లికాలంలో చల్లటి గాలుల కారణంగా చర్మం తేమని కోల్పోతుంది. దీని వల్ల చర్మం డల్, డ్రై గా కనిపిస్తుంది. పగిలిన చర్మం చూసేందుకు అసహ్యంగా కనిపిస్తుంది. దీన్ని కవర్ చేసుకోవడానికి మాయిశ్చరైజింగ్ క్రీములు ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకు మంచి ఎంపిక అలోవెరా. దీనిలోని హీలింగ్, మాయిశ్చరైజింగ్ గుణాల కారణంగా చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచుతుంది. మొహంలో గ్లో మెయింటైన్ చేయడానికి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అలోవెరా సబ్బు లేదా బాడీ క్రీమ్ ఉపయోగించి చూడండి.


అలోవెరా లిక్విడ్ సోప్


రసాయన మాయిశ్చరైజర్లు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. అవి చర్మం బయటి పొరను మాత్రమే తాత్కాలికంగా తేమగా ఉంచుతాయి. అలో లిక్విడ్ సోప్ వల్ల చర్మం తేమని ఇవ్వడంతో పాటు అది నిలుపుకోవడానికి సమర్థవంతంగా పని చేస్తుంది. దీనితో స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా తాజాగా ఉంటుంది. అలో లిక్విడ్ సోప్ లో అలోవెరాతో పాటు అనేక అధిక నాణ్యత పదార్థాలు ఉపయోగిస్తారు. అందువల్లే ఇది శరీరానికి స్కిన్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. ఆర్గాన్ ఆయిల్, విటమిన్ ఇ, సహజ కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యవంతమైన చర్మానికి మద్దతు ఇస్తాయి. కలబంద చర్మాన్ని శాంతపరుస్తుంది. మృదువుగా చేస్తుంది. సున్నితమైన చర్మం కలిగిన వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.


అలోవెరా బాడీ వాష్


చాలామంది సబ్బుకి బదులుగా బాడీ వాష్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తారు. వాటిలో అన్ని పోషకాలు అందించే అలో బాడీ వాష్ ఉత్తమ ఎంపిక అని చర్మనిపుణులు సూచిస్తున్నారు. ఇది తేలికపాటి ప్రభావవంతమైన క్లెన్సర్. చర్మాన్ని కండిషన్ చేస్తుంది. స్కిన్ కండిషనింగ్ పదార్థాలతో తయారైన దీన్ని వాడటం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. సల్ఫేట్ రహిత ఉత్పత్తి ఇది. చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళిని కడిగేస్తుంది. pH సమతుల్యత కలిగిన కలబంద బాడీ వాష్ చర్మాన్ని తేమగా ఉంచి నిర్జీవంగా కనిపించకుండా చేస్తుంది. ఇందులోని విటమిన్లు ఏ, సి, ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.


వృద్ధాప్య ఛాయలు నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ బాడీ వాష్ పరిమళం కూడా బాగుండటం వల్ల మనసుకి హాయిగా అనిపిస్తుంది. అలోవెరా, ఆర్గాన్ ఆయిల్, ఆర్నికా ఫ్లవర్ ఎక్స్‌ట్రాక్ట్, హైడ్రోలైజ్డ్ జోజోబా ఈస్టర్‌లు వంటి పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి.


చర్మానికే కాదు జుట్టుని సంరక్షించడంలో కూడా అలోవెరాది ముఖ్యమైన పాత్ర. పోషకాలు అధికంగా ఉండే కలబంద రాసుకోవడం వల్ల చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. జుట్టు చిట్లిపోకుండా చేస్తాయి. అలాగే, డ్యామేజ్ అయిన వెంట్రుకలను సైతం రిపేర్ చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యని నివారిస్తుంది. కలబందలో గ్లిసరిన్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: హైలురోనిక్ యాసిడ్ అంటే ఏమిటీ? ఇది నిజంగానే ఏజ్ తగ్గిస్తుందా? లాభనష్టాలేమిటీ?