మన చుట్టూ ఎవరైనా ఉంటేనే మనకీ కూడా మంచిగా అనిపిస్తుంది. ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటే ఏదో కోల్పోయామనే ఫీలింగ్ లోనే వెళ్తాం. కనీసం పదిమంది మనుషులుంటేనే మనం సంతోషంగా ఉంటాం. లేదంటే ఒంటరిగా కూర్చొని బాధపడతాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండటానికి, ఒంటరితనానికి చాలా తేడా ఉంది. ఏకాంతంలో ఒక్కరు ఉన్నపుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఒంటరితనంలో ఒక్కరే ఉంటే, మిమ్మల్ని చాలా బాధిస్తుంది. మీ ముందు జరిగేవి నచ్చనప్పుడు, మీ స్నేహితులు మిమ్మల్ని మోసం చేసినప్పుడు, మీ ఇంట్లో వాళ్లు తిట్టినప్పుడు మాట్లాడలేకపోవడం, జీవనశైలి మార్పులు, మనస్పర్థలు.. ఇలాంటి కారణాల వల్ల ఒంటరిగా ఉన్నామనే ఫీల్ అవుతుంటారు. దీని కోసం మీరు సొంత ఆలోచనలతోనే ఈ నెగటివ్ ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..
ప్రతికూల ఆలోచనలు: మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీకు ప్రతికూల ఆలోచనలు మొదలవుతాయి. వాటిని గుర్తించి, ఏది నిజమో కనుగొని, ఈ ఆలోచనలకు బై చెప్పండి. ప్రతి సమస్య గురించి డీప్ గా ఆలోచించకండి. మన అంచనాలు వాస్తవికతకు చాలా దూరంగా లేవని కూడా నిర్ధారించుకోవాలి.
సెల్ఫ్ లవ్: మీ చుట్టూ వందల మంది వ్యక్తులు ఉన్నప్పటికీ, మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ సమయంలో, మరొకరి గురించి ఆలోచించడం మానేయండి. కొంత సమయం మీ కోసం కేటాయించండి. ఎవరో మిమ్మల్ని ప్రేమించడం లేదనే ఆలోచనను వదిలేయండి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లండి.
కృతజ్ఞత: ఒక రోజులో మనం మంచి, చెడు చూస్తాం. కాలం ఎవరి కోసం ఆగదు. ప్రతిదీ సరైన స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రమే రోజు గడిచిపోతుంది. రోజులో ఒక్క సారైనా మీకు మీరు థాంక్స్ చెప్పుకోండి. ఇలా చేయడం వలన మీరు మీ పట్ల మరింత కృతజ్ఞతతో ఉంటారు.
సన్నిహితంగా ఉండండి: మీరు ఇప్పటికే మాట్లాడిన వ్యక్తులతో మళ్లీ కనెక్ట్ అవ్వండి. ఇలా చేయడం వలన ఒంటరి ఆలోచనల నుంచి సులభంగా బయటపడతారు. కాబట్టి, దయచేసి వారితో మాట్లాడండి. వీలైతే, వాళ్లతో కలిసి బయటకు వెళ్లండి. ఇది మీకు మాత్రమే కాకుండా వారికి కూడా సహాయపడుతుంది.
సామాజిక కార్యకలాపాలు: క్లబ్‌లు, కోర్సులు, సమూహాలలో చేరండి. మీరు మీ అభిరుచులు, ఆటల ప్రకారం ఎంచుకోవచ్చు. అప్పుడప్పుడైనా కొత్త పనులను చేస్తూ ఉండాలి..దీని వలన కొత్త సంబంధాలు పెరుగుతాయి.
సపోర్ట్ : చాలా మంది స్నేహం కోసం ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్దపడతారు. సహాయం కోసం మీ స్నేహితులు మిమ్మల్ని అడిగినప్పుడు సాయం చేస్తూ ఉండండి. ఇలా చేయడం వలన ప్రశాంతత దొరుకుతుంది. ఇలా జనాలకి సపోర్ట్ చేస్తూ ఉన్నవారు ఒంటరిగా ఉన్నామని అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఆన్‌లైన్ కమ్యూనిటీలు, హెల్ప్‌లైన్‌లు కూడా అద్భుతమైన సహాయాన్ని అందిస్తాయి.
ఇష్టమైన పనులు: మీకు నచ్చిన పనులు చేయండి, ఎప్పుడు చేసిన పనులు చేయకండి. షాపింగ్, ఇష్టమైన ఆహారం తినడం, వండటం.. ఇలా మీకిష్టమైన పనిచేస్తే చాలావరకు బాధ తగ్గుతుంది.
Also Read : బరువు తగ్గాలనుకుంటే పాలు తాగండి.. కానీ ఇవి ఫాలో అవ్వండి