆటోకి వెళ్లొచ్చు. వాళ్లు 9 టెంపుల్స్ దగ్గరకి మిమ్మల్ని తీసుకువెళ్తారు.
మీరు హైదరాబాద్ నుంచి వెళ్లినా.. వైజాగ్ నుంచి అరుణాచలం వెళ్లినా.. ఎలా వెళ్లారో అలాగే రిటర్న్ అయిపోవచ్చు. బస్, ఆటో, రైల్ ఇలా మీరు వెళ్లిన రూట్లోనే రిటర్న్ అయిపోవచ్చు. మరి మీరు కూడా అరుణాచలం క్షేత్రాన్ని సందర్శించాలనుకుంటే.. ఈ బడ్జెట్‌ని, టైమ్‌ని సెట్ చేసుకుని వెళ్లిపోండి.
Also Read : హైదరాబాద్ టూ ఈషా ఫౌండేషన్ రౌండ్ ట్రిప్ డిటైల్స్.. బడ్జెట్ కేవలం రూ.3,500 మాత్రమే