పదివేలమందిపై పరిశోధన
ఈ తాజా అధ్యయనం గురించి ది యూరోపియన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ జెనిటిక్స్‌లో ప్రచురించారు. ఈ స్టడీలో భాగంగా పదివేల మంది మహిళలపై పరిశోధకులు స్టడీ చేశారు. హై రిస్క్ HPV ఇన్ఫెక్షన్ల గురించి, జన్యు వ్యాప్తిపై అసోసియేషన్ అధ్యయనం చేసింది. దీనిని డేటా ఆఫ్రికన్ కోలాబరేటివ్ సెంటర్ ఫర్ మైక్రోబయోమ్ అండ్ జెనోమిక్స్ రీసెర్చ్‌లో భాగంగా సేకరించింది. ఈ స్టడీలో పాల్గొన్నవారిలో మొత్తం 903 మంది మహిళల్లో హైరిస్క్ HPV ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. వీరిలో 224 మందికి HPV ఇన్ఫెక్షన్ అనేది పరిష్కారమైంది. కానీ మిగిలిన 679 మందికి ఈ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అయినట్లు గుర్తించారు. మిగిలిన వారంతా HPV ఇన్ఫెక్షన్ నెగిటివ్‌గా స్టడీలో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఆ క్యాన్సర్‌ను ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది..
యూనివర్శిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో మహిళల్లోని జన్యు వైవిధ్యాలు HPV సంక్రమణ ద్వారా ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్‌ను వచ్చే అవకాశాలు పెంచుతున్నాయని గుర్తించారు. నిర్దిష్టమైన జన్యు వైవిధ్యాలు.. HPV ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. మూనవ ల్యూకోసైట్ యాంటిజెన్ (HLA) అనే జన్యువులు.. HPV ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఇవి గర్భాశయ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయని తెలిపారు.
ఆ జెనిటిక్సే కారణం..
మానవ ల్యూకోసైట్ యాంటిజెన్ జన్యువులు.. నిరంతరం ఇన్ఫెక్షన్‌లతో సంబంధం కలిగి ఉంటాయని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ తెలిపారు. ఇవి గర్భాశయ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయని తెలిపారు. దీనిప్రకారం కొందరు మహిళలు రెగ్యూలర్‌గా ఈ HPV ఇన్‌ఫెక్షన్‌లతో ఇబ్బంది పడే అవకాశముందని తెలిపారు. దీనివల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
HPV ఇన్ఫెక్షన్ కారకాలు, లక్షణాలు
HPV అనేది అత్యంత సాధారణ STIగా చెప్పవచ్చు. ఈ వైరస్ ఉన్నవారితో యోని, ఓరల్‌గా లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా యోని లేదా అంగ సంపర్క సమయంలో ఇది వ్యాపిస్తుంది. HPV ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ఎలాంటి సంకేతాలు లేకుండా కూడా ఈ వ్యాప్తి జరుగుతుంది. జననేంద్రియ ప్రాంతంలో మొటిమలు, క్యాన్సర్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలు దీనివల్ల వస్తాయి. ఈ వైరస్ రాకుండా నిరోధించే వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి.
Also Read : అమ్మాయిలు ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త