Abhishek-Aishwarya’s 17th Wedding  Anniversary Photo: బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఐశ్వర్య చిన్నతనంలోనే మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు తెచ్చుకుంది. ఇక దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అభిషేక్, పలు చిత్రాల్లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.


2007లో ప్రేమ వివాహం చేసుకున్నన అభిషేక్-ఐశ్వర్య


ఐశ్వర్య, అభిషేక్ ఏప్రిల్ 20, 2007లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వారిద్దరూ కలిసి నటించిన ‘గురూ’ సినిమాలో నటించారు. షూటింగ్ సమయంలో ఐశ్వర్యతో ప్రేమలో పడిన అభిషేక్.. ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఆరాధ్య అనే పాప పుట్టింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఐశ్వర్య.. ఆరాధ్య పుట్టిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచనలో పలు సినిమాల్లో నటించినా.. ఎందుకో మళ్లీ బ్రేక్ తీసుకొని ప్రస్తుతం యాక్టింగ్‌కు దూరం ఉంటోంది.


అట్టహాసంగా వెడ్డింగ్ యానివర్సరీ


తాజాగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. తన కూతురు ఆరాధ్యతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య, అభిషేక్ తమ కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ ఫోటోకు క్యాప్షన్ గా  ఐశ్వర్య రాయ్ హార్ట్ ఎమోజీని పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పలువురు సినీ స్టార్స్ తో పాటు సినీ అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు.   






ఐశ్వర్య- అభిషేక్ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు


అటు అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ ‘అంతా అయిపోయింది’ అన్నట్టుగా అర్థం వచ్చేలా ఒక కొటేషన్‌ను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో విడాకుల వార్తల ప్రచారం మరింత ఊపందుకుంది. అభిషేక్ బచ్చన్ వ్యవహార శైలి కూడా గతంలో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. సాధారణంగా ఆయన వెడ్డింగ్ రింగ్ ను ఎప్పుడూ తీయడు. కానీ, గతంలో కొన్నిసార్లు చేతికి రింగ్ లేకుండా కనిపించాడు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తల గురించి బచ్చన్ ఫ్యామిలీ స్పందించలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు.


Read Also: భర్తను కోల్పోయిన ఆమె రెండో పెళ్లికి ఒప్పుకోదు - కానీ, ఆ ‘కోరిక’ తీర్చాలంటుంది.. గుండె బరువెక్కించే మూవీ ఇది