Weight Loss with Milk : పిల్లల నుంచి పెద్దలవరకు ఆరోగ్యప్రయోజనాల కోసం పాలు తగ్గుతారు. అయితే పాలు తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమోస్తాయో పక్కన పెడితే బరువు తగ్గడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయని పలు పరిశోధనలు నిరూపించాయి. తాజాగా జరిపిన ఓ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని తెలిపింది. మరి బరువు తగ్గడంలో పాలు నిజంగానే హెల్ప్ చేస్తాయా? పాలతో ఎలా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి పాలను ఏ విధంగా డైట్​లో కలిపి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


పాలల్లోని పోషకాలు


పాలల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది మీరు ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల అతిగా తినడం కంట్రోల్ అవుతుంది. పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో అధిక స్థాయి కాల్షియం కొవ్వును తగ్గిస్తుంది. శరీరంలో కొవ్వు శోషణను నిరోధించి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. డైటరీ సప్లిమెంట్ల నుంచి వచ్చే కాల్షియం కంటే పాలనుంచే ఎక్కువ కాల్షియం పొందవచ్చని ఈ అధ్యయనం తెలిపింది. మధ్య వయసు, వృద్ధులపై చేసిన అధ్యయనాల్లో పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల బరువు తక్కువగా పెరిగారని.. ఊబకాయం తగ్గిందని అధ్యయనం తెలిపింది. 


పాలల్లో ప్రోటీన్​తో లాభమేమిటి అంటే కండరాలు కోల్పోకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. పైగా శరీరంలో ప్రోటీన్ ఉండడం వల్ల మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు. ఆవు పాలల్లో కొవ్వు నాలుగు శాతం ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా పాలు శరీరానికి అవసరమైన చాలా పోషకాలను అందిస్తుంది. కాబట్టి సమతుల్యమైన బరువు కావాలనుకుంటే దీనిని మీరు రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. 


బరువు తగ్గేందుకు పాలు ఎలా తీసుకోవాలి?


పాలను రకరకాలుగా మీ డైట్​లో చేర్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన స్మూతీల కోసం పాలు మంచి ప్రోటీన్ బేస్ అవుతుంది. కాబట్టి మీరు స్మూతీల కోసం పాలను ఉపయోగించవచ్చు. ఉదయాన్నే టీ లేదా కాఫీలలో పాలు కలిపి తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలో ప్రయోజనకరమైన పోషకాలు పెంచుతుంది. ఓట్స్​లలో పాలు కలిపి తీసుకుంటే మీకు అది మంచి ఫుడ్ అవుతుంది. అంతేకాకుండా నోటి రుచికరంగా ఉంటుంది. అదనపు ప్రయోజనాల కోసం మీరు సూప్​లలో ఇవి కలిపి తీసుకోవచ్చు. దగ్గు, జలుబు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్నప్పుడు పాలల్లో పసుపు, మిరియాలు కలిపి తీసుకోవచ్చు. 


రాత్రిపూట తాగడం మంచిదే.. 


ఆయుర్వేదంలో రాత్రి పాలను తీసుకుంటే మంచిది అంటారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏవి లేవు గానీ.. రాత్రి పాలు మంచిది అంటారు. ఉదయం కంటే పాలు రాత్రి తాగితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. లేదంటే వ్యాయామం తర్వాత పాలు తాగడం వల్ల కండరాలు పెరుగుదల, కొవ్వు తగ్గడం వంటివి మంచివి. హెల్తీగా స్నాక్​గా కూడా పాలు తీసుకోవచ్చు. 


మీకు లాక్టోస్ రియాక్షన్ ఉన్నట్లయితే పాలకు దూరంగా ఉండండి. లేదంటే వైద్యుడి సహాయంతో మీరు పాలను మీ డైట్​లో తీసుకోవచ్చు. పాలను పూర్తిగా మానేయడం కంటే.. తాగడం తగ్గిస్తే మంచిది. లేదంటే మీరు ప్లాంట్ బేస్​డ్ పాలు తాగవచ్చు. బరువు తగ్గాలనుకున్నప్పుడు పాలను దూరం చేయాల్సిన అవసరం లేదు. సమతుల్యమైన ఆహారంలో దీనిని మీరు పాలు కలిపి తీసుకోవచ్చు. 


Also Read : సగ్గుబియ్యం కిచిడీ రెసిపీ.. దీనిని నైవేద్యంగా కూడా పెట్టొచ్చు




















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.