80/20  Rule for Better Life : జీవితం బెటర్​గా ఉండాలంటే లైఫ్​లో కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉంటాలి. ఆరోగ్యం నుంచి ఆదాయం వరకు.. సక్సెస్ నుంచి రిలేషన్ వరకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అలాంటి ఓ రూల్​లో 80-20 రూల్​ కూడా ఒకటి. అవును ఈ సింపుల్​ రూల్ ఫాలో అయితే మీ జీవితం బెటర్​గా ఉంటుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ రూల్​ని ఎలా లైఫ్​లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆరోగ్యం 

ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం ఎంత అవసరమో.. డైట్ కూడా అంతే అవసరం. అయితే చాలామంది వ్యాయామం చేయలేక ఫిట్​గా లేమని చెప్తారు కానీ.. ఎక్కువ శాతం డైట్​తో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చట. అందుకే ఆరోగ్యం కోసం 80 శాతం డైట్​ మీద, 20 శాతం వ్యాయామం మీద ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. సరైన ఫుడ్, సరైన టైమ్​కి, శరీరానికి కావాల్సిన అంత అందిస్తే.. మీరు కాస్త వ్యాయమం చేసినా నచ్చిన షేప్​లో ఉండగలుగుతారు. 

ఖర్చులు

ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసే విషయంలో చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. కొందరు తమ అవసరాల కంటే అలవాట్లకు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి మీ అలవాట్లను కంట్రోల్ చేసుకుని అవసరాలను గుర్తించి ఆదాయంలో 80 శాతం దానికి ఖర్చు పెట్టాలి. 20 శాతం కచ్చితంగా సేవింగ్స్ చేసుకుంటే మంచిది. 

కమ్యూనికేషన్.. 

ఎవరితో అయినా ప్రాబ్లమ్ ఎక్కడ వస్తాది అంటే అవతలి వ్యక్తి చెప్పే మాటలు విననప్పుడు. కాబట్టి ఎదుటి వాళ్లు చెప్పేది వినడానికి 80 శాతం మొగ్గు చూపండి. మిగిలిన 20 శాతం వాళ్లు చెప్పింది అర్థం చేసుకుని మాట్లాడండి. కమ్యూనికేషన్ ఈజ్ కీ అంటారు. దాని అర్థం మీరే మాట్లాడాలని కాదు.. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినాలని.. దాని అర్థం చేసుకోవాలని. 

కొత్త విషయాలు.. 

కొత్త విషయాలు తెలుసుకోవడానికి దానిని బట్టి పట్టడం కాకుండా.. 80 శాతం ఆ టాపిక్​ని అర్థం చేసుకోవడంపై ఫోకస్ చేయాలి. తర్వాత 20 శాతం దానిని చదవాలి. ఇలా చేయడం వల్ల ఏ టాపిక్​ని అయినా మీరు త్వరగా నేర్చుకోగలుగుతారు. అలాగే అది ఎక్కువ కాలం గుర్తుండేందుకు స్కోప్ ఉంటుంది. 

సక్సెస్ అవ్వాలంటే.. 

మీరు ఏదైనా పనిలో సక్సెస్ అవ్వాలంటే ముందుగా ప్లాన్ చేయాలి. ఈ ప్లాన్ కోసం 20 శాతం కేటాయించవచ్చు. అయితే మిగిలిన 80 శాతం చేసే పనుల్లో చూపించాలి. సక్సెస్ ఎప్పుడూ మాటలు చెప్పుకుంటూ.. ప్లాన్ వేసుకుంటూ కూర్చుంటే రాదు. వేసిన ప్లాన్​ని ఆచరణలో పెట్టినప్పుడే సక్సెస్ అవుతారు. కాబట్టి విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు దీనిని ఫాలో అయిపోండి. 

రిలేషన్​షిప్స్.. 

రిలేషన్​షిప్​లో ఎక్స్​పెక్టేషన్స్ అందరికీ ఎక్కువగానే ఉంటాయి. అయితే దీనిలో కూడా 80-20 రూల్ ఫాలో అవ్వొచ్చు. మీ బంధంలో మీరు 80 శాతం ప్రేమను ఇవ్వడానికి.. 20 శాతం తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీరు అవతలి వ్యక్తిపై ఎక్కువ ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకోకుండా.. నిస్వార్థంగా ప్రేమను ఇస్తారు. అవతలి వ్యక్తి కూడా మీకు 80 శాతం ప్రేమను ఇస్తూ.. 20 శాతం మీ ప్రేమను తీసుకోవడానికి సిద్ధంగా అంటే అది 100 శాతం పర్​ఫెక్ట్ బంధమవుతుంది. ఎలాంటి ఈగోలు దరిచేరవు. 

ఇలా మీరు చేసే ఏ పనిలో అయినా ఈ 80-20 రూల్ ఫాలో అయితే కచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీరు 80 శాతం దేనికి ఇస్తున్నారో.. 20 శాతానికి ఏది బెటరో ఆలోచించి నిర్ణయం తీసుకోగలగాలి. అంతేకానీ 20 ఎఫర్ట్స్ పెట్టి 100 శాతం రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకూడదు.