నా బాల్యం అంతా యూనిఫామ్‌లు, చీరల మధ్యనే గడిచింది. ఓ నౌకాదళ అధికారి కుమార్తెగా నా బాల్యం సముద్ర గంభీరంతో సాగింది. స్థిరంగా ఉంటూనే కదిలే తరంగం అది. ఓ ఉపాధ్యాయురాలైన నా తల్లి, తన జ్ఞానాన్ని, బాధ్యతను చీర మడతల్లో ఒదిగి ఉంచి దానిని తన దైనందిక హుందాతనపు వ్యక్తీకరణగా మార్చుకుంది.  ఓ ఆర్మీ అధికారి భార్య అయిన మా నానమ్మ కూడా అంతే. ఆమె చీరలు ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి ప్రతీక. వారి భర్తలు ఉద్యోగ రీత్యా దేశమంతా తిరుగుతుంటే ఆ ప్రాంతాల్లోని వస్త్ర సంపద వారి దైనందిక జీవనశైలిలో ఓ భాగంగా మారిపోయింది. ప్రతీ చీరకట్టు ఆ ప్రాంతాన్ని, వారి జ్ఞాపకాల అనుభూతులను ప్రతిబింబించేది. వారిని అలా చూస్తూ రావడంతో చీరల పట్ల నా ఇష్టం పెరిగిపోయింది. మొదట ఆరాధనగా, ఆ తర్వాత నా మూలాలతో ఓ లోతైన బంధంగా మారిపోయింది.

Continues below advertisement


ARS ప్రారంభించేముందు నేను స్టైలిస్ట్‌గా పనిచేశాను. మన దినచర్యలో, కెమెరా ముందు దుస్తులను ఎలా మెరిసిపించాలి అన్నదాని మీద దృష్టి పెట్టాను. ఆ అనుభవమే  నాకు డీటెయిలింగ్,  దుస్తులు కట్టే నేర్పు, ఆకృతి అన్నీ గమనించడంలో మంచి పట్టు తెచ్చి పెట్టింది. ప్రతీ కలెక్షన్ ఎంపికలో అదే దారి చూపుతోంది. 


ARS అనేది భారతీయ సృజనాత్మక సాంస్కృతిక వారసత్వానికి నేను అందించే ఓ చిరు కానుక. భారతీయ వస్త్ర వైభవాన్ని నేటి ప్రపంచం ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతీ కలెక్షన్‌ను  ఎంతో ఆలోచనతో శ్రద్ధగా ఎంపిక చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. శాశ్వతమైన, విభిన్నమైన, మీ సొంతం అనుకునే రీతిలో వస్త్రాలను అందించాలన్నది నా ప్రయత్నం.  మా వరకూ ఇది ఓ  సాంప్రదాయాన్ని సగర్వంగా ముందుకు తీసుకెళ్లడం.  


 


ARS  ని ఈ  ఇన్‌స్టాగ్రామ్  ద్వారా ఫాలోకండి.  



Buy here.