Dave Pascoe Biological Age : వృద్ధాప్య ప్రక్రియను తగ్గించుకోవడం కోసం బయోహాక్ చేసేవారు ఉన్నారు. అలాంటివారిలో డేవ్​ పాస్కో ఒకరు. ఈ బయోహ్యాకర్ మిచిగాన్​కు చెందిన వాడు. పాస్కో పుట్టి 61 ఏళ్లు అవుతున్నా.. అతని శరీరం ఇంకా 38 ఏళ్లుగానే ఉందంటూ తెలిపి అందరినీ విస్మయానికి గురించేశాడు. ఈ రిటైర్డ్ నెట్​వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్.. ఇప్పుడు తన పూర్తి సమయం బయోహ్యాకర్​గా మారిపోయాడు. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం వయసును వెనక్కి తిప్పడమే. అలా ఇప్పుడు తన బయోలాజికల్ ఏజ్​ను 38కి తెచ్చుకున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది. అసలు ఈ డేవ్ పాస్కో ఎలా ఈ ఫిట్​నెస్​ని సాధించాడు? ఎలాంటి ఫుడ్ తీసుకున్నాడు వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


అతని లైఫ్​స్టైల్ ఎలా ఉందంటే..


డేవ్​ పాస్కో తన 61 ఏళ్ల వయసును.. తన బయోలాజికల్ వయసును 38 ఏళ్లకు తెచ్చుకున్నాడు. తన వయసుకంటే ముందు తన ఆరోగ్య సమస్యలతో చనిపోకూడదనే లక్ష్యంతో అతను తన జీవనశైలిని డిజైన్ చేసుకున్నాని తెలిపాడు. ఫుడ్, ఎక్సర్​సైజ్​, సప్లిమెంట్లు, కఠినమైన నియమాలతో తన బయోలాజికల్ ఏజ్​ను 38 ఏళ్లకు తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన విషయాలను పాస్కో తన వెబ్​సైట్​లో పొందుపరిచాడు. దానిలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అతను దానిలో రాసుకొచ్చాడు. 


రోజుకు 158 సప్లిమెంట్లు తీసుకుంటాడట..


పాస్కో సూర్యోదయానికి ముందే.. ఆరుబయట అతను చేయాల్సిన వ్యాయామాలు అన్ని పూర్తి చేసుకుంటాడట. ఇక తర్వాత బయటకు వెళ్లడు. నిర్దిష్టమైన ఆహారాన్ని తీసుకుంటానని తెలిపాడు. ప్రతిరోజూ 158 సప్లిమెంట్లు తీసుకుంటాడు. జీవితకాలనికి సమానమైన ఆరోగ్యాన్ని సంపాదించడమే అతని అంతిమ లక్ష్యమని పాస్కో తెలిపాడు. ఇప్పటికే దానిని సాధించినట్లు తెలిపాడు. 90 ఏళ్లలోపు 110 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా జీవించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించాడు. ఈ లక్ష్యానికి తగ్గట్లు తన జీవనశైలిని మార్చుకున్నట్లు తెలిపాడు. 


బరువు పెరగకుండా ఏమి ఫాలో అవుతారంటే..


పాస్కో తన సమయం తనకి చాలా ముఖ్యమైనదని చెప్తారు. దానికి తగ్గట్లు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటానని.. ఇతరులతో సమయం గడిపేందుకు తన సమయం ఇవ్వనని తెలిపాడు. ఒంటరిగా ఉంటూనే.. వ్యాయామం కోసం సమయాన్ని కేటాయిస్తూ.. ఆవిరి లేదా బయోహాక్ చేస్తానని వెల్లడించాడు. ఫుడ్ విషయానికొస్తే.. భోజనం అరుదుగా చేస్తాడట. దానికి బదులుగా మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్యలో డిన్నర్ ఫినిష్ చేస్తాడట. కార్బోహైడ్రేట్​లను లిమిట్ చేయడం వల్ల బరువు పెరగకుండా.. వృద్ధాప్య ఛాయలు రాకుండా వయసును తగ్గించుకున్నట్లు తెలిపాడు. 



