కొంతమందికి ఒంటరిగా పడుకుంటేనే నిద్ర పడుతుంది. ఇంకొందరికి పక్కన ఎవరో ఒకరు ఉండాలి వెళ్ళి అమ్మ పక్కన పడుకుని తన మీద కాలు వేసుకుంటే కానీ నిద్ర పట్టదు. అయితే వీటన్నింటికంటే జీవిత భాగస్వామితో కలిసి బెడ్ షేర్ చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం ఒంటరిగా నిద్రించే వారి కంటే జీవిత భాగస్వామి లేదా పెద్దల పక్కన పడుకునే వాళ్ళు మంచి నిద్రని పొందుతారు.
జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోయే వారికి నిద్రలేమి సమస్య కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ సేపు నిద్రపోతారు. అంతే కాదు పడుకోగానే నిద్రపడుతుంది. నిద్ర నాణ్యత బాగుంటుంది. స్లీప్ అప్నియా ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని తేలింది. సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి మంచం పంచుకోవడం వల్ల నిద్ర విధానం, నిద్ర నాణ్యతపై కలిగే ప్రయోజనాల గురించి ఈ అధ్యయనం హైలెట్ చేస్తుంది.
సాన్నిహిత్యం పెరుగుతుంది
జీవిత భాగస్వామితో కలిసి బెడ్ షేర్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి బంధం బలపడుతుంది. కలిసి నిద్రించడం వల్ల ఆక్సిటోసిన్, లవ్ హార్మోన్ విడుదల చేయడం ద్వారా శారీరక సాన్నిహిత్యం, సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రెండూ విశ్రాంతిని ఇచ్చి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. భాగస్వామితో మరింత సుఖంగా ఉంటారు.
మ్యూచువల్ స్లీపింగ్ ప్యాటర్న్
జీవిత భాగస్వామితో కలిసి పడుకోవడం వల్ల ఇద్దరూ ఒకే సమయానికి నిద్రపోతారు. నిద్ర దినచర్య సరిగా ఉంటుంది. నిద్ర చక్రాల వల్ల కలిగే ఆటంకాలని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. భాగస్వాములు ఇద్దరూ ఒకే నిద్ర షెడ్యూల్ కలిగి ఉండటం వల్ల నిద్రపోవడం, మేల్కోవడం సులభం అవుతుంది.
ఉష్ణోగ్రత నియంత్రణ
శరీర ఉష్ణోగ్రత మంచి నిద్ర నాణ్యతను ప్రోత్సహిస్తుంది. ఇద్దరూ శరీరాలు కలిసి ఉండటం వల్ల వేడి మార్పిడి అవుతుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో సహాయపడుతుంది. చల్లటి సాయంత్రాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామి వెచ్చదనం సౌకర్యవంతంగా అనిపిస్తుంది.
ఒత్తిడి నుంచి ఉపశమనం
భాగస్వామి శారీరక ఉనికి మానసిక ఒత్తిడిని మాత్రమే కాకుండా శారీరక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. జీవిత భాగస్వామితో బెడ్ షేర్ చేసుకున్నప్పుడు శారీరక ఒత్తిడి పెరగడం సహజం. ఇది ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ప్రశాంతమైన, హాయైన నిద్రని ఇస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురిస్తుంది. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి సరైన ఏకాంత సమయం ఇదే. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఎటువంటి పొరపొచ్చాలకు, భేధాభిప్రాయాలకు చోటు ఉండదు. జీవితం సాఫీగా ఎటువంటి గొడవలు లేకుండా సాగిపోతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం