ABP Southern Rising Summit Gauthami Speech : నటిగా సినీ కెరీర్ మొదలు పెట్టి 36 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ప్రజలు ఈజీగా జడ్జ్ చేస్తారు. పర్సనల్ లైఫ్ గురించి గాసిప్ చేస్తారంటూ సినీ నటి గౌతమి వాపోయింది. తన లైఫ్‌లో జరిగిన అతి పెద్ద, సెన్సిటివ్ విషయాల గురించి ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పంచుకుంది గౌతమి. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన ప్రముఖ నటి, కాస్ట్యూమ్ డిజైనర్ గౌతమి తాడిమళ్ల ఏబీపీ నిర్వహించిన సమ్మెట్లో పాల్గొని.. ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను ఏబీపీతో పంచుకున్నారు.
జయలలిత..
ఈ సందర్భంగా ఆమె స్వర్గీయ జయలలితను గుర్తుచేసుకున్నారు. అన్నాడీఎంకేలోకి వెళ్లడానికి ఆమె రీజనా? అని అడిగిన ప్రశ్నకు.. గౌతమి బదులిస్తూ.. నాకు జయలలిత అంటే ఎనలేని అభిమానం ఉంది. ఆమె నటిగా ఉన్నప్పుడు నేను చిన్నపిల్లని.. రాజకీయాల్లోకి వచ్చాక ఆమెను మీట్ అయ్యాను. తను చాలా స్వీట్. నిజానికి రాజకీయాల్లోకి రావడానికి తను రీజన్ కాదు. అయినప్పటికీ రాజకీయాల్లో స్ట్రాంగ్ మహిళగా ఆమెంటే నాకు చాలా గౌరవం ఉంది.
క్యాన్సర్ సమయంలో..
నాకు క్యాన్సర్ వచ్చే సమయానికి నేను సింగిల్ పేరెంట్. ఆ సమయంలో నాకు ఏమి చేయాలో తెలియలేదు. కానీ అప్పుడు నేను నా కూతురు గురించి బాగా ఆలోచించాను. నేను లేకపోతే తన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నే నన్ను ఈ బ్యాటిల్‌ని గెలిచేలా చేసింది. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా నేను ఎంతో వీక్‌గా ఉన్నాను. చిన్నతనంలో పేరెంట్స్ లేకపోతే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా కూతురుకి ఆ పరిస్థితి రాకూడదని అనుకున్నాను. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నేను ముందుకు వచ్చాను.
బాధ ఉంటుందని అందరూ భయపెట్టారు. కానీ.. ఇది కూడా ప్రాబ్లమే.. దానిని నేను క్లియర్ చేసుకోవాలి. దానికి నా మైండ్‌ని స్ట్రాంగ్‌గా చేసుకోవాలని అనుకున్నాను. అదే మనోధైర్యంతో నేను ముందుకు వెళ్లాను. క్యాన్సర్‌ను జయించి మీ ముందు నిలిచాను. ప్రతి మహిళ గుర్తించాల్సింది ఏమిటంటే.. తమ లైఫ్‌లో ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ముఖ్యమని గుర్తించాలి. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటే దేనినైనా జయించవచ్చని గౌతమి తెలిపారు.
సినిమాల గురించి..
నేను సంవత్సరానికి 12 నుంచి 14 వరకు సినిమాలు చేసేదానిని. ఆ సమయంలో నాకు రెస్ట్ తీసుకునే సమయం ఉండేది కాదు. కానీ నాకు వర్క్ చేయడం నచ్చేది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వర్క్ చేసేదానిని. ఒక్కోసారి నేను ఏ సినిమాకి చేస్తున్నానో కూడా మరచిపోయేదానినంటూ ఆనాటి విషయాలను గౌతమి గుర్తు చేసుకున్నారు. సినిమా విషయాల్లో సెన్సిటివ్గా, రాజకీయ విషయాల్లో కాస్త కరకుగా ఉంటానని.. ఈ విషయంలో నేను చాలా సార్లు ఎమోషనల్ అయ్యాను. కానీ కొన్నిసార్లు ఇది తప్పట్లేదు అంటూ తెలిపారు. కొన్నిసార్లు కరకుగా ఉండడంలో తప్పు లేదని చెప్తారు.
Also Read : పొట్టిగా, మొండిగా ఉండే మహిళలు ఎక్కువకాలం బతుకుతారట : అన్యు ఆచార్య