Indian AI YouTube Channel : కేవలం AIతో రూపొందించిన కంటెంట్‌తో ఒక భారతీయ యూట్యూబ్ ఛానెల్ ఏడాదికి 38 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. AI రూపొందించిన కంటెంట్‌ను పోస్ట్ చేసే యూట్యూబ్ ఛానెళ్లపై చేసిన గ్లోబల్ స్టడీలో భారతీయ ఛానెల్ 'బందర్ అప్నా దోస్త్' ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించినట్లు తేలింది. వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫారమ్ క్యాప్‌వింగ్ తన స్టడీలో భాగంగా AIతో రూపొందించిన వీడియోల స్కేల్, ప్రభావాన్ని చూడటానికి ప్రపంచంలోని 15,000 అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఛానెళ్లను విశ్లేషించింది. అందులో 'బందర్ అప్నా దోస్త్' అతిపెద్ద ఛానెల్‌గా నిలిచింది.

Continues below advertisement

ముందు ప్లేస్​లో భారతీయ ఛానెల్ 

క్యాప్‌వింగ్ స్టడీ ప్రకారం.. ఈ ఛానెల్‌కు 2.07 బిలియన్ వీక్షణలు వచ్చాయి. 2.76 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఆదాయం విషయానికొస్తే ఈ ఛానెల్ ప్రతి సంవత్సరం సుమారు 38 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఈ ఛానెల్ కోతుల పాత్రలతో చిన్న వీడియో క్లిప్‌లను అప్‌లోడ్ చేస్తుంది. ఈ ఛానెల్ విజయం, తక్కువ ఖర్చుతో పూర్తిగా AIతో రూపొందించిన వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలా చేరుకోగలవో చూపిస్తుంది.

AI వీడియోలు ముందు

Continues below advertisement

సిఫార్సుల విషయానికొస్తే.. YouTube కూడా AIతో రూపొందించిన వీడియోలను ఎక్కువగా సిఫార్సు చేస్తుంది. స్టడీ ప్రకారం.. కొత్త వినియోగదారులకు సిఫార్సు చేసే వీడియోలలో 20 శాతం AI స్లోప్ కేటగిరీకి చెందినవే ఉంటున్నాయి. AI స్లోప్ అంటే పూర్తిగా AIతో రూపొందించిన వీడియోలు. వీటిలో మానవ సృజనాత్మకత ఉండదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది. షార్ట్స్ విషయంలో AI వీడియోల ఆధిపత్యం మరింత బలంగా ఉంది. కొత్త వినియోగదారులకు చూపించే మొదటి 500 షార్ట్స్‌లో 33 శాతం AI స్లోప్ వీడియోలు ఉంటాయి. దీనిని బట్టి YouTube అల్గారిథమ్ నాణ్యతతో సంబంధం లేకుండా.. నిరంతరం చూసే కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది.

యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి.. లేదా ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ తరహా కంటెంట్​ క్రియేట్ చేయవచ్చు. జాబ్ చేయకపోయినా ఇలాంటి కంటెంట్​ని క్రియేట్ చేస్తే మీకు కూడా సక్సెస్ వస్తోందనడానకిి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్.