Honda 350cc Bikes India: మీరు 350సీసీ సెగ్మెంట్‌లో ఒక స్టైలిష్‌, రిలయబుల్‌, లాంగ్‌ రైడ్‌కు సరిపోయే బైక్ కోసం చూస్తున్నారా? అయితే హోండా 350సీసీ బైక్‌లు ప్రస్తుతం మంచి ఆప్షన్‌ అవుతాయి. కారణం - హోండా కంపెనీ ఇప్పుడు తన 350సీసీ మోటార్‌సైకిళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది.

Continues below advertisement

ప్రస్తుతం హోండా CB350, CB350C, CB350 H’ness, CB350RS మోడళ్లపై ₹8,000 వరకు ప్రయోజనాలు, 3 ఏళ్ల ఫ్రీ ఎక్స్‌టెండెడ్ వారంటీ, అలాగే 5.99 శాతం వడ్డీ రేటుతో లోన్ సదుపాయం అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు అన్ని డీలర్‌షిప్‌లలో ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న అధికారిక హోండా డీలర్‌ను సంప్రదించడం మంచిది.

Honda 350cc బైక్‌లలో ఏంటి ప్రత్యేకత?

Continues below advertisement

హోండా 350సీసీ సిరీస్‌లోని అన్ని బైక్‌లకూ ఒకే 348.36 సీసీ, ఎయిర్‌-కూల్డ్‌, ఫోర్‌-స్ట్రోక్‌, సింగిల్‌ సిలిండర్‌, ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌ను ఇస్తాయి. ఈ ఇంజిన్‌ OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సస్టెయినబిలిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా E20 ఫ్యూయల్‌కు కూడా సరిపోయేలా డిజైన్ చేశారు.

CB350 H’ness, CB350RS మోడళ్లలో ఈ ఇంజిన్‌ 20.7 bhp పవర్‌ను 5,500 rpm వద్ద, 30 Nm టార్క్‌ను 3,000 rpm వద్ద ఇస్తుంది. స్టాండర్డ్ CB350 మోడల్‌లో టార్క్‌ 29.5 Nmగా ఉంటుంది. అన్ని మోడళ్లకు 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. అయితే ప్రతి బైక్‌కు ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ డిజైన్‌ను హోండా అందించింది.

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఎక్స్‌-షోరూమ్‌ - ఆన్‌-రోడ్‌ ధరల వివరాలు

Honda CB350 H’ness

DLX వేరియంట్ -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,92,435 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.43 లక్షలుDLX Pro -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,95,175 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.46 లక్షలుDLX Pro Chrome -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,97,003 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.48 లక్షలు

Honda CB350RS

DLX -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1.97 లక్షలు & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.48 లక్షలుDLX Pro -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,99,744 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.51 లక్షలు

Honda CB350

DLX -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1.97 లక్షలు & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.35 లక్షలుDLX Pro -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹2 లక్షలు & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.52 లక్షలు

Honda CB350C

DLX -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,87,600 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.24 లక్షలుDLX Pro -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,99,900 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.38 లక్షలుSpecial Edition -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹2,01,900 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.40 లక్షలు

350సీసీ సెగ్మెంట్‌లో లగ్జరీ ఫీల్‌, స్మూత్‌ రైడింగ్‌, హోండా నమ్మకం కావాలనుకునే వారికి ఈ ఆఫర్లు మంచి అవకాశం. అదనపు లాభాలు, ఫ్రీ వారంటీ, తక్కువ వడ్డీ లోన్‌ కలిస్తే, ఇప్పుడు Honda 350cc బైక్ కొనడం తెలివైన నిర్ణయం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.