Age-based walking plans for weight loss : నడక ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె ఆరోగ్యం మొదలుకొని.. బరువు తగ్గడం వరకు నడక వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మీరు ఫిట్​గా ఉండాలి, బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా జిమ్​కి వెళ్లాల్సిన పని లేదు. అలా అని వ్యాయామాన్ని విస్మరించాలని కాదు. మీకు వేరే ఆప్షన్ దొరకనప్పుడు కచ్చితంగా నడవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల బరువును కూడా తగ్గొచ్చు. అయితే రోజుకు ఎంతసేపు వాక్​ చేయొచ్చు. ఎంత దూరం వాక్ చేస్తే బరువు తగ్గొచ్చు.. వయసు ప్రకారం ఈ లిమిట్ ఉంటుందా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


18-30 ఉంటే.. 


మీ వయసు 18 నుంచి 30 ఉంటే.. మీరు రోజుకు అరగంట నుంచి గంట వరకు వాకింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వయసులో ఎనర్జీ లెవెల్స్, కండరాల బలం, ఆరోగ్యం అన్ని రకాలు సహకరిస్తుంది కాబట్టి.. మీరు గంట తగ్గకుండా వాక్ చేయవచ్చు. బరువు తగ్గడానికి కనీసం రోజుకు గంట నడవాలి అంటున్నారు. 


31-50 లోపు వారైతే.. 


వయసు పెరిగే కొద్ది వాకింగ్​ కంటిన్యూ చేయాలి కానీ.. తగ్గించుకోవాలి. అంతేకానీ పూర్తిగా మానకూడదు. అయితే మీ వయసు 31 నుంచి 50 లోపు ఉంటే.. మీరు రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు వాక్ చేస్తే మంచిది. ఇలా రోజూ నడవడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి. అలాగే హెల్తీగా ఉంటారు. గుండె సమస్యలు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు. 


51-65 ఏళ్లు ఉంటే..


వయసురీత్యా మీరు రోజుకు 30 నిమిషాలు వాక్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల బోన్స్ హెల్తీగా మారుతాయి. కీళ్ల నొప్పులు కూడా ఉండవు. రోజూ వాక్ చేయడం వల్ల మెటబాలీజం పెరిగి బరువు అదుపులో ఉంటుంది. 


65కు పైగా


ఈ వయసులో కూడా వాక్ చేయవచ్చు. కనీసం 25 నిమిషాలు రోజూ వాక్ చేస్తూ ఉంటే.. మానసికంగా ప్రశాంతంగా ఉండడంతో పాటు.. వయసుతోపాటు వచ్చే వృద్ధాప్య సమస్యలు దూరమవుతాయి. 75 ఏళ్లు పైబడిన వారు 15 నిమిషాలు వాక్ చేస్తే యాక్టివ్​గా, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఏ వయసు వారైనా.. వాక్ చేసేప్పుడు కంఫర్టబుల్ షూలు ఎంచుకుంటే మంచిది. షూలు కరెక్ట్​గా లేకుంటే ఎక్కువ నడవలేరు. లేదంటే కాళ్లల్లో సమస్యలు వస్తాయి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. వాకింగ్​తో పాటు ఎక్సర్​సైజ్​ చేస్తూ ఉంటే గుండె హెల్తీగా ఉంటుంది. యాక్టివ్​గా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఆరోగ్యంగా లైఫ్​ని లీడ్ చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది. 



వాక్ చేసేందుకు మరిన్ని టిప్స్


రోజుకు కనీసం పదివేల అడుగులు వేసేలా చూసుకోండి. టైమ్​ కౌంట్ లేకుంటే.. స్టెప్ కౌంట్ అయినా ఫాలో అవ్వొచ్చు. బ్రిస్క్ వాకింగ్ లేదా రెగ్యూలర్ వాకింగ్ చేయడం వల్ల కేలరీలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారంలో కనీసం స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తే మరీ మంచిది. ఇది కండరాలు బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫిట్​నెస్ ట్రాకర్, మొబైల్ యాప్స్​తో స్టెప్స్​ని ట్రాక్ చేసుకోవచ్చు. అయితే వాకింగ్ స్టార్ట్ చేసే ముందు కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోండి. 



Also Read : ఉదయం నడిస్తే మంచిదా? సాయంత్రం నడక బెటరా? ఎప్పుడు వాక్ చేస్తే మంచిదో తెలుసా?