Applying Raw Milk on Face Daily : వేసవిలో ఎండ, చెమట, దుమ్ము కారణంగా చర్మం త్వరగా డ్యామేజ్ అవుతుంది. ముఖం డల్‌గా మారడం, ట్యాన్, పొడిబారడం, మొటిమలు వంటి సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో చాలామంది ఇంటి చిట్కాలపై ఆధారపడుతుంటారు. వాటిలో ముఖానికి పాలు రాయడం కూడా ఒకటి. మరి ఇలా చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?

Continues below advertisement

పచ్చి పాలను ఫేస్‌కు అప్లై చేయడం వల్ల చర్మానికి కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్యూటీ ప్రొడెక్ట్స్​లో కూడా పాలను ఉపయోగిస్తారు. వాటిని ఎక్కువగా ఉపయోగించేవారు కూడా ఉన్నారు. ఇలా ప్రొడెక్ట్ రూపంలో కాకుండా నేరుగా పాలను 7 రోజుల పాటు ముఖానికి అప్లై చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.

మాయిశ్చరైజేషన్

పాలలో ఉండే ఫ్యాట్స్, ప్రోటీన్లు చర్మానికి సహజమైన తేమను అందిస్తాయి. దీంతో డ్రై స్కిన్ కొంత మృదువుగా మారుతుంది. పొడిబారిన చర్మం దూరమవుతుంది. ఎండ వల్ల స్కిన్ పొడిబారితే పాలు కొంత సాఫ్ట్‌నెస్ ఇవ్వొచ్చు. కానీ ఇది పూర్తి పరిష్కారం ఇవ్వదు.

Continues below advertisement

ట్యాన్ తగ్గుతుంది..

వేసవిలో ఎండ వల్ల వచ్చిన ట్యాన్‌ను తగ్గించడంలో పాలు కొంతవరకు ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా చల్లని పాలను ఉపయోగిస్తే చర్మానికి రిలీఫ్ లభిస్తుంది.

డెడ్ స్కిన్ దూరం

పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై పేరుకుపోయిన డెడ్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి పాలు ముఖానికి అప్లై చేసినప్పుడు మృతకణాలు పోయి.. ముఖం కొంత ఫ్రెష్‌గా కనిపిస్తుంది. 

చల్లదనం కోసం

సమ్మర్‌లో ముఖంపై మంట, ఇరిటేషన్ వంటి స్కిన్ రిలేటడ్ ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు చల్లని పాలను ఫేస్​పై అప్లై చేయడం వల్ల తాత్కాలిక కూలింగ్ ఎఫెక్ట్ లభిస్తుంది. సన్ ఎక్స్‌పోజర్ అయిన వాళ్లు ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చల్లని పాలను ముఖానికి రాసుకుంటే స్కిన్‌కు కూలింగ్ ఫీలింగ్ కలుగుతుంది.

గ్లో పెరిగేందుకు..

పాలను రెగ్యులర్‌గా ఉపయోగిస్తే స్కిన్ టెక్స్చర్ కొద్దిగా మెరుగై ముఖం ప్రకాశవంతంగా కనిపించవచ్చు. మంచి గ్లో కావాలనుకునేవారు రోజూ దీనిని ఉపయోగించవచ్చు. 

క్లెన్సర్.. 

కాటన్‌ బాల్​ని పాలల్లో ముంచి.. దానితో ముఖాన్ని తుడిస్తే దుమ్ము, ఆయిల్ కొంతవరకు తొలగుతుంది. సహజమైన క్లెన్సర్​లా పని చేస్తుంది. 

సైడ్ ఎఫెక్ట్స్.. 

పాలు స్కిన్​కి మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. పాలు  అందరికీ సూట్ అవుతుందని అనుకోవడం తప్పు. ఆయిలీ స్కిన్ ఉన్నవారిలో లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో మొటిమలు, అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. పాలను ముఖంపై ఎక్కువసేపు ఉంచితే స్కిన్ ఇర్రిటేషన్ రావచ్చు. 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే బెటర్.

వేసవిలో అప్లై చేయవచ్చా?

సమ్మర్​లో పాలు ముఖానికి అప్లై చేయవచ్చు. ఇది కొంతవరకు మంచిదే. డ్రై స్కిన్ ఉన్నవారికి చల్లదనం, మాయిశ్చర్ అందించవచ్చు. కానీ చెమట ఎక్కువగా వచ్చే వారు, ఆయిలీ స్కిన్ ఉన్నవారు జాగ్రత్తగా వాడాలి. అలాగే పాలు రాసుకుని ఎండలోకి వెళ్లడం మాత్రం మంచిది కాదు. పాలు ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలి. పాడైపోయినవి అప్లై చేయడం మంచిది కాదు. 

స్కిన్ కేర్, హెయిర్ కేర్ గురించిన మరిన్ని టిప్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.  

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.