అలారం పెట్టుకోడట.. కానీ


పాస్కో నిద్రలేవడానికి అలారం కూడా పెట్టుకోడట. తనకు సహజంగా మెలకువ వచ్చేవరకు నిద్రపోతానని చెప్తున్నాడు. అయితే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుందట. నిద్ర లేచిన తర్వాత 15 నిమిషాలు ఫ్లోర్​ స్ట్రెచ్​లు చేసి తన మార్నింగ్ రోటీన్ స్టార్ట్ చేస్తాడట. తన మార్నింగ్ సప్లిమెంట్స్ తీసుకునే గంటముందు బ్రష్ చేస్తాడట. కాల్షియం, డి విటమిన్, విటమిన్ డి3 మాత్రతో సహా 82 మార్నింగ్ సప్లిమెంట్స్​ తీసుకుంటానని తెలిపాడు. ఆరుబయట సూర్యరశ్మి కోసం జాగింగ్, రన్నింగ్ చేస్తాడు. అనంతరం స్టీమ్ బాత్ చేసి.. 45 నిమిషాలు ధ్యానం చేసి.. విశ్రాంతి తీసుకుంటాడు. 


ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడంటే


అల్పాహారానికి ముందు ఒక పచ్చి అరటిపండు, చియా నట్ బెర్రీ బౌల్​ వర్కవుట్​ సప్లిమెంట్ షేక్​ను తీసుకుంటాడు. ఎక్కువ విషయాల గురించి ఒత్తిడి తీసుకోడట. బీఫ్, ఫ్రీ రేంజ్ చికెన్ లేదా వైల్డ్ ఫిష్​లను తన ఫుడ్​గా తీసుకుంటాడట. అలాగే కూరగాయలు కూడా తన డైట్​లో భాగమని.. రెగ్యూలర్​గా వెల్లుల్లి, పలు రకాల హెర్బల్స్ తీసుకుంటానని వెల్లడించాడు. బయటకు వెళ్లేప్పుడు సన్​లైట్​కి వెళ్లడం తగ్గించి.. వెళ్లాల్సి వస్తే మాత్రం బ్లూ బ్లాకింగ్ గ్లాస్​ ఉపయోగిస్తానని పేర్కొన్నాడు. 


సంవత్సరానికి 30వేల డాలర్లు ఖర్చుపెడతాడట


పడుకునే సమయంలో బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ.. వ్యాయామాలు చేస్తానని పాస్కో తన వెబ్​సైట్​లో పేర్కొన్నాడు. స్కిన్ సీరమ్, క్రీమ్​లతో తన లుక్​ని కాపాడుకుంటాడట. కొల్లాజెన్​ పెప్టైడ్​లను స్కిన్​ కేర్​లో ఉండేలా చేసుకుంటాడు. ఈ బయో హ్యాకింగ్​లో భాగంగా.. సప్లిమెంట్స్, స్కిన్ కేర్ కోసం సంవత్సరానికి అతను 30వేల డాలర్లు ఖర్చుపెడుతున్నాడు.


నిపుణులు ఏంటున్నారంటే.. 


బయోహ్యాకింగ్ ద్వారా.. ఆరోగ్యాన్ని అనుకూలంగా ఉంచుకోవడానికి, వృద్ధాప్యాన్ని తగ్గించుకోవడానికి వివిధ పద్ధతులతో ప్రయోగాలు చేస్తారు. అయితే నిపుణులు మాత్రం ఇలాంటి విధానాలు శాస్త్రీయ ధృవీకరణను కలిగి ఉండవని.. అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తున్నారు. వీటిని వైద్యుల సూచనలు లేకుండా ఫాలో అవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. 


Also Read : సమ్మర్​లో పీరియడ్స్ లేట్ అవుతున్నాయా? అయితే ఈ ఆసనాలు వేసేయండి










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.