Amit Mishra Job Life : ఆఫీస్​లో మిషన్లవలె పని చేస్తూ.. ఆరోగ్యాన్ని కరాబ్ చేసుకుంటున్న వారు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మిషన్లు కూడా గ్యాప్ లేకుంటే పనిచేస్తూ ఉంటే అవి కరాబ్ అవుతూ ఉంటాయి. అలాంటింది మీ శరీరం గురించి ఆలోచించకుండా ఆఫీస్​ కోసం లేదా ఇతర పనుల్తో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమనేది తగదు. ఓ సీఈఓ పర్సనల్ ఎక్స్​పీరిన్సే దీనికి నిదర్శనం. 

అమిత్ మిశ్రా బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఓ మీడియా కంపెనీ సీఈఓ. అతను తన లింక్డిన్ ప్రొఫైల్​లో "WORK IS IMPORTANT BUT HEALTH IS NON-NEGOTIABLE". అంటూ రాసుకొచ్చారు. ఇది గుర్తించేసరికే చాలా లేట్​ అయిపోయిందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ICUలో ఉన్నప్పుడు దీనిని గుర్తించాల్సి వచ్చిందనే విషయం చెప్పారు. అసలు ఈ సీఈఓకి ఏమైంది? ఆరోగ్యం గురించి ఇలాంటి స్టేట్​మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పనిలో పడి పడి వర్క్ చేస్తూ నిజంగానే ఆరోగ్యాన్ని అందరూ విస్మరిస్తున్నారా? 

అసలు ఏమైందంటే.. 

ఓ రోజు అమిత్ మిశ్రా వర్క్​లో ఉండగా.. అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం రావడం స్టార్ట్ అయిందట. ఎలాంటి కాటన్ పెట్టినా.. వాష్ బేషిన్ దగ్గరికి వెళ్లి కడిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన భయపడిపోయారట. ఆస్పత్రికి వెళ్లేసరికే.. తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు రాసుకొచ్చారు. వెంటనే వైద్యులు అతనిని ఐసీయూలో అడ్మిట్ చేసి.. వైద్య పరీక్షలు చేశారట. దానిలో భాగంగా బీపీ చెక్ చేస్తే.. అది 230 ఉందని తెలిసి అందరూ షాక్ అయ్యారట. 

వైద్యులు 20 నిమిషాలు కష్టపడితే కానీ ఆ రక్తస్రావం తాత్కలికంగా కూడా అదుపులోకి రాలేదని తెలిపారు. అప్పటివరకు ఎలాంటి తలనొప్పి కానీ, కళ్లు తిరగడం వంటివి కానీ.. గతంలో కూడా బీపీ వచ్చినట్లు సంకేతాలు లేవని తెలిపారు. చాలా సైలెంట్​గా వచ్చిన రక్తపోటు అతనికి ఈ పరిస్థితి తీసుకువచ్చిందని రాసుకొచ్చారు. దీనిలో భాగంగా అతను ఎక్కడ తప్పు చేశాడు. ఎందుకు సడెన్​గా ఇలాంటి దారుణమైన పరిస్థితి వచ్చిందోనని ఆలోచించుకున్నానంటూ తన ఎక్స్​పీరియన్స్ షేర్ చేశారు. 

వీకాఫ్​ వచ్చినా.. ఆఫీస్ అయిపోయినా కూడా మిశ్రా ల్యాప్​టాప్ ముందు వేసుకునే కూర్చొనేవారట. అంతా బ్యాగానే ఉంది కదా.. గ్యాప్ తీసుకోవాల్సిన అవసరమేముందని అనుకునేవాడిని అందుకే ఆరోగ్యాన్ని బాగా నెగ్లెక్ట్ చేశానని రాసుకొచ్చారు. 

గుర్తించాల్సిన విషయాలు.. 

హై బీపీ, ఒత్తిడి, ఇతర ఆరోగ్య ప్రమాదాల గురించి శరీరం ఎప్పుడూ సంకేతాలు ఇవ్వకపోవచ్చు. సైలెంట్​గా ఎటాక్ అవుతాయి. కాబట్టి రెగ్యులర్​గా హెల్త్​ చెకప్​లు చేయించుకోవాలని మిశ్రా సూచించారు. కెరీర్ ముఖ్యమే. కానీ దాని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదని మిశ్రా చెప్పారు. పని చేయాలన్నా ఆలోచనలో శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను కూడా మరచిపోతామని.. అలాంటివి చేయకూడదని చెప్తున్నారు. శరీరం అలసిపోయినప్పుడు దానికి బ్రేక్ ఇవ్వాలని గుర్తించుకోవాలి. చెకప్​లు చేయించుకోవడం లేదా శరీరానికి తగినంత నిద్రను, విశ్రాంతిని అందించడం చేయాలి. అత్యవసరమైన పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సమయంలో దగ్గర్లోని ఆస్పత్రులు ఏమున్నాయో.. దగ్గర్లో ఎవరున్నారో చూసుకోవాలి. 

పనిలో పడి ఆరోగ్యాన్ని విస్మరించేవారికి అమిత్ మిశ్రానే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇకనుంచి అయినా వర్క్​ లైఫ్​నే జీవితంగా కాకుండా.. బ్యాలెన్స్​ చేసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు అన్ని బాగానే ఉండొచ్చు. కానీ అన్ని ఒకటేసారి ఫ్యూచర్​లో ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి అలెర్ట్​గా ఉంటే మంచిది.