Krishna Mukunda Murari Today Episode: మధు సినిమా స్టోరీ రాస్తుంటాడు. అక్కడికి నందూ వస్తుంది మధు తన స్టోరీ వినిపిస్తాను అంటే నందూ వద్దురా బాబోయ్ అని దండం పెట్టేస్తుంది. రేవతి కూడా మధు మీద సెటైర్లు వేస్తుంది. ఇక కృష్ణ కూడా అక్కడికి వచ్చి భవాని, ముకుంద, ఆదర్శ్‌లను పిలిచి తెగ హడావుడి చేసేస్తుంది.
కృష్ణ: ఏంటి ఏసీపీ సార్ సర్‌ప్రైజ్‌కి అలా హడావుడి చేసి ఇప్పుడు మీరే లేట్‌గా వస్తే ఎలా..
మధు: ఏంటి మురారి నీకు కూడా తెలీదా..
మురారి: పెళ్లాలు మన దగ్గర నుంచి ఇన్‌ఫర్‌మేషన్ ఎలా ఈజీగా లాగుతారో అలా మనకు తెలీదు కదా.. అందుకే తెలీదు..
భవాని: సర్‌ప్రైజ్ అయితే పర్లేదు షాక్ అవ్వకపోతే చాలు.. ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తావో ఊహించడానికే కష్టంగా ఉంది అమ్మా..
ఇక కృష్ణ దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకొని రెండు ఉంగరాలు తీసుకొని వస్తుంది. దీంతో మధు అవి రింగ్ బాక్స్‌లు కదా ఇది సర్‌ప్రైజా నేను ఇంకా నువ్వు తొండ గురించి చెప్తావేమో అనుకున్నా అంటాడు. దానికి ముకుంద, ఆదర్శ్ షాక్ అవుతారు.
ఆదర్శ్: మనసులో.. వీడు తొండ గురించి వదిలేలా లేడే..
భవాని: తొండ ఏంట్రా నీ మొఖం.. ఎప్పుడూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతావ్.. ఏయ్ తింగరి పిల్లా ముందు అదేంటో చెప్పు..
కృష్ణ: మరి రింగ్ సర్‌ప్రైజ్ కాదు పెద్దత్తయ్య దీన్ని వెనుకున్న పర్పజ్ సర్‌ప్రైజ్.. ముకుంద, ఆదర్శ్‌ల పెళ్లి నేను చూడలేదు కదా.. పైగా ఇన్నాళ్ల తర్వాత ఆదర్శ్ తిరిగి వచ్చాడు కదా..
ముకుంద: టాపిక్ మా మీదకు డైవర్ట్ చేసిందేంటి ఏం ఇరికిస్తుందో ఏంట్..
కృష్ణ: ఆదర్శ్ నువ్వు తిరిగి వచ్చి మీరిద్దరూ ఒకటి అయిన సందర్భంగా మీ పెళ్లికి గుర్తుగా మీరిద్దరూ రింగులు మార్చుకోండి. తీసుకో ఆదర్శ్..
మధు: అంటే ముకుందకు ఇష్టం ఉందో లేదో అని ఆదర్శ్‌కి అనుమానం ఉన్నట్లు ఉంది.
మురారి: ఏమ్ మాట్లాడుతున్నావ్ నువ్వు ముకుందకు ఎందుకు ఇష్టం ఉండదు.
మధు: అంటే ఆదర్శ్ రింగ్ తొడుతా అంటే ముకుంద హ్యాపీగా ఫీలవ్వాలి కదా టెన్షన్‌గా కనిపిస్తే డౌట్ వచ్చింది.
కృష్ణ: నీ మొఖం టెన్షన్‌కి బిడియానికి తేడా తెలీదా నీకు.. లోపల ఇష్టం ఉన్నా అందరి ముందు చేయాలి అంటే సిగ్గు ఉండదా.. ముకుంద నువ్వేం సిగ్గు పడకు.
మురారి: అవును అవును నీకు అంతగా సిగ్గు అనిపిస్తే కృష్ణని తలచుకో సిగ్గు దగ్గరికే రాదు..
