Mana Shankara Varaprasad Garu Meesaala Pilla Full Song Released: మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి ఫుల్ సాంగ్ అదిరిపోయింది. 'మీసాల పిల్ల' అంటూ ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.
మెగా ఎనర్జీ డబుల్
'మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటుండగా... చిరంజీవి డ్యాన్స్, నయనతార అందం అదిరిపోయింది. జంట మధ్య అలకలు, వాటిని కూల్ చేసేందుకు 'శంకరవరప్రసాద్ గారు' చేసిన అల్లరిని అందంగా పాటలో చూపించారు. మరి ఈ గొడవ కొలిక్కి వచ్చిందో లేదో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేసేలా ఆయన స్టెప్పులు వేరే లెవల్‌లో ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా... ఉదిత్ నారాయణ, శ్వేతా మోహన్ కలిసి పాట పాడారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. చిరు, ఉదిత్ ఎవరగ్రీన్ సాంగ్స్‌లో ఈ పాట కూడా నిలవనుంది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.
ఈ మూవీలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా చేస్తున్నారు. శశిరేఖ పాత్రలో ఆమె కనిపించనుండగా లుక్స్ అదిరిపోయాయి. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేయనున్నారు. వీరితో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది.
Also Read: సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ వచ్చేసింది - అర్జున్ రెడ్డి, డీజే టిల్లు కలిస్తే ఎలా ఉంటుందో?