Mujra party at a Moinabad farmhouse | మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు తెల్లవారుజామున S O T పోలీసుల దాడి చేసి ముజ్రా పార్టీ భగ్నం చేసి కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏతబర్ పల్లి గ్రామ రెవెన్యూలో హాలిడే ఫార్మ్ హౌస్ లో పార్టీ పేరుతో అశ్లీలంగా డ్యాన్సులు చేస్తున్నారని సమాచారం అందడంతో తెల్లవారుజామున సుమారు 3.30 లకు S O T పోలీసుల దాడి చేశారు. ముజ్రా పార్టీని భగ్నం చేసిన ఎస్‌ఓటీ పోలీసులు ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని స్థానిక మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. 

ఒకరి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అయితే పోలీసులు ఆ ఫాం హౌస్‌లో పెద్ద ఎత్తున మద్యం, 70 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో యువతులు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడంతో  ముజ్రా పార్టీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్వాహకులు ఈ బర్త్‌డే పార్టీ కోసం పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చారని ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సివుంది