ఇక ఆదర్శ్ ముకుందకు రింగ్ పెడుతుండగా ముకుంద చేయి వెనక్కి తీసుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. ఏమైందని కృష్ణ అడుగుతుంది. ఇంతలో మధు చెప్పాను కదా కృష్ణ ఇష్టం లేదుఅని.. ఉంగరం పెట్టించుకోవడం ఇష్టం లేదు అంటే ఆదర్శ్ అంటే ఇష్టం లేదు అనే కదా..
ముకుంద: చాలు ఆపుతావా మధు.. ఇష్టం లేదు ఇష్టం లేదు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావ్ ఏంటి.. ఇంకేం కారణం ఉండదా..
రేవతి: ఇంకేం కారణం ఉంటుంది. నువ్వు చేసిన పనికి ఎవరికైనా మధుకి వచ్చిన అనుమానమే వస్తుంది.
భవాని: వేరే కారణం ఏదో ఉంది అంటుంది కాదా అది ఏంటో చెప్పమను.
ముకుంద: ఎందుకు అంటే ఈ రింగ్ ఆదర్శ్ నాకు తొడగడం కంటే మురారి కృష్ణకే తొడగడం కరెక్ట్.
నందూ: మీఇద్దరి కోసం కృష్ణ ముచ్చట పడి తెస్తే మళ్లీ వాళ్లిద్దరికీ పెట్టుకోమంటావ్ ఏంటి..
ముకుంద: ఎప్పుడూ కృష్ణ మా గురించే ఆలోచించాలా మేం కృష్ణ గురించి ఆలోచించకూడదా.. చెప్ప ఆదర్శ్ వాళ్లే మన గురించి ఆలోచించాలా మనం వాళ్ల కోసం ఆలోచించకూడదా..
ఆదర్శ్: ఎందుకు ఆలోచించకూడదు.
ముకుంద: నేను అదే చెప్తుంటే మీరు అందరూ అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. కృష్ణ నువ్వు మా పెళ్లి చూడకపోయినా ఇంట్లో వాళ్లు అందరూ చూశారు కృష్ణ. కానీ మీ పెళ్లి మేం ఎవరం చూడలేదు. కాబట్టి ఈ రింగ్ మురారి నీకు తొడిగితేనే బాగుంటుంది.
మధు: నిజంగా కృష్ణ మీద అభిమానంతో అంటుందా.. లేక తప్పించుకోవడానికి ఇలా చెప్తుందా.. వాళ్లకి కావాలంటే వేరే రింగ్ తెప్పిద్దాం ముకుంద కృష్ణ మీ కోసం తెప్పించింది కదా మీరే పెట్టుకోండి..
ముకుంద: వీడు నన్ను వదిలేలా లేడు.
కృష్ణ, మురారిలు రింగులు మార్చుకుంటారు. తర్వాత కృష్ణ ముకుందని హగ్ చేసుకుంటుంది. కృష్ణ ముకుందతో... నువ్వు మారడానికి నా మీద నీకు అభిమానం ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అని చెప్తుంది.
ముకుంద: మనసులో.. సారీ కృష్ణ, నేను మారాను అన్న మాట నిజమే కానీ నువ్వు కోరికున్నట్లు మారలేదు. మురారిని ఎప్పటికీ మర్చిపోలేను ఆదర్శ్‌కి ఎప్పటికీ దగ్గర కాలేను. అలాగని నీకు మాత్రం అన్యాయం చేయలేను.
కృష్ణ: తనలోతాను.. కలా నిజమా అనిపించింది. దేవుడు ముకుందలో ఇంత గొప్ప మార్పు తీసుకొచ్చి చాలా మంచి పని చేశాడు.
ముకుంద: నేను చేసింది కరెక్టేనా ఆదర్శ్‌తో తాళి కట్టించుకున్నాను కదా ఉంగరం తొడిగించుకుంటే ఏమైపోయేది. కానీ మనసు రావడం లేదే.. అత్తయ్యకు అనుమానం వచ్చుంటుంది. నన్ను క్షమిస్తారా..
ఆదర్శ్: నేనేం ఫీలవలేదు ముకుంద. నువ్వు దూరం పెడితే నేను ఫీలవుతాను కానీ కృష్ణ మీద నీ అభిమానం చూపిస్తే ఎందుకు ఫీలవుతాను.. నీలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని అని చెప్తాడు. మరోవైపు ముకుంద ఆదర్శ్‌ని మోసం చేస్తున్నానా అని ఫీలవుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.