Siddu Jonnalagadda Telusu Kada Movie Interview: ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడాయన హీరోగా, ‘మిరాయ్’ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రూపుదిద్దుకుంటున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ సరసన శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్దు జొన్నలగడ్డ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

Continues below advertisement

‘‘ఈ కథను నీరజ నాకు ఏడాదిన్నర క్రితమే చెప్పారు. కథ విని చాలా ఎక్జయిట్ అయ్యాను. క్యారెక్టరైజేషన్ మీద ఇంకాస్త వర్క్ చేద్దామని చెప్పాను. ‘టిల్లు స్క్వేర్’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలని ఇద్దరం భావించాం. అలా స్టోరీ మొత్తం లాక్ చేసుకున్న తర్వాతే అనౌన్స్ చేశాం. ఇందులో నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నా పాత్ర చూసి ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. మంచి హ్యుమర్ ఉంటుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాకు చాలా మంచి బజ్ వచ్చింది. ఇందులో వరుణ్ పాత్ర ప్రతి ఒక్కరికీ ఒక ఎక్స్‌పీరియెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. తను చాలా నార్మల్‌గా ఉన్నప్పటికీ తన ఆలోచనలు మాత్రం రాడికల్‌గా ఉంటాయి. ఆ పాత్రతో ఆడియన్స్ మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారు.

నీరజ కథగా రాసుకున్న ఐడియా చాలా కొత్తగా ఉంది. అందుకే కథ వినగానే నాకు కూడా నచ్చింది. కథ విన్న తర్వాత ఒక్కటే చెప్పా.. క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్‌కి వస్తానని ముందుగానే చెప్పా. అలాంటి క్యారెక్టర్ కుదిరిన తర్వాతే షూట్ స్టార్ట్ చేశాం. ఇది ఒరిజినల్ ఫిల్మ్. ఇందులో 80 శాతం కొత్త సీన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఎక్కడో చూసిన ఫీలింగ్ రాదు. లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్, ఫ్యామిలీ, రిలేషన్ షిప్ వంటి అంశాలను డిస్కషన్ చేస్తూ.. ప్రతి సన్నివేశం చాలా కొత్తగా ఉంటుంది. నీరజ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాసుకున్నారు. రాశి, శ్రీనిధి పాత్రలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాళ్ళకి మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. ఈ సినిమా విడుదలైన తర్వాత దీనికంటూ ఒక ప్రత్యేక జానర్ ఏర్పడుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా లవ్, లైఫ్ గురించి చాలా హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ వుంటాయి.

Continues below advertisement

Also Readఓటీటీలోకి రవితేజ కుమార్తె ఎంట్రీ... హీరోయిన్ కాదండోయ్ - మరి ఏం చేశారో తెలుసా?

ట్రైలర్‌లో ఉన్న ప్రతి సన్నివేశం సినిమాలో ఉంటుంది. ట్రైలర్ చివర్లో వైవా హర్ష సీన్ తప్పితే మిగతా అన్ని సీన్లు సినిమాలో వుంటాయి. నీరజ చెప్పిన కథ‌లో ఒక యూని‌నెస్ ఉంది. తనకి మొదటి నుంచి అదే విషయం చెప్పా. కథ బాగుంది కానీ, క్యారెక్టరైజేషన్ డెవలప్ అయితేనే చేద్దామని చెప్పా. అలాంటి యూనిక్ క్యారెక్టర్ ఫైనల్‌గా సెట్టయింది. ఎందుకు క్యారెక్టరైజేషన్ అంటున్నానంటే.. టిల్లు క్యారెక్టర్ తర్వాత నా మీద నాకే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. అందుకే, ఏ సినిమా చేసినా సరే.. చివరి క్షణం వరకు వదలకుండా కూర్చుంటాను, ఒక క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నామని మనకి అనిపించాలి కదా. ఇప్పుడు డిటిఎస్ చూసిన తర్వాత చాలా ఎక్జయిట్ అవుతున్నాను. ఇదే రేపు థియేటర్లలో ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని నమ్ముతున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కమిట్ అయినప్పుడు నిర్మాత ఎవరిని బేస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ‘తెలుసు కదా’ విషయంలో నిర్మాత విశ్వప్రసాద్.. మీకు నచ్చింది కాబట్టి సినిమా చేయండని ఫ్రీడమ్ ఇచ్చారు. అలాంటప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. నేను ఇన్వాల్వ్ అయ్యానంటే.. నాకు ఎవరు కథలు చెప్పలేదు, కథలు రాయలేదు. అందుకే సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాల్సి వచ్చింది. నా నిర్మాతలు నన్ను నమ్మి సినిమా చేస్తున్నప్పుడు 100 శాతం నేను ఆ సినిమాకు న్యాయం చేయాలి. నేను అదే చేస్తూ వస్తున్నాను. 

