Healthy Laddu Making : మల్టీగ్రెయిన్ సూక్ష్మ పోషకాలతో నిండి ఉంటుంది. మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ మొదలైనవి దీనిలో ఉన్నాయి. ఇవి మీ శరీరం గరిష్ట స్థాయిలో పని చేయడానికి ఎనర్జీనిస్తాయి. అంతేకాకుండా ఇవి ప్రోటీన్​కు మంచి మూలం. పెద్దల నుంచి పిల్లల వరకు వీటినుంచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే వీటితో మీరు టేస్టీ, హెల్తీ లడ్డూలు తయారు చేసుకోవచ్చు. మరి వీటిని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


మల్టీ గ్రెయిన్స్ - 200 గ్రాములు


బెల్లం - 150 గ్రాములు


యాలకుల పొడి - చిటికెడు


నెయ్యి - 20 గ్రాములు


డ్రై ఫ్రూట్స్ - గార్నిష్​కి తగినన్ని


తయారీ విధానం


ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయిని ఉంచండి. దానిలో మల్టీగ్రెయిన్స్ వేయండి. మంటను స్లో చేసి.. మల్టీగ్రెయిన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అవి కాస్త బ్రౌన్​ కలర్​లోకి మారిన తర్వాత స్టౌవ్ ఆపేసి వాటిని కాస్త చల్లారనివ్వండి. అనంతరం వేయించుకున్న మల్టీగ్రెయిన్స్​ని మిక్సీజార్​లో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ పొడిగా కాకుండా కాస్త బరకగా ఉండేలా మిక్సీ చేసుకోండి. 


స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టండి. దానిలో 125 మి.లీ నీరు వేయండి. మంటను తగ్గించి.. బెల్లం పాకంగా మారేవరకు కలుపుతూ ఉండాలి. బెల్లం పాకంగా మారిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం బెల్లం తీసుకుని నీటిలో వేయాలి. అది ఉండగా మారితే పాకం సిద్ధం. లేదంటే మరికాసేపు దానిని ఉడికించాలి. తయారైన బెల్లం పాకంలో మల్టీగ్రెయిన్ పౌడర్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. బెల్లంలో పౌడర్ బాగా కలిసేలా తిప్పండి. ఇప్పుడు దానిలో నెయ్యి వేసి కలిపి చల్లారనివ్వండి. 


ఈ మిశ్రమంలో చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి.. బాగా కలిపి లడ్డూలుగా చుట్టండి. లేదంటే లడ్డూలు చుట్టి.. దానిపై డ్రై ఫ్రూట్ మిక్స్​ని వేయొచ్చు. అంతే టేస్టీ, హెల్తీ మల్టీ గ్రెయిన్ లడ్డూలు రెడీ. వీటిని మీరు రెగ్యూలర్​గా మీ డైట్​లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే వీటిలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. మల్టీ గ్రెయిన్స్ డైటరీ ఫైబర్​తో నిండి ఉంటాయి. ఇవి మలబద్ధకం, జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. పేగు కదలికలను ప్రోత్సాహిస్తాయి. 


బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్​లో వీటిన భాగం చేసుకోవచ్చు. దీనిలోని అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ సమస్యలను దూరం చేస్తుంది. ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గడానికి మీరు తక్కువ కేలరీలున్న ఫుడ్స్ తీసుకోవాలి. మల్టీగ్రెయిన్స్​లోని ఫైబర్ కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఎందుకంటే ఫైబర్ కొలెస్ట్రాల్​ను మీ ధమనులలో చేరనివ్వదు. అందుకే అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు మల్టీగ్రెయిన్ బ్రెడ్​కు మారాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే శరీరంలో బ్లడ్ షుగర్స్ కంట్రోల్​లో ఉంటాయి. ఇవి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. 


Also Read : అలోవెరా జ్యూస్​తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో.. అలా తీసుకుంటే ఇంకా మంచిదట