కుటుంబ ప్రేక్షకులను నవ్వించడం, మంచి వినోదం అందించడం కోసం తీసిన సినిమాలకు బాక్స్ ఆఫీస్ బరిలో కోట్లకు కోట్ల రూపాయలు కొల్లగొట్టే సత్తా ఉందని నిరూపించిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' విజయాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తెలుగులో భారీ హిట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు నిర్మాత 'దిల్' రాజు.
అక్షయ్ కుమార్ హీరోగా హిందీ రీమేక్!Akshay Kumar to remake Sankranthiki Vasthunam: ఇటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, అటు యాక్షన్ ఫిలిమ్స్... ఏవైనా చేయగల ట్యాలెంట్ ఉన్న బాలీవుడ్ హీరో ఖిలాడీ అక్షయ్ కుమార్. ఆయనతో 'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ చేయనున్నారు.
Also Read: ఓటీటీలోకి రవితేజ కుమార్తె ఎంట్రీ... హీరోయిన్ కాదండోయ్ - మరి ఏం చేశారో తెలుసా?
తెలుగులో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను 'దిల్' రాజు సమర్పణలో ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో 'దిల్' రాజు రీమేక్ చేయనున్నారు. అదీ అక్షయ్ కుమార్ హీరోగా. హిందీ రీమేక్ దర్శకత్వ బాధ్యలను అనీస్ బజ్మీ చేతిలో పెట్టారు. ఇంతకు ముందు 'జెర్సీ', 'హిట్' సినిమాలను సైతం హిందీలో రీమేక్ చేశారు దిల్ రాజు. అయితే అవి హిట్ కాలేదు. ఇప్పుడు ఫ్యామిలీ ఫిల్మ్ 'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్‌తో హిట్ అవ్వాలని ఆశిద్దాం.
పవన్ కళ్యాణ్ హీరోగా 'దిల్' రాజు నిర్మాణంలో!రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 25వ సినిమా 'అజ్ఞాతవాసి' తర్వాత మూడేళ్లు సినిమాలకు విరామం ఇచ్చారు. చిన్న బ్రేక్ తర్వాత ఆయన చేసిన 'వకీల్ సాబ్'ను 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మరోసారి పవన్ హీరోగా సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా 'దిల్' రాజు సినిమా చేయనున్నారు. ఆ మూవీ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Also Read: తొక్కితే పడను... వెంట్రుక తీసి ఇచ్చిన బన్నీ వాసు... పెయిడ్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్