సినిమా సక్సెస్ అయితే గ్రేట్ డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ అంటుంటారు. అదే సినిమా పోతే సిద్దు బాగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టే పోయిందని అంటుంటారు. హిట్ అయితే అందరికీ క్రెడిట్ పోతుంది.. సినిమా ఆడకపోతే మాత్రం నా ఒక్కడినే బ్లెమ్ చేస్తారు. అయినా సరే, అందుకు తెగించే ఇక్కడ ఉన్నాను. డైలాగ్ చెప్పి కారవాన్‌లోకి వెళ్లిపోవాలని నాకూ ఉంటుంది. నేను ఇన్వాల్వ్ అవకుండా సినిమా చేయాలనేది నా డ్రీమ్. కానీ, నాకు ఆ లగ్జరీ లేదు. ఫిలిం మేకింగ్‌లో ఎక్కువగా వుండటంతో ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఆడియన్స్ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను ముందుగా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను సినిమా చూసి ఏదైతే అనుకుంటానే.. అదే ప్రేక్షకుల నుంచి వస్తే.. మంచి కిక్ ఇస్తోంది. ‘జాక్’ సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఫోన్ చేసి ‘టిల్లుతో ఆల్ టైం హై చూశావు, జాక్ మూవీతో లో చూశావు.. ఇకపై నువ్వు ఏం చేసినా ఆ రెండింటి మధ్య చూస్తావు’ అని అన్నారు. ఆయన చెప్పిన ఆ మాట ఇకపై ఎలాంటి పరిస్థితులనైనా.. ఇలా చూడాలనే ఒక థాట్‌ని కలిగించింది.    

నీరజ డెబ్యూట్ డైరెక్టర్.. వాస్తవానికి కొత్తవారితో వర్క్ చేయడం ఒక రిస్క్‌తో కూడుకున్న పని. కాకపోతే, రిస్క్‌తో పాటు ఒక రివార్డు కూడా వుంటుంది. నీరజతో వర్క్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి టీమ్‌తో వెళ్ళాలనేది ముందుగానే నిర్ణయించుకున్నాం. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్, మ్యూజిక్ తమన్, ఎడిటర్ నవీన్.. ఇలా టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. ట్రైలర్, టీజర్ చూస్తే ఎక్కడా కూడా కొత్త సినిమా, కొత్త డైరెక్టర్ చేసిన సినిమాలా వుండదు.  ఒక పెద్ద సినిమా, స్టార్ డైరెక్టర్ చేసిన మేకింగ్‌లానే ఉంటుంది. నిర్మాతలు విశ్వ, కృతిలతో నాకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. చాలా ఫ్రీడమ్ ఇస్తారు. వారి బ్యానర్‌లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’లో కూడా చేశాను. మంచి కథ దొరికితే రవితేజతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాను. శ్రీనిధి, రాశి పాత్రలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లోని ఒక సన్నివేవంలో రాశి ఆడియన్స్‌ని చేసే సర్‌ప్రైజ్ మాములుగా ఉండదు. నా పాత్ర సినిమాలో 23 నిమిషం తర్వాత ఒక వైల్డ్ టర్న్ తీసుకుంటుంది. అదేంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. నీరజ ఫస్ట్ టైమర్ అయినప్పటికీ టాప్ టెక్నీషియన్స్‌ని సెలక్ట్ చేసుకుని, అందరితో కలిసి అద్భుతమైన వర్క్‌ని ఇచ్చారు. ‘తెలుసు కదా’ కథకైతే ముగింపు ఉంది. టిల్లుకి కూడా సీక్వెల్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. ప్రేక్షకులు కోరుకున్నారు కాబట్టి అది జరిగింది. ఇందులోని వరుణ్ పాత్రకి డిమాండ్ వస్తే మాత్రం సీక్వెల్ చేసే అవకాశం ఉంటుంది.’’ అని చెప్పుకొచ్చారు.

Also Read: హిందీలో 'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్... అక్కడ వెంకటేష్ రోల్ చేసే హీరో ఎవరో తెలుసా?