Organic Skin Care : మునగాకుకు ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఆరోగ్యానికై చాలామంది దీనిని తమ డైట్స్‌లో చేర్చుకుంటున్నారు. పప్పు, కూరల్లో, సలాడ్స్‌లో దీనిని లాగించేస్తున్నారు. అయితే ఇది కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచి ఫలితాలే ఇస్తుంది. మెరిసే, కాంతివంతమైన చర్మాన్ని అందించడంలో మునగాకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. జుట్టుకు కూడా ఇది ప్రభావవంతమైన ఫలితాలు ఇస్తుంది.
మునగాకు మీరు జుట్టుకు లేదా చర్మానికి ఉపయోగించాలనుకుంటే.. మీరు ముందుగా ఓ పని చేయాలి. మునగాకులను కడిగి ఎండబెట్టాలి. అవి బాగా డ్రై అయినా తర్వాత పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడితో మీరు వివిధ రకాల బ్యూటీ మాస్క్‌లు ప్రయత్నించవచ్చు. అయితే చర్మానికి మెరుపు కావాలనుకుంటే ఈ మునగాకును ఏవిధంగా ఉపయోగించాలో.. దానిలో ఏయే సహజ పదార్థాలు కలిపితే మంచి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెతో కలిపి..
మీరు ఈ మాస్క్‌ను తయారు చేసుకునేందుకు మునగాకు పొడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల తేనెను కలపండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యే వరకు కలిపి.. ముఖంపై మాస్క్ వేయండి. దీనిని పది నుంచి 15 నిమిషాలు ఉంచి.. గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే మీ ముఖంపై ఉన్న టాన్ తొలగి.. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
సీరం వలె..
చర్మం కాంతివంతంగా ఉండేందుకు సీరమ్‌లు బాగా పనిచేస్తాయి. మీ చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుకునేందుకు మీరు మెరింగా ఆయిల్ సీరమ్‌ను తయారు చేసుకోవచ్చు. మోరింగా నూనెను రోజ్‌షిప్ ఆయిల్, లావెండర్‌తో కలపండి. దీనిని మీ రెగ్యూలర్ స్కిన్ కేర్‌లో ఉపయోగించుకోవచ్చు. దీనిలోని అద్భుతమైన లక్షణాలు మీ చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.
ఓట్ మీల్..
ఎక్స్ఫోలియేషన్ చేస్తే చర్మంపైన ఉన్న మృతకణాలు తొలగి.. స్కిన్‌కు మెరుపు అందుతుంది. అయితే మీరు మునగాకు పొడిని స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. దీనికోసం ఓ గిన్నెలో మునగాకు పొడిని తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, తేనె వేసి బాగా కలపండి. అవన్నీ మిక్స్ అయిన తర్వాత చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి. కేవలం ముఖానికే కాకుండా చర్మానికి కూడా దీనిని అప్లై చేయవచ్చు. ఇది మీకు మెరిసే, మృదువైన చర్మాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుంది.
అవకాడో మిక్స్
ఓ గిన్నె తీసుకుని దానిలో మునగాకు పొడి వేయాలి. దానిలో అవకాడో పేస్ట్ వేసి బాగా కలపాలి. దీనిని మీరు ముఖానికి అప్లై చేస్తే చర్మం సహజంగా మెరుస్తుంది. అంతేకాకుండా అవకాడోలోని పోషకగుణాలు చర్మానికి చాలా మంచి ప్రయోజనాలు అందిస్తాయి.
ముల్తానీ మట్టితో..
ముల్తానీ మట్టి చర్మ ప్రయోజనాలు అందించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. దీనిని మునగాకు పొడితో కలిపితే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఇది మీకు హైడ్రా ఫేషియల్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ మాస్క్ చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో కొన్ని రోజ్ వాటర్, మునగాకు పొడివేసి బాగా కలపండి. దీనిని ముఖానికి అప్లై చేయండి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న మలినాలు, మురికిని తొలగిస్తుంది. దీనివల్ల మీరు మెరిసే, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.
Also Read : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. ఒక్కోరోజు ఒక్కోలా ప్రేమను వ్యక్తం చేసేయండి