ప్రతి ఒక్క అమ్మాయి ఒక వయస్సు రాగానే ఎదుర్కొనే సమస్య మొటిమలు. కొందరికి అవి వచ్చి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ ఇంకొంతమందికి మాత్రం చీము కారుతుంది. మచ్చలు పడతాయి. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అని అంటాడు. ఇప్పుడు ఈ సమస్యకి అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి. చర్మం పిగ్మెంటేషన్ కి రావడానికి కారణం మెలనిన్. చర్మంలో మెలనిన్ ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం ముదురు రంగులోకి మారిపోతుంది. మెలనిన్ సమతుల్యంగా ఉంటే స్కిన్ పిగ్మెంటేషన్ కి గురి కాకుండా ఉంటుంది. ఎందుకంటే మెలనిన్ గొప్ప యాంటీ ఆక్సిడెంట్, ఇది UV కిరణాల నుంచి  చర్మాన్ని రక్షిస్తుంది. ఇవి పడటం వల్ల చర్మం మీద టాన్ ఏర్పడిపోతుంది. దీని వల్ల జిడ్డు పేరుకుపోవడం, మొటిమలు రావడం జరుగుతుంది.

హైపర్ పిగ్మెంటేషన్ నుంచి బయటపడేందుకు హానికారకమైన ఉత్పత్తులు వినియోగించకుండా చర్మాన్ని సంరక్షించే విధంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఆయుర్వేదం కొన్ని సూచనలు చేస్తోంది. మొటిమల కారణంగా చర్మం మంట, నొప్పి వల్ల బాధగా ఉంటుంది. వాటిని తొలగించుకునేందుకు బ్లీచ్ చేయడం, ఫేస్ వాష్ ఎక్కువగా వినియోగించడం వల్ల చర్మం pH స్థాయి తగ్గిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎప్పుడు కూడా యాంటీ బయాటిక్స్ మీద ఆధారపడకూడదు. ఈ ఆయుర్వేద పద్ధతి ప్రకారం చేసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. ఈ మార్గాలని అనుసరించడం వల్ల అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది.

పిగ్మెంటేషన్ తగ్గించేవి 

☀ బకూచి నూనె

☀ లైకోరైస్

☀ మజుఫాల్

☀ అర్భుటిన్ బెర్రీ సారం

☀ విటమిన్ సి

☀ జింక్

☀ విటమిన్ ఏ

☀ HA పెప్టైడ్స్

లైకోరైస్, ములేతి మూలికల కలయిక వల్ల చర్మం తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. చందన్ వుడ్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం చల్లగా, తెల్లగా మార్చే లక్షణాలని కలిగి ఉంటుంది.

ఆయుర్వేద మార్గాలే కాకుండా వంటింటి చిట్కాలు ఉపయోగించి కూడా పిగ్మెంటేషన్ సమస్యను ఎదుర్కోవచ్చు. అందరి ఇళ్ళల్లో చాలా సులభంగా దొరికే కలబందతో సహజమైన అందాన్ని పొందవచ్చు. కలబంద రసాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అధికంగా ఉన్న ప్రాంతంలో రాయడం వల్ల మొటిమలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కలబందలో గ్లిసరిన్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడతాయి.

పిగ్మెంటేషన్ సమస్య తగ్గించుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వినియోగించడం వల్ల ఒక్కోసారి అవి గిట్టకపోతే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇంట్లో దొరికే వాటితోనే వాటి నుంచి బయటపడొచ్చు. పాలు, తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమం ఫేస్ ప్యాక్ గా వేసుకున్న కూడా పిగ్మెంటేషన్ ని ఎదుర్కోవచ్చు. బంగాళాదుంప ముక్కలు కూడా మొహానికి బ్లీచ్ గా పని చేస్తాయి. మొటిమలు ఉన్న చోట వాటితో కొద్దిసేపు రుద్దినా మంచి ఫలితం పొందవచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ఉసిరి తింటే బరువు తగ్గుతారా? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది?