ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఇంద్ర భవనంలాంటి ఇల్లే కాదు, తమ ప్రపంచాన్ని సొంతంగా సృష్టించుకునేందుకు ఒక ఐలాండ్ కూడా ఉండాలని కలలు కంటారు.  అలాంటి వారి కోసమే అప్పుడప్పుడు ఐలాండ్స్ అమ్మకానికి వస్తుంటాయి. ప్రస్తుతం మరో ఐలాండ్ అమ్మకానికి ఉంది.  ఆ ద్వీపం పేరు ఇగ్వానా. ఈ ఐలాండ్ కరీబియన్ ప్రాంతంలో నికారాగ్వాకు దగ్గరలోని సముద్ర తీరానికి 12 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ఒక అగ్నిపర్వత ద్వీపం. చుట్టూ సముద్రంతో, ఆకుపచ్చని అందాలు నిండుగా ఉన్న ఈ ద్వీపం సూర్యోదయ, సూర్యోస్తమయాలను చాలా అందంగా చూపిస్తుంది.


 దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి చెట్,లు అరటి చెట్లతో నిండిపోయి ఉంటుంది. దీన్ని privateislandsonline.comలో ఆన్లైన్లో అమ్మకానికి ఉంది. ఈ ద్వీపం పిచ్చిమొక్కలతో నిండిపోయిన అడవిలా ఉండదు. రోడ్లు, మూడు గదుల బెడ్ రూమ్, రెండు బాత్రూమ్‌లతో కూడిన భవనంతో నివాసయోగ్యంగా ఉంటుంది. ఈ ద్వీపానికి ఒక మేనేజర్, బాగోగులు చూసే పనివారు కూడా ఉన్నారు. సెప్టిక్ సిస్,టం వాటర్ క్యాచ్ మెంట్ సిస్టం కూడా ఉంది. ఇంటర్నెట్, ఫోన్ సేవలు కూడా ఉన్నాయి. మౌలిక సదుపాయాల విషయంలో ఏ లోపం లేదు. పర్యాటకులను ఆకర్షించడంలో ఈ ద్వీపం ముందుంటుంది. దీన్ని కొనుక్కొని పర్యాటకులకు అద్దెకి ఇచ్చుకుంటే మంచి ఆదాయ వనరుగా మారుతుంది. దీని ధర మూడు కోట్ల 86 లక్షల రూపాయలు. పెద్ద పెద్ద నగరాల్లో కేవలం ఫ్లాట్ ధర మూడు కోట్ల రూపాయల పైనే ఉంటుంది. అలాంటిది 5 ఎకరాల ద్వీపం అతి తక్కువ దొరికే వస్తుంటే ధనవంతులు కొనేందుకు ఎగబడకుండా ఉంటారా?


ప్రస్తుతం ఈ ద్వీపాన్ని ఇంకా ఎవరూ కొనలేదు. ఆన్ లైన్లో బిడ్డింగ్లు జరుగుతున్నాయి. నచ్చిన వాళ్లు అంత ఖరీదు పెట్టి కొనుక్కోవచ్చు. సెలవులను అక్కడ ఎంజాయ్ చేసి రావచ్చు. అలాగే పర్యాటకులకు అద్దెకు ఇచ్చి భారీగా సంపాదించవచ్చు. 






Also read: చలికాలంలో వాడే వీటి వల్ల శ్వాసకోశ సమస్యలు? గుండెపోటు వచ్చే అవకాశం కూడా?