అప్పుడే బొజ్జ నిండుగా భోజనం చేస్తారు. కానీ కొద్ది సేపటికి ఆకలిగా అనిపించడం మీకు ఎప్పుడైనా జరిగిందా? అదేంటి ఇప్పుడే కదా తిన్నది అప్పుడే ఆకలిగా ఉంది ఏంటని చాలా మంది అనుకుంటారు. మళ్ళీ తినాలని చూస్తూ అలా అతిగా తినేస్తారు. కానీ ఎంత తింటున్నా కూడా ఆకలి మాత్రం ఆగదు. అందుకు కారణం ఏంటనేది ఎవరి ఊహకు కూడ అందడు. ఇలా జరగడానికి కారణం  పేగు పరాన్నజీవులు. ఇవి శరీరంపై వృద్ధి చెందుతాయి. అవి జీవించడం కోసం శరీరంలోని పోషకాలను ఆహారంగా తీసుకుంటాయి. పేగుల గోడపై ఉన్న జీర్ణవ్యవస్థలో చేరే అవకాశం ఉంది. దీని వల్ల విపరీతమైన ఆకలితో ఉండటమే కాకుండా అనేక రకాల లక్షణాలకు దారి తీస్తుంది.


పేగు పరాన్నజీవులు రావడానికి కారణం?


పేగు పరాన్నజీవులు వివిధ రకాల పురుగులను కలిగి ఉంటాయి. వీటి వల్ల అవి శరీరంలోకి వస్తాయి.


☀బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులు సరిగ్గా కడగకపోవడం వంటి పేలవమైన పరిశుభ్రత


☀సరిగా కడగని పండ్లు లేదా కూరగాయలు తీసుకోవడం


☀వండని మాంసం తినడం


☀దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే అలసట, కీళ్ల సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.


పేగు పరాన్నజీవుల లక్షణాలు?


బరువు తగ్గడం: ఈ పరాన్నజీవులు పేగులు, జీర్ణక్రియ, ఆహారాన్ని శోషించడాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి శరీరంలో చేరితే కడుపు నొప్పి, అతిసారం, పోషకాహార లోపాన్ని అనుభవిస్తారు. ఆహారం నుంచి లభించే పోషకాహారాన్ని పరాన్నజీవులు తీసుకుంటాయి. దీని వల్ల వివరించలేనంతగా బరువు తగ్గిపోతారు.


భోజనం తర్వాత ఆకలి: మనం తినే ఆహారంలోని పోషకాలు పరాన్నజీవులు తినేయడం వల్ల ఆకలిగా అనిపిస్తుంది. అవి జీవక్రియ, ఆకలికి ఆటంకం కలిగిస్తాయి.


రక్తహీనత: ఇవి చిన్న పేగు లైనింగ్ తో జత చేయబడి ఉంటాయి. దీని వల్ల రక్తహీనతకు కారణమయ్యే హోస్ట్ రక్తాన్ని పీల్చుకుంటాయి. ఈ పరాన్నజీవులలో కొన్ని అన్ని పోషకాలని తినేస్తాయి. ఫలితంగా తాజా ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది.


దురద: పేగు పరాన్నజీవుల వల్ల కూడా దురద వస్తుంది. పిన్ వార్మ్, మలద్వారం చుట్టూ గుడ్లు పెడతాయి. ఇది అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇతర పరాన్నజీవులు చర్మ సమస్యలు, దద్దుర్లు, తామర వంటి అలర్జీలను ప్రేరేపించే టాక్సిన్స్ ను కూడా విడుదల చేస్తాయి.


కీళ్ల నొప్పులు: పరాన్నజీవుల వల్ల కలిగే మంట కారణంగా కీళ్ళు, కండరాల నొప్పులు సంభవిస్తాయి. కొన్ని సార్లు ఈ పరాన్నజీవులు మరింత నష్టం కలిగించేందుకు కండరాలు బిగుసుకుపోతాయి. ఇది రక్తహీనత వల్ల కూడా జరగవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: వేసవిలో అలసట చాలా ప్రమాదకరం- దాన్ని అధిగమించేందుకు ఈ టిప్స్ పాటించండి